తన తలకి సాంబ్రాణి వేస్తూ యష్ ముద్దు పెట్టినట్టు వేద ఊహించుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు యష్ తన దగ్గరకి వచ్చి నిజంగానే సాంబ్రాణి వేస్తాడు. థాంక్స్ చెప్తుంది. సాయంతోనే బంధం మొదలవుతుందంట ప్రేమతో ఆ బంధం బలపడుతుందట అని యష్ అంటాడు. భార్య జీవితంలో అన్నింటికన్నా పెద్ద గీత భర్తేనటని వేద అంటుంది. ఇది కదా నేను కోరుకున్న సంతృప్తి ఒప్పందంగా మొదలైన మన పెళ్లి బంధంగా మారాలి. ఖుషికి అమ్మగా స్థానం ఇచ్చిన మీరు మీ భార్యగా మీ మనసులో చోటు ఇవ్వాలి. మీ జీవితంలో పాత గీతలన్నీ చెరిగిపోవాలి. నేనే ఇంపార్టెంట్ అవాలని మనసులోనే అనుకుంటుంది. నా భర్త మీద గుండెల్లో దాచుకున్న ప్రేమని యానివర్సరీ ఫంక్షన్లో అందరి ముందు ఆయనకి తెలియజేస్తాననుకుంటుంది.


Also Read: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక


ఖైలాష్ వచ్చి కాలేజ్ డేస్ లో వేద, విన్నీ కలిసి ఉన్న ఫోటోస్ తీసుకొచ్చి అభిమన్యుకి చూపిస్తాడు. ఇవి సరిపోవు వేద విన్నీ కలిసి ఉన్నట్టు, కిస్ చేసుకున్నట్టు మార్ఫింగ్ చేసి పంపించు. తన బాయ్ ఫ్రెండ్ వేద బాయ్ ఫ్రెండ్ తో బూతు బాగోతం చేసినట్టు చూసి యష్ గుండె పగిలిపోతుందని ఐడియా ఇస్తాడు. ఈ దెబ్బతో యశోధర్ బకరా అయిపోతాడని యష్ సంబరపడతాడు. వేద విన్నీ కోసం ఎదురుచూస్తుంది. వేద చక్కగా రెడీ అవడం చూసి చాలా అందంగా ఉన్నావని అంటాడు. గిఫ్ట్ ఎక్కడ అంటే ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి ఇస్తాడు. యష్ లైఫ్ లోనే ఇది తీపి గుర్తులాగా ఉండాలి అందుకే ఇది తీసుకొచ్చానని చెప్తాడు. నీకోసం ఏదైనా చేస్తానని విన్నీ చెప్తే అంత పిచ్చి ఎందుకని అడుగుతుంది. నీకోసం ఏమైనా చేస్తానని నువ్వంటే అంత పిచ్చి నాకు అని అంటాడు. ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేసి చూసి వేద ఎమోషనల్ అవుతుంది.


Also Read: కొత్తకోడలిని ఇంట్లోకి రానివ్వకుండా చేసిన రాజ్యలక్ష్మి- దివ్య డాక్టర్ జాబ్ పోతుందా?


ఇది గిఫ్ట్ కాదు నా జీవితమని ఫోటోలో ఉన్న ఖుషి, యష్ ని ముద్దు పెట్టుకుంది. ఏ ఖుషి కోసమైతే మా జీవితం మొదలైందో ఆ ఖుషితో ఉన్న పెయింటింగ్.. ఇంత గొప్ప గిఫ్ట్ ఇంకేముంటుంది. నాకు ఏది కావాలో తెలుసుకుని చేస్తావు. నువ్వు ట్రూ ఫ్రెండ్ అని థాంక్స్ చెప్తుంది. మీరు ముగ్గురు కలిసి ఉండాలని ఈ గిఫ్ట్ ఇస్తున్నా అనుకున్నావ్ కదా కానీ నా ప్లాన్ వేరు. ఇలా చేసి యష్ కి వేద మీద కోపం తెప్పించి విడిపోయేలా చేయాలని విన్నీ అనుకుంటాడు. ఫంక్షన్ కి అందరూ వస్తారు. మా అమ్మానాన్న ఎంత గొప్పవాళ్ళో చెప్పాలంటే నా సంతోషంలో చూడవచ్చు. వాళ్ళ కోసం నేను పుట్టలేదు. నా కోసం వాళ్ళు పుట్టారు. అమ్మ, నాన్న ఐలవ్యూ సో మచ్ అని ఖుషి మాట్లాడుతుంది. యష్, వేద ఫంక్షన్ దగ్గరకి వస్తూ ఉంటారు. ఈ క్షణాలు మన జీవితంలోనే మధుర క్షణాలుగా మిగిలిపోతాయని యష్ మనసులో అనుకుంటే ఈ క్షణం కోసమే ఎదురుచూశానని వేద అంటుంది. యష్, వేద సంతోషంగా ఉండటం చూసి ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి విన్నీ నిప్పు పెడతాడు.