గుప్పెడంతమనసు జూన్ 1 ఎపిసోడ్


శైలేంద్ర, దేవయానికి జగతి ఎదురుతిరుగుతుంది. కాలేజీ బాధ్యతల నుంచి నన్ను తప్పించలేరు, ఆ సీటు శైలేంద్రకి దక్కనివ్వనని కరాఖండిగా చెపుతుంది. కక్ష పెంచేసుకున్న శైలేంద్ర..తాను పురమాయించిన రౌడీలకు కాల్ చేసి రిషిని చంపేయమని చెబుతాడు. మరోవైపు జగతి అదే కాలేజీలో కూర్చుని రిషికి చేసిన ద్రోహం, రిషి మాటలు, వసు మాటలు, మహేంద్ర కోపం తలుచుకుని బాధపడుతుంది. రిషి ఎక్కడున్నాడో సమాచారం తెలుకున్న మహేంద్ర అక్కడకు బయలుదేరుతాడు.


రిషిని పొడిచేశారు


శైలేంద్ర ప్లాన్ ని అమలుచేయడంలో భాగంగా ఓ వ్యక్తి రిషి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లి నన్ను కాపాడండి సార్ అని అరుస్తాడు. రిషి తనని కాపాడేందుకు వాళ్లని ఎదిరించేలోగా వెనుకనుంచి కత్తితో పొడిచేస్తారు. వరుస కత్తిపోట్లకు రిషికుప్పకూలిపోతాడు. అదే సమయంలో కాలేజీలో రిషి ఫొటో కిందపడుతుంది. అది చూసి కంగారుగా జగతి ఆ ఫొటోని చేతిలోకి తీసుకోగానే గాజుపెంకు గుచ్చుకుని ఆమెబ్లడ్ రిషి నుదిటిపై బొట్టుగా పడుతుంది. నా కొడుక్కి ఏమైంది,ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా అని జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది


రిషిని జస్ట్ మిస్సైన మహేంద్ర


రిషిని వెతుక్కుంటూ వెళ్లిన మహేంద్ర...దార్లో అంతా గుమిగూడి ఉండడం చూసి కారు దిగి అటువెళతాడు. ఏమైందని అడిగితే ఎవరో ఓ కుర్రాడిని పొడిచేసి వెళ్లిపోయారు, చావుబతుకుల్లో ఉన్నాడని చెబుతారంతా. ఆలస్యం ఎందుకు కారెక్కించండి హాస్పిటల్ కి తీసుకెళదాం అని మహేంద్ర అంటే..ఆల్రెడీ అంబులెన్స్ కి కాల్ చేశాంసార్ వస్తోందని చెబుతారు. అప్పుడే అంబులెన్స్ రావడంతో రిషిని అందులో ఎక్కించి తీసుకెళ్లిపోతారు. ఎవరో చూద్దాంఅని మహేంద్ర అనుకున్నప్పటికీ ఇంతలో కాల్ రావడంతో వెళ్లిపోతాడు.


Also Read: శైలేంద్రకు జ‌గ‌తి స్ట్రాంగ్ వార్నింగ్‌ - రిషిని కలిశాక మహేంద్రకు నిజం తెలుస్తుందా!


రిషిని తీసుకెళ్లిన హాస్పిటల్ లోనే వసుధార తల్లిని కూడా జాయిన్ చేస్తారు. వసుధార తల్లికి మందుకు కొనేందుకు బయటకు వస్తుంది. అదే సమయంలో రిషిని హాస్పిటల్ లోకి తీసుకెళతారు. అసలే కత్తిపోట్లు, పోలీస్ కేస్ అవుతుంది ..ఈయన తాలూకా ఎవరైనా సైన్ చేయకపోతే రిస్క్ అనేస్తారు డాక్టర్లు. ఆ మాటలు విన్న వసుధార..రిషిని గమనించదు కానీ చావుబతుకుల్లో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు అలా ఎలా మాట్లాడతారు తన తరపున నేను సైన్ చేస్తానంటుంది. ఆ ఫైల్ పై సంతకం పెడుతుంటుంది...రిషిని లోపలకు తీసుకెళుతుండగా చేయి కిందకు జారుతుంది...ముఖం కనిపించదు కానీ ఆ బ్రాస్ లెట్ చూసి ఇది రిషి సార్ దే అనుకుంటూ అటువైపు వెళుతుండగా...ఇంతలో నర్స్ వచ్చి మీ అమ్మగారు ఇకలేరని చెబుతుంది. వసుధార, చక్రపాణి గుండెలు పగిలేలా ఏడుస్తారు. మరోవైపు రిషిని లోపలకు తీసుకెళ్లి వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించినా రిషి బాడీ సహకరించదు. గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఇక లాభం లేదనేస్తారు వైద్యులు.


రెండేళ్ల తర్వాత



  • రిషి లేడన్న కోపంతో జగతితో మాట్లాడడం మానేశాడు మహేంద్ర

  • కాలేజీ ఎక్కడ దక్కించుకోవాలో అర్థంకాక తలపట్టుకుంటున్నారు శైలేంద్ర, దేవయాని

  • రిషితో పాటూ తల్లిని పోగొట్టుకున్న వసుకి చక్రపాణి అండగా నిలబడ్డాడు

  • జగతి ఎన్నిసార్లు కలిసేందుకు ప్రయత్నించినా వసుధార మనసు మారదు

  • వసుధార తన ప్రేమను తిరిగి పొందుతుందా....ఏం జరుగుతుందో చూద్దాం అంటూ.... కథని కొనసాగించారు


Also Read: జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం


జగతి కాఫీ తీసుకొచ్చి ఇచ్చినా మహేంద్ర పట్టించుకోడు.
జగతి: మహేంద్ర నేను చేసింది తప్పే నన్ను తిట్టు కొట్టు కానీ మాట్లాడకుండా ఉండొద్దు..నా ప్రాణం పోయినంత పనవుతోంది..ప్లీజ్ మాట్లాడు
మహేంద్ర: కోపంతో చేతిలో పేపర్ విసిరికొట్టిన మహేంద్ర...ధరణీ నాకు కాఫీ పంపించమ్మా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు
అప్పుడు ఎంట్రీ ఇచ్చిన దేవయాని-శైలేంద్ర...బుద్ధిమార్చుకోకుండా సెటైర్స్ వేస్తుంటారు
ఇన్నాళ్లైనా బాబాయ్ మాట్లాడుతాడేమో అని ఎదురుచూస్తోంది..ఇదే కంటిన్యూ అయితే జగతికి జీవితంపై విరక్తి పుడుతుందని దేవయాని అంటే ఇన్నేళ్లైనా ఎండీ పదవి మాత్రం దక్కలేదని రగిలిపోతారు. కాలేజీ బాధ్యతలు అప్పగించనని నీకు చెప్పేస్తోందని దేవయాని అంటే ఇక ఓపిక పట్టలేను మమ్మీ పిన్నిని భయపెట్టాల్సిందే అంటే...కానీ ఇప్పుడు జగతితితో జాగ్రత్త మమ్మీ అని చెబుతాడు శైలేంద్ర.  రిషి వసుధారని పంపించేసినట్టే పిన్నికోసం కూడా ఓ ప్లాన్ రెడీ చేసి పెట్టాను...కచ్చితంగా కాలేజీ బాధ్యతలు చేపడతాను అంటే..అదేదో తొందరగా అయ్యేట్టు చూడు అంటుంది దేవయాని...