గుప్పెడంతమనసు జూన్ 2 ఎపిసోడ్


తన కారణంగా తల్లి చనిపోవడం, తను అబద్ధం చెప్పడం వల్ల రిషిసార్ దూరమవడం వసుధార తట్టుకోలేకపోతుంది. ప్రతిక్షణం రిషి ఆలోచనల్లోనే ఉంటుంది. వసుని చూసి తండ్రి చక్రపాణి తల్లడిల్లిపోతాడు
చక్రపాణి: నీ మొహం మీద చిరున‌వ్వు చూసి ఎన్ని సంవ‌త్స‌రాలైందో తెలుసా
వసుధార: ఇంకెప్పుడూ చూడలేరు నాన్నా..నేను చేసిన మంచే నా చిరునవ్వుని చిదిమేసింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. రిషి సార్ ని, మహేంద్ర సార్ ని బాధపెటట్టాను నేను బాధపడుతున్నాను..అమ్మను కూడా దూరం చేసుకున్నాను గ‌త జ్ఞాప‌కాల‌తోనే బ‌తుకుతున్నా త‌ప్ప నాకు ఇంకో ఆశలేదు
చ‌క్ర‌పాణి : జీవితంలో ఎన్నో పొర‌పాట్లు జ‌రుగుతాయి. దానివ‌ల్ల కొంద‌రు దూర‌మ‌వుతారు. కొంద‌రు శాశ్వ‌తంగా మ‌న‌ల్ని వ‌దిలివెళ‌తారు. అలాగ‌ని మ‌న జీవితాన్ని అక్క‌డే ఆపేయ‌కూడ‌ద‌ు. రిషి సార్ కోపం ఏ రోజుకైనా త‌గ్గుతుంది..మళ్లీ అందరూ సంతోషంగా ఉంటారు. ఈ నాన్న మాట నమ్ము
వసుధార: అది ఈ జ‌న్మ‌లో జ‌ర‌గ‌ద‌ు. రిషి సార్ కి కోపం తగ్గదు. అమ్మా అనే పిలుపుకోసం జగతి మేడం ఎన్నో ఏళ్లు ఎదురుచూశారు. అలాంటిది ేరిషి సార్ వెళతూ మీకు అమ్మా అని పిలవలేదనే వెలితి ఉండకూడదని పిలుస్తున్నా అని చెప్పారు. మమ్మల్ని శాశ్వతంగా దూరం పెట్టారు. తను లేని నా జీవితం ఇలాగే ఉంటుంది
ఇంతలో ఓ అమ్మాయి వచ్చి నీకేదో లెటర్ వచ్చిందని ఇస్తుంది. కాలేజీలో పోస్టు ఖాళీ అయిందని తెలిసి నేనే అప్లై చేశానంటాడు చక్రపాణి. 
వసు: నేను ఇంటినుంచి కదలనని చెప్పాను కదా
చక్రపాణి: లేదమ్మా..పంతులమ్మ అవ్వాలన్నది నీ కల..పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దాలన్నది మా బాధ్యత. క‌ష్టాలు ఎదుర‌య్యాయ‌ని క‌ల‌ను మ‌ధ్య‌లోనే వ‌దిలివేయ‌కుండా ఈ నాన్న కోస‌మైనా నువ్వు ఈ జాబ్ చేయాల‌ి
వసు: నేను వెళ్లలేను నాన్నా
చక్రపాణి: నువ్వు ఇలా బాధ‌ప‌డుతుంటే త‌ట్టుకోలేక‌పోతున్నాన‌ు. ఏదో ఒక రోజు మీ అమ్మ‌లాగే నిన్ను ఒంట‌రిదానిని చేసి పోతానేమో అని భ‌య‌ప‌డుతున్నాను. 
వసు: నాన్నా అలా మాట్లాడొద్దు. మీకోసం వెళతాను
అక్కా నువ్వు చేరాలనుకున్న కాలేజీలో స్టూడెంట్స్  లెక్చ‌ర‌ర్స్‌ను ఆట‌ప‌ట్టిస్తుంటార‌ని, వారితో జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని లెట‌ర్ తెచ్చిన అమ్మాయి హెచ్చరిస్తుంది. 


Also Read: రిషిని వసు బతికించుకుందా, మరింత క్రూరంగా శైలేంద్ర - మూడేళ్లు ముందుకి సాగిన గుప్పెడంతమనసు!


జగతిని హెచ్చరించిన ధరణి
రిషి ఇంటికి దూరం కావ‌డానికి తానే కార‌ణం కావ‌డంతో జ‌గ‌తి త‌ల్ల‌డిల్లిపోతుంది. రిషి ఇంటి నుంచి వెళ్లిపోతూ త‌న‌ను ద్వేషిస్తూ చెప్పిన మాట‌ల‌నే గుర్తుకుతెచ్చుకుంటుంది. ధైర్యంగా ఉండే జ‌గ‌తి ఇలా దిగాలుగా మారిపోవ‌డంతో ధ‌ర‌ణి త‌ట్టుకోలేక‌పోతుంది. అదే మాట‌ను జ‌గ‌తితో అంటుంది. ధ‌ర‌ణి మాట‌ల‌తో జ‌గ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. తండ్రిని కొడుకును విడ‌దీసిన పాపం నాదే. ప్ర‌తి తండ్రి త‌న కొడుకును త‌న జీవితంలో స‌గ భాగంగా, స‌గ ప్రాణంగా భావిస్తాడు. అలాంటి ఓ తండ్రికి కొడుకును దూరం చేశాన‌ని అది చిన్న త‌ప్పు కాద‌ని ఎమోష‌న‌ల్ అవుతుంది. నా క‌న్నీళ్ల‌తో ఆ పాపం చెరిగిపోద‌ని అంటుంది. మీరు ఈ విష‌యం మ‌హేంద్ర ద‌గ్గ‌ర దాచిపెట్టి ఇంకా పెద్ద త‌ప్పు చేస్తున్నార‌ని జ‌గ‌తికి ధ‌ర‌ణి చెబుతుంది.
జగతి: నేను చెప్పిన అబ‌ద్ధం వ‌ల్ల ఇద్ద‌రు ప్రేమికులు దూర‌మ‌య్యార‌ని చెప్పాలా? నేను మోపిన నింద వ‌ల్ల ఓ తండ్రీ...కొడుకుకు దూర‌మ‌య్యాడ‌ని చెప్పాలా? నా సంగ‌తి నేను ఎప్పుడో మ‌ర్చిపోయా. నా కొడుకు పోతూ పోతూ నాకో వ‌రం ఇచ్చాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. 
ధరణి: మీరు దాచిన దాప‌రికాలే వాట‌న్నింటికీ కార‌ణం
జగతి: నిజం చెప్పాల‌ని అనుకున్నా ఎదుటివాళ్ల‌కు దానికి స్వీక‌రించే శ‌క్తి ఉండాల‌ి. ఓ అన్న...త‌మ్ముడిని చంపాల‌ని అనుకున్నాడ‌ని చెప్ప‌నా? ప‌ద‌వి కోసం దారుణాలు చేయ‌బోయాడ‌ని చెప్ప‌నా? మ‌హేంద్ర, ఫ‌ణీంద్ర విని త‌ట్టుకోగ‌ల‌రా 
ధరణి: మ‌రి ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఏంట‌ి
జగతి: రిషి రావ‌డ‌మే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికి ప‌రిష్కారం . ఎప్ప‌టికైనా రిషి వ‌స్తాడు. వీళ్ల ఆట‌లు క‌ట్టిప‌డేస్తాడ‌ని జ‌గ‌తి న‌మ్మ‌కంగా చెబుతుంది. రిషి, వ‌సు క‌లిస్తే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని, అప్ప‌టివ‌ర‌కు ఈ బాధ అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ు


Also Read: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే


కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా కొత్త ఉద్యోగంలో చేరుతుంది వ‌సుధార‌. స్టూడెంట్స్ అల్ల‌రివాళ్లు అంటూ అమ్మాయి చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేసుకుంటుంది. కానీ వ‌సుధార ముందు అంద‌రూ సిన్సియ‌ర్‌గా న‌టిస్తుంటారు. పాఠం చెప్ప‌డానికి రెడీ అవుతోండ‌గా మ‌రో లెక్చ‌ర‌ర్‌ వ‌చ్చి వ‌సుధార‌ను క్లాస్‌రూమ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని అంటాడు. కొత్త‌గా జాయిన్ అయిన రోజే ఇలా చేస్తారా? టైమ్ టేబుల్ తెలియ‌దా? ఫాలో అవ్వ‌రా అంటూ వ‌సుధార‌పై సీరియ‌స్ అవుతాడు. నా క్లాస్ టైమ్‌లో మీరేలా పాఠాలు చెబుతారు అంటూ ఫైర్ అవుతాడు. టైమ్ టేబుల్ ఫాలో కావ‌డ‌మే రావ‌డం లేదు వీళ్లు పిల్ల‌ల‌కు ఏం పాఠాలు చెబుతారో అంటూ స్టూడెంట్స్ ముందే ఎగ‌తాళి చేస్తాడు. దాంతో వ‌సుధార కోపంగా క్లాస్‌రూమ్ నుంచి బ‌య‌ట‌కు వచ్చి ప్రిన్సిపాల్ రూమ్‌కు వెళుతుంది. త‌న‌ను మ‌రో లెక్చ‌ర‌ర్ అవ‌మానించిన విష‌యం చెబుతుంది. వేరే వాళ్ల క్లాసుకి నన్నెందుకు పంపించారని అడిగితే నేను కరెక్టుగానే పంచించాంటారు ప్రిన్సిపాల్. ఇక్కడ స్టాఫ్ లోనే తప్పిదం ఉందని అర్థమైందంటూ క్లాస్ వేస్తుంది....
ఎపిసోడ్ ముగిసింది...