గుప్పెడంతమనసు మార్చి 28 ఎపిసోడ్


మనిద్దరి పరిస్థితి ఏంటని బాధపడుతాడు రిషి. దగ్గరకు జరిగి చేయందుకున్న వసుధార..నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను బాధ పెడుతున్నాను. నేను కావాలని ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టలేదు కానీ నేను చేసిన పనులు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. మిమ్మల్ని చాలా వేదనకు గురి చేస్తున్నాయి. చెప్పండి సార్.. అందుకోసం నేను ఏం చేయాలి
రిషి: అదే నేను కూడా అడుగుతున్నాను ఇవన్నీ మర్చిపోవాలి అంటే ఏం చేయాలి. నిన్ను నేను ఇంతకుముందు చూసినప్పుడు నాకు ఓ ఫీలింగ్ కలిగేది. మళ్లీ ఆ ఫీలింగ్ కావాలని కోరుకుంటున్నాను. నేను నీతో మాట్లాడినప్పుడు నా హార్ట్ బీట్ ఎలా ఉండేదో ఇప్పుడు నేను వినాలి అనుకుంటున్నాను. నీతో మాట్లాడేటప్పుడు ఉన్న నిజాయితీ, స్వచ్ఛత అన్నీ ఇప్పుడు కోరుకుంటున్నాను...ఇవ్వగలవా. నా మనసు ఆందోళన పడి పడి ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఇప్పుడు చల్లగాలి లాంటి పాత పరిచయాన్ని కోరుకుంటోంది ఇవ్వగలవా
వసుధార: సార్ మీరు కోరుకున్నట్టు మనిద్దరం మళ్ళీ ఎప్పటిలాగే ఉండాలి అంటే మన రిలేషన్ మళ్ళీ కొత్తగా మొదలవ్వాలి . నేను మొదటిసారి కాలేజీకి వచ్చినప్పుడు మీరు నాతో ఎలా ఉండేవారు ఇప్పుడు అలాగే ఉండండి. ఇద్దరం ఒకరికొకరు కొత్తగా ఉందాం. ఫ్రెష్ రిలేషన్ స్టార్ట్ చేద్దాం
రిషి: ఇప్పటివరకు జరిగినవన్నీ మర్చిపోమంటావా 
వసు: గుర్తుపెట్టుకోవద్దు సార్ ఒకవేళ గుర్తుకు వచ్చినా మైండ్ లో నుంచి వాటిని తీసేయండి
రిషి: నువ్వు చెప్పేది సాధ్యపడుతుందా 
వసు: ఎస్ సార్ మనం సాధ్యం చేద్దాం అ
రేపటి నుంచి మన కొత్త ప్రయాణం మొదలవుతుంది రేపే మనం మొదటిసారిగా కలుసుకోబోతున్నాం సార్ అని అనడంతో రిషి ఆలోచనలో పడతాడు. అప్పుడు రిషి వసుధార మాటలకు సంతోషపడి సరే రేపటి నుంచి మనం కొత్త రిలేషన్ ని మొదలుపెడదాం..ఈ సారి మన ప్రయాణంలో తప్పటడుగులు ఉండకూడదు..గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకూడదు...ఈ రోజు రాత్రి 12 నుంచి మన కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది..అప్పటి వరకూ మీకు నాకు పరిచయం లేనట్టే...
రిషి: అప్పుడు మనల్ని చూసేవారి పరిస్థితి ఏంటి..అందరూ ఒప్పుకుంటారా
వసు: ఒప్పిద్దాం సార్..అయినా ఇది ఎవరికోసమో తీసుకున్న నిర్ణయం కాదు సార్..మనకోసం మనం తీసుకున్న నిర్ణయం.. మన కొత్తకథను ఎదుటి వారు ఎలా తీసుకుంటారో వాళ్లకే వదిలేద్దాం...
రిషి: సాధారణంగా కొత్తదనం అందరికీ నచ్చుతుంది ఆసక్తిగా ఉంటుంది..మన విషయంలో అదే జరుగుతుందని ఆశిద్దాం...
ఇద్దరూ సంతోషపడతారు..షేక్ హ్యండ్ ఇచ్చుకుంటారు..


Also Read: ధర్మరాజుకి రిషి కూల్ వార్నింగ్- రిషిధారగా ఒక్కటయ్యేందుకు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?


కాలేజీలో జరిగిన ఇన్స్ డెంట్ తలుచుకుని ఫణీంద్ర చాలా పెద్ద గండం తప్పింది దేవయాని... రిషి చాలా తెలివైనవాడు డిబిఎస్టీ కాలేజ్ పరువు ప్రతిష్టలను కాపాడాడు. మా నాన్నగారి పరువు మర్యాదలను కాపాడారు అనడంతో అవును అన్నయ్య అని అంటాడు మహేంద్ర. ఇంతలోనే అక్కడికి రిషి వసుధార రావడంతో నాన్న రిషి నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న అంటూ దేవయాని డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఈ రోజు నిన్ను అందరూ పొగుడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది 
రిషి: ఆ పొగడ్తలు చెందాల్సింది నాకు కాదు వసుధారకి అంటాడు
వసు: అయ్యో నాదేముంది సార్ ఈ క్రెడిట్ అంతా జగతి మేడందే 
ఫణీంద్ర: క్రెడిట్ ని ఒక్కరే కాకుండా అందరూ పంచుకుంటున్నారు 


Also Read: మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది


ఆ తర్వాత రిషి -  వసుధార ఇద్దరూ ఎవరికి వారే కొత్త రిలేషన్ గురించి తలుచుకుంటూ సంతోషపడతారు...
రిషి: వసుధార నువ్వు చెప్పినట్టుగా మనం కొత్త రిలేషన్ స్టార్ట్ చేయడానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది ఈ రిషి పాత రిషిలా మారబోతున్నాడు. మళ్లీ వెనక్కు వెళ్లి జర్నీచేస్తే ఆ ప్రేమ ఉంటుందా..ఆ ఎదురుచూపులో ఉన్న సంతోషం ఇప్పుడు ఉంటుందా.. పాత బాధలు, ఆ కన్నీటి బరువు మళ్లీ భుజానికి ఎత్తుకోవాలా ఏం జరుగుతుందో ఏంటో... 
వసుధార:నేను పాత వసుధారని అవుతాను . ఈ టైం ట్రావెల్ ప్లాన్ బాగుంది నేను రిషి సార్ మళ్లీ గతానికి వెళ్తున్నాం . మొదట రిషి సార్ ని చూసినప్పుడు నాలో ఎటువంటి ఫీలింగ్ లేదు కానీ ఆ తర్వాత తనే నా ఫీలింగ్ అయ్యాడు నా ప్రాణం అయ్యాడు. ప్రపంచంలో ఇంతమంది ఉండగానే నేను మీ లైఫ్ లోకి ఎందుకు వచ్చానో నాకు తెలియదు. మీరే నా లైఫ్ అయ్యారు..మీరులేకపోతే ఈ వసుధార లేదు అందుకే కష్టకాలంలో మీరు గుర్తొచ్చారు అనుకుంటూ మెడలో తాళి వైపు చూస్తుంది. నన్ను నేను కాపాడుకోవడం కోసం, నా ప్రేమను గెలిపించుకోవడం కోసం మీ అనుమతి లేకుండా మిమ్మల్ని భర్తగా స్వీకరించాను అనుకుంటూ అప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుచేసుకుంటుంది. గుండెలపై తాళితో పాటూ గుండెల్లో నిజం దాచానన్న ఫీలింగ్ మిమ్మల్ని వేధిస్తోంది.. ఆ భారం తొలగించేందుకే గతానికి వెళుతున్నాను.. ఈ ప్రయాణం మనకు ఎంతవరకూ సహకరిస్తుందో చూడాలి..