గుప్పెడంతమనసు మార్చి 29 ఎపిసోడ్


ఒకప్పటిలా జర్నీ మళ్లీ ప్రారంభిద్దాం అనుకుంటారు రిషిధారలు. పొద్దున్నే లేచి రిషి అప్పట్లో ఉన్నట్టే స్టైలిష్ గా రెడీ అయి బయలుదేరుతాడు. అప్పటికే వసుధార..జగతి..మహేంద్ర కాలేజీకి వెళ్లిపోతారు. ధరణి ద్వారా ఆవిషయం తెలుసుకున్న రిషి.. వెళ్లేటప్పుడు వారి ముఖకవళికలు ఎలా ఉన్నాయి వదిన అని అడిగితే  నేను కిచెన్ లో ఉండి పని చేసుకుంటున్నాను కానీ వాళ్ళ వాయిస్ వినిపించింది కానీ వాళ్ళ ఫేసెస్ నేను చూడలేదు రిషి అని అంటుంది ధరణి. సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత జగతి, మహేంద్ర, వసుధార కార్లో వెళ్తుండగా ఇప్పుడే మొదలైంది అని రిషి మెసేజ్ చేయగా అవును సార్ అని రిప్లై ఇస్తుంది వసు. జగతి మాత్రం..ఈ వసుధార కొత్తగా మాతో వస్తోంది ఏంటి.. ఏమైనా జరిగి ఉంటుందా అని అనుకుంటూ వసు అంతా బాగానే ఉందా అని అడిగితే ఫైన్ మేడం అంటుంది వసుధార..


ఆ తర్వాత వసుధార ఒక లెటర్ పట్టుకుని రిషి కోసం ఎదురు చూస్తుండగా రిషి రావడంతో ఐ యామ్ వసు సార్ జాయిన్ అవ్వడానికి వచ్చాను అంటుంది. అయితే కాలేజీలో ఎంతోమంది జాయిన్ అవ్వాలి అనుకుంటారు అవి జరగవు కదా అని అంటాడు రిషి. అప్పుడు మొదట్లో వసుధార ని చూసి ఏ విధంగా ప్రవర్తించాడో అలాగే ప్రవర్తిస్తాడు రిషి. నన్ను జగతి మేడం పంపించారు ఒక్కసారి ఈ లెటర్ చదవండి అనడంతో రిషి కోపంతో ఆ లెటర్ చింపేసి ఇంకొకసారి ఆవిడ గారి పేరు నా దగ్గర తీసుకురాకు అని వెనక్కు వెళ్లిపోతుండగా అక్కడ జగతి ఎదురుపడుతుంది
రిషి: ఇంతకుముందు జగతి అనే పేరు వింటే నాకు నచ్చేది కాదు ఇప్పుడు గౌరవం పెరిగింది...ఆమె అంటే డాడీకి ప్రాణం... తప్పు ఇలా ప్రవర్తించకూడదు అని మనసులో అనుకుని జగతికి సోరీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు
అయోమయంలో ఉన్న జగతి..వసుధార దగ్గరకు వెళ్లి ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు, ఏం జరుగుతోందని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది
వసు: ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దన్న రిషి మాటలు గుర్తుచేసుకుని ప్రస్తుతానికి ఏమీ చెప్పలేము..అవే తెలుస్తాయి
జగతి: ఏం జరిగిందో అనే కంగారు నాకుంటుంది కదా
వసు: కంగారు అవసరం లేదు మేడం..కొన్ని నిర్ణయాల వల్ల మంచే జరుగుతుందని చెప్పేసి వెళ్లిపోతుంది..


జగతి తన రూమ్ లో కూర్చుని ఆలోచిస్తుంటుంది..ఇంతలో మహేంద్ర వచ్చి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావ్..మీటింగ్ కి వెళ్లాలి కదా పద అంటాడు
జగతి: ఎప్పుడు రిషి కార్ లో వచ్చే వసు ఈరోజు మన కారులో వచ్చింది. వారిద్దరి మధ్య దూరం పెరుగుతుందేమో అని భయంగా ఉంది. మార్నింగ్ నాకు రిషి కాలేజ్ కి వచ్చిన తర్వాత కారణం ఏంటో తెలియదు కానీ సారీ చెప్పాడు
మహేంద్ర: నాకేం అలా అనిపించడం లేదు
జగతి: అదే విషయం గురించి వసుధారని అడిగితే మీరేం టెన్షన్ పడకండి మేడం అంతా మన మంచికే అని చెప్పేసి వెళ్లిపోయింది 
మహేంద్ర: ఆ భరోసా ఇచ్చింది కదా జగతి ధైర్యంగా ఉండు 
జగతి: నాకెందుకో మనిద్దరం వాళ్ళని పట్టించుకోలేదు అనిపిస్తోంది
మహేంద్ర: మనం చేయాల్సినవి చేస్తున్నాం వాళ్లు సంతోషంగానే ఉంటున్నారు కదా..మీటింగ్ కి వెళదాం పద.. అక్కడ వాళ్ళిద్దరినీ గమనిద్దాం ఏదైనా కొత్తగా ప్రవర్తన ఉంటే తెలిసిపోతుంది కదా 


Also Read: నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోనా, టైమ్ మిషన్లో వెనక్కు వెళ్లి కొత్త ప్రయాణం ప్రారంభించిన రిషిధార!


మీటింగ్ జరుగుతూ ఉంటుంది.. రిషి వసుధార ఇద్దరు ఒకరికొకరు సంబంధం లేదు అన్నట్టుగా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉండడంతో జగతి, మహేంద్ర అసలు ఏం జరుగుతోంది మహేంద్ర ఏంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటారు. చూడు జగతి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అన్నావ్.. వాళ్లు చూడు ఎప్పటిలాగే ఒకే మాదిరిగానే ఉన్నారు అనడంతో నాకు అంత అయోమయంగా ఉంది మహేంద్ర అంటుంది.  ఉదయం అలాగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా ఫ్రెండ్లి గా ఎలా మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది జగతి. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని సీరియస్ గా తీసుకోకూడదు అని చెప్పాను జగతి అంటాడు మహేంద్ర. మీటింగ్ అయిపోతుంది


Also Read:  మార్చి 29 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు పర్సనల్ లైఫ్ -ప్రొఫెషనల్ లైఫ్ బాగా బ్యాలెన్స్ చేస్తారు


రిషి-వసు: రిషి గ్రౌండ్ కి వెళ్లడం గమనించి వెనుకే వెళుతుంది వసుధార.. ఇక్కడికి ఎందకు వచ్చావ్..ఆడటం వచ్చా అని రిషి అడిగితే చూడ్డానికి కూడా రావొచ్చు కదా సార్ అని రిప్లై ఇస్తుంది. గేమ్ రాదా అనగానే నేర్పిస్తారా సార్ అని బాస్కెట్ బాల్ గ్రౌండ్ లోకి దిగుతుంది.. ఇంక సార్ వారు నేర్పిస్తుంటారు..అమ్మాయిగారు నేర్చుకుంటారు..మధ్య మధ్యలో కిందపడడం..జారిపడకుండా పట్టుకోవడం.. వెనుకే రొమాంటిక్ ట్రాక్.. బాల్ ని పక్కనపడేసి ఒకర్నొకరు చూసుకోవడం...అదీ సంగతి.. జాగ్రత్త పడిపోతావని రిషి అంటే పట్టుకోవడానికి మీరున్నారు కదా అని రిప్లై ఇస్తుంది. జీవితంలో అయినా ఆటలో అయినా జాగ్రత్తగా చూసుకుని అడుగేయాలి. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మెట్లపై కూర్చుంటారు...మళ్లీ గతంలో జరిగినవన్నీ గుర్తుచేసుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన రిషి వసుధార రూమ్ దగ్గరికి వెళతాడు.. అక్కడ లేకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని ఆలోచిస్తాడు.. మరోవైపు జగతి మహేంద్ర రిషి వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు...ఏదో జరిగి ఉంటుందని అనుమానపడతారు...