డైరీ చదివి మురారీ ప్రేమ విషయం తెలియడంతో కృష్ణ డల్ గా ఉంటుంది. కోడలు డల్ గా ఉండేసరికి ఏసీపీ సర్ ఏమైనా అన్నారా ఏంటని రేవతి అడుగుతుంది. గదిలో న్యాప్ కిన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయని తను వెళ్ళి తీసుకొస్తానని మురారీ అంటాడు. కానీ కృష్ణ మాత్రం వద్దని చెప్పి తానే వెళ్తుంది. డైరీ ఎక్కడ భయటపడుతుందోనని మురారీ టెన్షన్ పడతాడు. కృష్ణ గదిలోకి వచ్చి డైరీ తీసుకుని చదవాలని అనుకుంటుంది కానీ దాన్ని తీయాలా వద్దా అని ఆలోచిస్తుంది. కాసేపటికి డైరీ తీసి మళ్ళీ చదువుతుంది. జీవితంలో పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. ప్రపంచ సుందరి వచ్చి నన్ను చేసుకుంటానని అన్నా కూడా చలించను, నాకు నువ్వే కావాలని రాసి ఉండటం చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది.
Also Read: కావ్య ఫినిషింగ్ టచ్ సూపర్- అన్ని నిజాలు చెప్పేసిన స్వప్న, రాహుల్ పని ఇక ఇత్తడే
డైరీలో ప్రేమించిన అమ్మాయి పేరు ఎంతో తెలుసుకుందామని చూస్తుంది. కానీ తర్వాత ఏం రాయకుండ ఖాళీ పేజీలు ఉంటాయి. అంటే సెప్టెంబర్ 16 న మా పెళ్లి అయ్యింది అప్పటి నుంచి డైరీ రాయడం మానేశారని కృష్ణ చాలా బాధపడుతుంది. ఆయన మనసులో ఇంకొక అమ్మాయి ఉందని తెలియక నేనే తొందరపడి మనసు ఇచ్చానా? ఇప్పుడు ఏం చేయాలని ఏడుస్తుంది. ఇంత సేపు అయినా కృష్ణ రాలేదు ఏంటి డైరీ చదివి ఉంటుందా అని మురారీ డౌట్ పడతాడు. కృష్ణ ఆ డైరీ చదివితే ముకుంద గురించి తెలిసిపోతుందని టెన్షన్ పడతాడు. మురారీ వైపు బాధగా చూస్తుంది. డౌటే లేదు డైరీ చదివేసిందని మురారీ అర్థం చేసుకుంటాడు. వెంటనే పరుగున వెళ్ళి డైరీ ఎక్కడ ఉందోనని చూస్తాడు. డైరీ తీసి ఇన్నాళ్ళూ దీన్ని రాసే అవసరం లేదని అనుకున్నా ఈ ఖాళీ పేజీలు మాదిరిగానే నా జీవితం కూడా ఖాళీ అయిందని బాధపడ్డా. ఆ శూన్యాన్ని వెలితిని పూడ్చడానికి కృష్ణ నా జీవితంలోకి వచ్చిందని ఆలస్యంగా తెలుసుకున్నా. గురువు గారి కోసం పెళ్లి చేసుకున్నా గడువు పూర్తయితే కృష్ణ వెళ్లిపోతుందని తెలిసినా కృష్ణ లేని జీవితం మళ్ళీ ఈ ఖాళీ పేజీల్లాగా శూన్యంగా అయిపోతుందని భయంగా ఉందని మురారీ బాధపడతాడు.
Also Read: రోడ్డు పక్కన చెత్తలో మాళవిక, ఏడిపించేసిన ఆదిత్య- యష్, వేద రొమాంటిక్ మూమెంట్
కృష్ణని అందరూ తింగరిపిల్ల అంటారు కానీ నా దృష్టిలో తను అల్లరి పిల్ల అంత స్వచ్చంగా ఉంటుంది ఆమె మనసు. అందుకే కృష్ణ మీద రోజురోజుకీ ఇష్టం పెరిగిపోతుందని అనుకుంటాడు. జీవితంలో మొట్టమొదటి సారి ప్రేమ పుట్టింది కానీ దానికి ఆయుష్హు తీరిపోయిందని కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది.