చెత్తలో పడిన మాళవిక మన కోసం ఎవరూ రారని ఏడుస్తుంది. దేవుడా మోసం చేసిన వాడిని ఎందుకు చూస్తూ వదిలేశావ్, మోసపోయిన మమ్మల్ని చెత్త పాలు చేశావు. నువ్వు ఏం చేస్తావో తెలియదు వాడు దిక్కులేని వాడిలా మారాలని మాళవిక బాధపడుతూ అభిమన్యుని తిడుతుంది. వేద, యష్ ఒక్కటవుతున్న వేళ ఆదిత్య ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే డాడీ డాడీ అని ఏడుస్తాడు. ఎక్కడ ఉన్నావ్ ఏమైందని యష్ కంగారుగా అడుగుతాడు. త్వరగా రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆదిత్య ఫోన్ చేశాడు ఎక్కడో బార్ దగ్గర ఉన్నాడంట భయంగా ఉందని చెప్పి ఏడుస్తున్నాడని యష్ వేదతో చెప్తాడు. దీంతో వెంటనే ఇద్దరూ ఆదిత్య చెప్పిన ప్లేస్ కి వెళతారు. తన తల్లికి హెల్ప్ చేయమని ఆదిత్య రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ బతిమలాడతాడు.


Also Read: మనసుల్ని మెలిపెట్టించేసిన తింగరిపిల్ల - కృష్ణని వదులుకోలేనని బాధపడుతున్న మురారీ


యష్, వేద ఆదిత్యని వెతుక్కుంటూ వస్తారు. చెత్తలో పడి ఉన్న మాళవికని చూసి షాక్ అవుతారు. యష్ ని చూడగానే ఆదిత్య నాన్న అని గట్టిగా ఏడుస్తాడు. ఆదిత్యని తీసుకుని యష్ వెళ్లిపోదామని అంటాడు. మమ్మీ రాకపోతే నేను రానని ఆదిత్య మళ్ళీ తల్లి దగ్గరకి వెళతాడు. మాళవికని కూడా తమతో పాటు తీసుకెళ్దామని వేద అంటే వద్దని యష్ కోపంగా అరుస్తాడు. ఈరోజు నా కొడుకు రోడ్డు పక్కన ఉండి అందరి కాళ్ళ వేళ్ళా పడుతున్నాడంటే అందుకు కారణం ఎవరు ఈ మాళవికనే. తాగి ఇలాగేనా రోడ్డు మీద పడిపోయేదని సీరియస్ అవుతాడు. ఆడదాన్ని ఇలాగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని వేద సర్ది చెప్తుంది. తను మారదు ఆమె నీడ కూడ నీమీద పడకూడదని అంటాడు. తను ఈ పరిస్థితిలో నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని యష్ చెప్తాడు.


Also Read: కావ్య ఫినిషింగ్ టచ్ సూపర్- అన్ని నిజాలు చెప్పేసిన స్వప్న, రాహుల్ పని ఇక ఇత్తడే


వేద ఆదిత్యని రమ్మని అంటుంటే మమ్మీ లేకుండా ఎక్కడికి రానని అంటాడు. ఆదిత్యని తీసుకెళ్లాలంటే మాళవికని కూడా మనతో తీసుకుని వెళ్ళాలి తప్పదని వేద చెప్తుంది. చెత్తలో ఉన్న తనని లేపి ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లో మాలిని వాళ్ళు వేద వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుని సంబరపడతారు. అప్పుడే యష్ ఆదిత్యని తీసుకుని ఇంటికి వస్తాడు. తను ఏడవటం చూసి ఏమైందని కంగారుపడుతుంది. యష్ ఏమైంది ఆదిత్య ఎందుకు ఏడుస్తున్నాడు, నువ్వు వేద కలిసి వెళ్లారు కదా ఆదిత్య ఎక్కడ నుంచి వచ్చాడని అడుగుతుంది. అప్పుడే వేద తాగి తూలిపోతున్న మాళవికని తీసుకుని ఇంటికి వస్తుంది.  తప్పతాగి ఉన్న తనని చూసి మాలిని కోపంగా ఉంటుంది. ఇది కూడా నీ ఇల్లేనని వేద తనని ఇంట్లోకి తెస్తుంది. తనని శుభ్రం చేసి గదిలో పడుకోబెడుతుంది. నాకు ఎవరూ లేరు అందరూ నన్ను మోసం చేశారని మాళవిక గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆవిడని తల్లిలా, చెల్లిలా చూసుకుంటున్నావని యష్ వేదని అడుగుతాడు. వాళ్ళు గతంలో ఎలా ప్రవర్తించారోనని ఆలోచించకూడదని వేద నచ్చ జెపుతుంది.