గుప్పెడంతమనసు జూన్ 3 ఎపిసోడ్


కొత్త కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా ఉద్యోగంలో చేరిన రోజే వ‌సుధార‌కు స్టూడెంట్స్ ముందు అవ‌మానం జ‌రుగుతుంది. టైమ్ టేబుల్ ఫాలో కాకుండా వ‌చ్చావా  అంటూ ఓ లెక్చ‌ర‌ర్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు స్టూడెంట్స్ ముందే అంటాడు. కోపంగా ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్లిన వసుధార..ఏంటి సార్ ఇదంతా అని మాట్లాడుతుంది. మిమ్మల్ని నేను కరెక్టుగానే పంపించాను కావాలంటే ఈ టైమ్ టేబుల్ చూడండి ఈ పిరియడ్ మీదే అని క్లారిటీ ఇచ్చిన ప్రిన్సిపాల్ అదంతా కేడీ బ్యాచ్ ప‌ని అని చెబుతాడు. ప్రిన్సిపాల్ మాట‌ల‌తో వ‌సుధార షాక్ అవుతుంది. 


కేడీ బ్యాచ్
మ‌రోసారి వ‌సుధార‌ను ఫూల్ చేసి ఆమెను కాలేజీ నుంచి పంపించాల‌ని కేడీ బ్యాచ్ డిసైడ్ అవుతారు. లెక్చరర్ గా వేషం వేసిన డ్రైవర్ ని పిలిచి కేడీ బ్యాచ్ డబ్బులిస్తారు. మన కాలేజీకి ఏ లెక్చరర్ వచ్చినా ఫూల్ చేయడంలో గ్రేట్ మామా నువ్వు టీమ్ లీడర్ ని పొడుగుతాడు. ఈ గెలుపుతో వచ్చిన మనీతో పార్టీ చేసుకుందాం. అయినా ఈసారి వచ్చిన లెక్చరర్ ఈ దెబ్బతో పారిపోతుందా ఇంకా ఉంటుందా..ఈమె మాత్రమే కాదు ఏ లెక్చరర్ వచ్చినా పారిపోయేలా చేయడమే అని అనుకుంటారు


వసుధార- మరో లెక్చరర్
ఈ కేజీ బ్యాచ్ ఏంటి మేడం అని మరో లెక్చరర్ ని అడుగుతుంది వసుధార. కాలేజీలో అల్ల‌రి చేయ‌డ‌మే కేడీ బ్యాచ్ ప‌నివాళ్లని అలా వదిలేస్తే ఎలా అని వసుధార అంటే...  వాళ్లు చేసే పనులకు ఎవ్వరైనా భయపడాల్సిందే అంటూ తమని ఎలా ఫూల్స్ చేశారో చెప్పుకుని బాధపడుతంది మరో లెక్చరర్. చివరకు ప్రిన్సిపాల్ కూడా భయపడతారని చెబుతారు. వీళ్లు చేసిన పనులకు  చాలా మంది లెక్చ‌ర‌ర్స్ ఉద్యోగాల్ని వ‌దిలిపెట్టి వెళ్లిపోయార‌ని చెబుతారు. కేడీ బ్యాచ్‌ను బాగు చేయ‌డం ఎవ‌రి వ‌ల్ల కాద‌ు. అందుకే వచ్చినవాళ్లంతా వెళ్లిపోతున్నారు. కేడీ బ్యాచ్‌ అంటే ఆ నలుగురే.. రోహిత్‌, రేణుక‌, ప్ర‌సాద్‌, పాండ్య‌న్ మెంబ‌ర్స్‌గా ఉంటారు. కేడీ బ్యాచ్‌కు పాండ్య‌న్ లీడ‌ర్‌గా ఉంటాడంటూ ఆ టీమ్ లో ఒక్కొక్కరి గురించి చెబుతారు. పిల్లలు ఇంత దిగజారిపోతున్నా వారి తల్లిదండ్రులు ఎలా ఊరుకుంటున్నారో అర్థంకావడం లేదంటుంది వసుధార. ఇంటిదగ్గర ఎలా ఉంటారనేది వాళ్లిష్టం ఇది కాలేజీ కదా ఇక్కడ విచ్చలవిడిగా ఏదిపడితే అది చేయడం ఏంటి అయినా వాళ్లలో మార్పు ఎలా వస్తుందని బాధపడుతుంది. వాళ్లని మార్చేవారు ఈ భూమ్మీదలేరు రండి మేడం క్లాస్ కి టైమ్ అవుతోందని వెళ్లిపోతారు.


Also Read: ఎక్కడున్నారు రిషి సార్, కాలేజీలో వసుకి అవమానం- జగతిని హెచ్చరించిన ధరణి!


ఎన్ని బాధ‌లు పెట్టినా ఎండీ సీట్‌ను జ‌గ‌తి త‌న‌కు ఇవ్వ‌క‌పోవ‌డంతో శైలేంద్ర అస‌హ‌నానికి లోన‌వుతాడు. 
శైలేంద్ర: నిన్ను బాధపెట్టింది, రిషిని వెళ్లగొట్టింది ఎండీ సీటు కోసమే కదా అది నాకెందుకు ఇవ్వడం లేదు
జగతి: డీబీఎస్‌టీ కాలేజీని అప్ప‌గించేది లేదు
శైలేంద్ర: రిషి వ‌స్తాడ‌ని ఇంకా ఊహ‌ల్లో బ‌తుకుతున్నావు. వాడు ఈ జ‌న్మ‌లో రాడు. త‌న కోసం ఎదురుచూసే ఓపిక నీకు ఉందేమో కానీ, ఎండీ సీట్ కోసం ఎదురుచూసే ఓపిక నాకు లేదు. ఇన్ని రోజులు అర్థం చేసుకుంటావ‌ని వ‌దిలివేశాన‌ు. అప్పుడు రిషిని దూరం చేశాను. ఇప్పుడు నీకు కావాల్సిన వాళ్ల‌ను శాశ్వ‌తంగా దూరం చేస్తాన‌ు
జ‌గ‌తి : నువ్వు వేషాలు వేసినా నీ ఆట‌లు నా ద‌గ్గ‌ర సాగ‌వు. నువ్వు భ‌య‌పెట్టాల‌ని చూసిన భ‌య‌ప‌డ‌ను. నువ్వు నా కొడుకుతో పాటు వ‌సుధార‌ను నాకు దూరం చేశాడు. నా భ‌ర్త‌ను నాతో మాట్లాడ‌కుండా చేశావు. అయినా ఏం చేయ‌కుండా వ‌దిలివేశాను. నువ్వు ఇంత నీచుడివ‌ని, ఇంట్లో జ‌రిగిన ప్ర‌తి సంఘ‌ట‌న‌కు నువ్వే కార‌ణ‌మ‌నే విష‌యం ఫ‌ణీంద్ర‌కు తెలిస్తే త‌న‌కు ప్రాణాల‌కు ముప్పు అని ఇన్నాళ్లు వ‌దిలిపెట్టాన‌ు అంటుంది. అంతే త‌ప్ప నిన్ను ఎదుర్కోవ‌డం తెలియ‌క కాదు. రిషి ప్రాణాల‌ను కాపాడ‌టానికే ఎండీ సీట్‌కు దూరం చేశాన‌ు కానీ త‌న‌ు దూరం అవుతాడ‌ని అనుకోలేద‌ు. రిషి తిరిగి వ‌స్తే తాను కాపోయినా వ‌సు అయినా అన్ని నిజాలు చెబుతుంద‌ని, అప్పుడు నీ ప‌రిస్థితి ఏమిటో ఆలోచించుకో 
శైలేంద్ర: జ‌గ‌తి మాట‌ల‌ు విన్న శైలేంద్ర...బ‌తికిఉన్నోడికైతే చెప్పొచ్చు. చ‌చ్చినోడికి ఎలా చెబుతావంటూ మ‌న‌సులోనే అనుకుంటాడు. మ‌హేంద్ర‌కు ఏదైనా ఆప‌ద త‌ల‌పెట్టాల‌ని చూస్తే నీ నిజ‌స్వ‌రూపం మొత్తం బ‌య‌ట‌పెడ‌తాడ‌న‌ని  వార్నింగ్ ఇస్తుంది. రిషి ఎక్క‌డున్నాడో నీకు తెలుసు క‌దా అని శైలేంద్ర‌ను అడుగుతుంది . ఆ మాట‌ల‌కు శైలేంద్ర త‌డ‌బ‌డిపోతాడు. రిషిని చంపిన విష‌యం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డిపోతుందోన‌ని భ‌య‌ప‌డ‌తాడు. నాకు తెలియ‌ద‌ని అంటాడు. అందుకు రిషి ఎక్క‌డున్నాడో నీకు తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే నాకు తెలుస్తుంద‌ని జ‌గ‌తి శైలేంద్ర‌తో అంటుంది. నాతో జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని మాట‌ల‌తోనే శైలేంద్ర‌ను బెదిరించి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.


Also Read: జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం


శైలేంద్ర - దేవయాని
ఎండీ సీట్ ద‌క్కించుకోవాల‌నే త‌న ఆశ తీర‌క‌పోవ‌డంతో శైలేంద్ర కోపం మ‌రింత పెరుగుతుంది. రిషిని ఇంటి నుంచి పంపించ‌డం వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ఉప‌యోగం లేద‌నే నిజాన్ని జీర్ణించుకోలేక‌పోతాడు. జ‌గ‌తిని త‌క్కువ‌గా అంచ‌నా వేశాన‌ని  ఆమె అడ్డును ఎలాగైనా తొల‌గించుకోవాల‌ని డిసైడ్ అవుతాడు.
దేవయాని: రిషి తిరిగి వ‌స్తే అంద‌రూ క‌లిసిపోతార‌ని, జ‌న్మ‌లో డీబీఎస్‌టీ కాలేజీకి త‌న కొడుకు ఎండీ కాలేవు. కేవలం పేరుకే మ‌నం ఇంట్లో పెద్ద దిక్కులా ఉంటామ‌ని, ఇంట్లో పెత్త‌నం మాత్రం వారి చేతుల మీదుగానే జ‌రుగుతుంది. అది త‌ట్టుకోవ‌డం నా వ‌ల్ల కాద‌ు. రిషి రాక‌ముందే కాలేజీ మ‌న సొంతం చేసుకోవాల‌ి
శైలేంద్ర: రిషిని చంపించిన విషయం త‌ల్లి ద‌గ్గ‌ర కూడా దాస్తాడు శైలేంద్ర‌. జ‌గ‌తి నుంచి కాలేజీని ద‌క్కించుకోవాలంటే మ‌హేంద్ర‌ను చంపేయ‌డం ఒక్క‌టే ప‌రిష్కార‌మ‌నిత‌ల్లితో అంటాడు శైలేంద్ర‌. ఆ మాట విని దేవ‌యాని షాక్ అవుతుంది. మ‌హేంద్ర ప్రాణాలు పోతేనే జ‌గ‌తి త‌మ దారి నుంచి అడ్డు త‌ప్పుకుంటుంది
దేవయాని: ఎన్ని ఘోరాలు చేసినా జ‌గ‌తి ఎదురుతిర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం మ‌హేంద్ర...అత‌డి అడ్డు తొలిగిపోతే ఆమె పులిగా మారిపోతుంద‌ని ఆప‌డం మ‌న త‌రం కాద‌ని శైలేంద్ర‌కు హితబోధ చేస్తుంది . మ‌హేంద్ర‌కు ఏదైనా ఆప‌ద త‌ల‌ప‌డితే తండ్రి కూడా గుండె ఆగి చ‌చ్చిపోతాడ‌ు. మనకు కావాల్సింది వెయిట్ చేసి తీసుకుందాం..తొందరపడి పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. అయినా రిషి వస్తాడంటావా అని దేవయాని అంటే... వాడు ఉంటే కదా తీసుకురావడానికి అని మనసులో అనుకుంటాడు...
ఎపిసోడ్ ముగిసింది