యష్ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మాలిని వస్తుంది. తట్టుకోలేకపోయాను నా కొడుకుని ఆ పరిస్థితిలో చూస్తానని అసలు ఊహించలేదు. రోడ్డు పక్కన చెత్త కుండీ దగ్గర తను ఒళ్ళు తెలియకుండా తాగి పడి ఉంటే నా కొడుకు అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు. అది చూసి నా గుండె పగిలిపోయిందని విలవిల్లాడిపోతాడు. అసలు మాళవిక ఎందుకు అలా తాగింది అభితో ఏదైనా గొడవ జరిగిందా అని మాలిని అడుగుతుంది. తను ఏమైపోయినా పరవాలేదు నాకు నా కొడుకు ముఖ్యం. అప్పుడు నా జీవితంతో ఆడుకుంది. ఇప్పుడు నా కొడుకు జీవితంతో ఆడుకుంటుంది. అయినా కూడా ఇప్పుడు తనని ఇంటికి తీసుకొచ్చి సేవలు చేస్తున్నారని యష్ కోపంగా అంటాడు. ఆ పరిస్థితిలో ఉంటే తనని రానివ్వకుండా ఎలా ఉంటాం, తను నా మనవడికి తల్లి కాబట్టి రానిచ్చాను. అలాగే తనని రోడ్డు మీద వదిలేస్తే నా మనవడి మనసు బాధపడుతుందని రానిచ్చానని మాలిని సర్ది చెప్తుంది.


Also Read: కావ్యనా మజాకా, రాహుల్ గుట్టు సంపాదించేసింది- ఇక వెన్నెలతో నిశ్చితార్థం అవుట్


మనసుకి నచ్చని పనులు చేయడం చాలా కష్టంగా ఉందని యష్ అంటాడు. ఆదిత్య ఈ ఇంటి వారసుడు వాడికోసం దాన్ని భరించాలని చెప్తుంది. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే నీ కొడుకు నీ ఇంటికి వచ్చాడు. వాడు మాళవిక దగ్గర ఉంటే వాడి కష్టాలు చూడలేవు వాడిని కలుపుకోవడానికి ప్రయత్నించి. తండ్రిగా నీ బాధ్యత పూర్తి చేయడానికి ప్రయత్నించమని మాలిని కొడుక్కి సలహా ఇస్తుంది. ఆదిత్యని కూర్చోబెట్టి వేద ఫుడ్ తినిపిస్తుంది. కన్న తల్లి వల్ల ఇన్ని కష్టాలు వచ్చినా నువ్వు వాడిని కన్నతల్లిలా చూస్తున్నావ్ వాడి కోసం తాపత్రయపడుతున్నావని వేదని మాలిని మెచ్చుకుంటుంది. అమ్మ ఎందుకు అలా అయ్యింది, ఎవరైనా ఏమైనా అన్నారా అని వేద ఆదిత్యని అడుగుతుంది. అభి డాడీ అసలు మంచోడు కాదు. అమ్మని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చి అమ్మని బయటకి గెంటేశాడు. మమ్మీ ఎక్కడ ఉందని అభి డాడీని అడిగితే ఇంట్లో నుంచి పంపించేశానని చెప్పాడు. భ్రమరాంబ అనే ఆవిడ నా తమ్ముడు వేరే వాడిని పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. అదేంటని అడిగితే నన్ను పట్టుకుని బయటకి తోసేశాడాని ఆదిత్య ఏడుస్తూ చెప్తాడు.


అమ్మని కూడా నన్ను బయటకి గెంటేసినట్టు గెంటేశాడు చూడు నాన్న నాకౌ ఎంత పెద్ద దెబ్బ తగిలిందోనని ఆదిత్య తన గాయం చూపిస్తాడు. అది చూసి అందరూ విలవిల్లాడిపోతారు. వేద వెంటనే తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. తనతో అభి పెళ్లి జరగాలని ఎంత తాపత్రయ పడిందో అందరం చూశాం కదా ఇంత మోసం చేస్తాడా? వాడిని ఊరికే వదలకూడదని యష్ కోపంగా వెళతాడు. నా కొడుకు రక్తం చూసిన వాళ్ళని ఊరికే వదిలి పెట్టనని ఆవేశంగా యష్ వెళ్తుంటే వెనుకాలే వేద కూడా వెళ్తుంది. ఇంట్లో అభి, నీలాంబరి పార్టీ చేసుకుంటూ ఉంటారు. మాళవిక వల్ల ఏ ప్రాబ్లం రాదు కదా అని నీలాంబరి అంటుంటే అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరని అభి అంటుండగా యష్ వచ్చి కొట్టేస్తాడు. నా కొడుకుని కొడతావా అని అభిని చితక్కొడతాడు. అసలు నువ్వు ఎన్నో నెంబర్ తెలుసా? ఆడపిల్ల జీవితాలతో ఎలా అడుకుంటాడో తెలుసా అని యష్ అంటే నీలాంబరి అదంతా తనకి అనవసరమని తన ఒంటి మీద చెయ్యి వేస్తే ఊరుకునేది లేదని నీలాంబరి అంటుంది.


Also Read: అభిమన్యుని చితక్కొట్టిన యష్- మాళవికని ఇంటికి తీసుకొచ్చిన వేద


నా చెల్లెలిని బ్లాక్ మెయిల్ చేస్తే నేను అరెస్ట్ చేయించాను. నువ్వు వచ్చి విడిపించుకొచ్చావు. వీడి గురించి తెలిసి తెలిసి నువ్వు ఎలా తాళి కట్టించుకున్నావని వేద నిలదీస్తుంది. అభి ఎలాంటిదో తెలిసి కూడా తాళి కట్టించుకుంది అంటే ఈ అమ్మాయి కూడా అలాంటిదేనని యష్ అంటాడు. ఆడపిల్లల్ని మోసం చేస్తున్న వీడిని సపోర్ట్ చేస్తున్నావ్ నీకు  మనసు లేదా? అని వేద అడుగుతుంది. అంత పెద్ద కేసు నుంచి క్షణాల్లో అభిని విడిపించాను అది నా బ్యాగ్ రౌండ్.. మళ్ళీ  అభి జోలికి వస్తే ఊరుకునేది లేదని నీలాంబరి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఎన్ని చెప్పినా నీలు నన్ను వదలదని అభి అంటాడు. మాళవికది ఒక రాంగ్ క్యారెక్టర్ అని అనేసరికి వేద కోపంగా చెయ్యి ఎత్తి కొట్టబోయి కూడా ఆగిపోతుంది.