రాజ్ కోపంగా బెడ్ అంతా చిందరవందర చేస్తుంటే రాహుల్ వచ్చి మరింత ఆజ్యం పోస్తాడు. నీ కోపాన్ని నీమీద కాదు తప్పు చేసిన వాళ్ళ మీద చూపించు. నిన్ను ఇంత మోసం చేసిన కళావతి మీద చూపించమని చెప్పి మందు తెచ్చి రాజ్ తో బలవంతంగా తాగిస్తాడు. జరిగింది అంతా గుర్తు చేసుకో ఇదంతా స్వప్న వెళ్ళిపోవడం వల్ల జరగలేదు. ఈ కళావతి స్వప్నని వెళ్లిపోయేలా చేసింది. తనని కావాలని తప్పించి ఈ కళావతి కూర్చుని ఉంటుంది. కావాలనే డబ్బు కోసం నీతో తన మెడలో తాళి కట్టించుకుని ఉండి ఉంటుంది. అంతా గుర్తు చేసుకో నువ్వు ఎంత మోసపోయావో అర్థం అవుతుందని అంటాడు. స్వప్నని కూడా ఆ కళావతి వెళ్లిపోయేలా చేసి ఉంటుందని రాజ్ రాహుల్ మాటలు నమ్మి కోపంగా కావ్య దగ్గరకి వెళ్తాడు. ఈ శోభనం జరగకూడదని ఇలా ప్లాన్ వేశానని రాహుల్ నవ్వుకుంటాడు.


ఫుల్లుగా తాగి మెట్లు దిగుతూ పడబోతుంటే కళ్యాణ్ వచ్చి పట్టుకుంటాడు. ఎవరికైనా నువ్వు తాగావని తెలిస్తే ఏమవుతుందని అంటాడు. దీనంతటకి కారణం కళావతే నా జీవితంలో నిప్పులు పోశావ్ కదే అని అరుస్తూ కావ్య దగ్గరకి వెళ్లబోతుంటే పాపం వదిన చిన్న పిల్ల వద్దు అన్నయ్య అని కళ్యాణ్ ఆపేందుకు ట్రై చేస్తాడు. వదినని భార్యగా యాక్సెప్ట్ చేశారా పైన జరగాలసిన శోభనం ఇప్పుడు కింద జరుగుతుందని అనుకుంటాడు. రాజ్ కావ్య గది దగ్గరకి వెళ్ళి డోర్ తీయి అని అరుస్తాడు. గడి పెట్టి ఉండటం చూసి లాక్ తీసి లోపలికి వెళతాడు.


Also Read: విన్నీని హగ్ చేసుకుని ఐలవ్యూ చెప్పిన వేద- ముక్కలైన యష్ హృదయం


కావ్య: ఎందుకు వచ్చారు


రాజ్: నువ్వు నా జీవితంలో నిప్పులు పోశావ్ కదా అందుకే నీ జీవితంలో నిప్పులు పోయాడానికి వచ్చాను. శోభనానికి రెడీ అయిపోయావా రెండో సారి కూడా నా జీవితంలో నిప్పులు పోయాడానికి రెడీ అయ్యావా? మరి ముసుగు ఏది అని తన గదిలోకి వెళ్ళి లోపల గడి పెట్టేస్తాడు


కావ్య: తాగేసి ఇలా గదిలోకి రావడం కరెక్ట్ కాదు.. పొద్దున్నే మాట్లాడుకుందామని వెళ్లిపొమ్మని చెప్తుంది కానీ రాజ్ వినడు. తన మీద మీదకి వస్తూ ఉంటాడు. నీ మెడలో తాళి కట్టినందుకు మా అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? అసలు నువ్వు పెళ్ళిలో ఎందుకు ముసుగు వేసుకున్నావ్. నా జీవితంలో ఎందుకు నిప్పులు పోశావ్. నీ ముసుగులోనే ఉంది లొసుగు. ఈరోజు నేను నీకు వేసే శిక్ష లైఫ్ లాంగ్ భరించాలని కళ్ళు తిరిగి కావ్య మీద పడిపోతాడు. మీ అమ్మగారు ఈ గదిలోకి అడుగుపెట్టను అన్నారు, మీరేమో ఈ గదిలోకి వచ్చి పడుకున్నారు. ఎందుకో నాకు ఇది నచ్చలేదు. నువ్వు ఎంత అందంగా ఉన్నా నిన్ను జీవితంలో క్షమించను. నీ మోసాన్ని బయట పెడతాను అని నిద్రలో కలవరిస్తూ మాట్లాడతాడు. కావ్య చేయి వదలకుండా గట్టిగా పట్టుకుని నిద్రపోతాడు.   


అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. రాజ్ శోభనం గురించి ఒప్పుకోలేదని ఇంద్రాదేవి చెప్తుంది. రుద్రాణి అది విని రాహుల్ బాగా చెడగొట్టాడని లోలోపల సంబరపడుతుంది. శోభనం జరగలేదని అపర్ణతో అంటుంది. రాజ్ కి మెళుకువ వచ్చి చూసేసరికి కావ్య గదిలో ఉంటాడు. కళావతి రూమ్ లో ఉండటం ఏంటి? నిద్రపోతున్న నన్ను కళావతి ఎత్తుకుని వచ్చిందా? ఏం జరిగింది? రాత్రంతా ఈ పుట్టలో పడుకున్నాన ఈ పాము ఏది అనుకుని కంగారుగా చెప్పులు చేత పట్టుకుని కావ్య గదిలో నుంచి బయటకి వచ్చేసరికి హాల్లో అందరూ రాజ్ ని చూసి షాక్ అవుతారు.


Also Read: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక


రాజ్ వెళ్లిపోతుంటే అపర్ణ ఆపుతుంది. ఏంటి ఈ శ్రీకృష్ణ లీలలు అని ఇంద్రాదేవి కౌంటర్ వేస్తుంది. శోభనం గది అంతగా అలంకరిస్తే ఇదేం ఖర్మరా అని రాజ్ తాతయ్య, నానమ్మ కాసేపు ఆడుకుంటారు. ఏం జరగలేదని రాజ్ చెప్తాడు కానీ అపర్ణ కొడుకు షర్ట్ మీద బొట్టు చూసి రగిలిపోతుంది.