బిజినెస్ పార్టీ అని చెప్పి వేదని హోటల్ తీసుకొస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం చెప్పలేక తిప్పలు పడుతూ ఉంటాడు. రూమ్ చూపించి లోపలికి వెళ్ళు అంతా నీకే అర్థం అవుతుంది నేను చిన్న ఫోన్ మాట్లాడి వస్తానని అబద్దం చెప్పి వెళ్ళిపోతాడు. వేద గదిలోకి వచ్చేసరికి లోపల బెడ్ ని అందంగా పూలతో అలంకరించి ఉంటుంది. అది చూసి సంతోషంతో పాటు ఆశ్చర్యపడుతుంది. మనసులో ఉన్న మాట బయటకి చెప్పలేక ఇన్ని పాట్లు పడుతూ ఇలా చూపించారా? పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ముందుగా ఎదురుచూసేది ఈ మధుర క్షణాల కోసమే. ఎప్పుడెప్పుడు భర్తకి దగ్గర కావాలా అని ఎదురుచూస్తుంది. కానీ మన విషయంలో అది చాలా ఆలస్యమైంది యష్. ఈ మధురమైన క్షణాలను మిగిలిన జీవితం అంతా గుర్తుండిపోయేంత గొప్పగా ఏర్పాటు చేశారు. ఐయామ్ ఇంప్రెస్. ఇన్ని అబద్ధాలు దీని కోసమా. అందుకే చెమటలు పట్టాయా? అసలు దీని కోసమే ఇంత టెన్షన్ పడ్డారా? చెప్పేస్తే మీ ఒడిలో వాలిపోయేదాన్ని కదా. ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచిస్తూ మాలిని మాటలు తలుచుకుంటుంది. అంటే ఇంట్లో దీని గురించి అందరికీ తెలుసన్న మాట. నకొక్క దానికే సర్ ప్రైజ్ అన్న మాట అని సంతోషపడుతుంది.
Also Read: తప్పు తెలుసుకున్న భాగ్య, తులసికి సపోర్ట్- రాజ్యలక్ష్మిని రోకలి బండతో కొట్టిన దివ్య
ఆదిత్య ఏడ్చుకుంటూ ఇంటి నుంచి బయటకి వస్తాడు. వాచ్ మెన్ దగ్గర ఫోన్ తీసుకుని తల్లికి ఫోన్ ట్రై చేస్తాడు. మాళవిక బార్ లో రచ్చ రచ్చ చేస్తుంది. అసలు నేను ఎందుకు బతకాలి నన్ను మోసం చేశాడని ఏడుస్తుంది. మాళవిక ఫోన్ బార్ మేనేజర్ లిఫ్ట్ చేసి విషయం చెప్తాడు. పాపం ఆదిత్య పరుగులు పెట్టుకుంటూ అక్కడికి బయల్దేరతాడు. యష్ గదిలోకి వచ్చి ఏమి తెలియనట్టు మొహం పెడతాడు. వేద ఏం మాట్లాడకుండా వెళ్ళి కౌగలించుకుని యష్ ఐయామ్ ఇంప్రెస్ అనేసరికి చాలా సంతోషిస్తాడు. ఆదిత్య బార్ కి వచ్చేసరికి తాగి తూలుతూ ఉంటుంది. తనని చూసి ఆ పసి మనసు అల్లాడిపోతుంది. ఏంటి మమ్మీ ఏమైంది నీకు అని ఏడుస్తాడు. ఇంటికి వెళ్దాం రమ్మని అంటాడు. నాకు ఇల్లు లేదు నన్ను అందరూ వదిలేశారు దిక్కులేని దాన్ని అయ్యానని మాళవిక ఏడుస్తుంది. ఆదిత్యని చూసి తనని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది.
Also Read: తన ప్రేమకి ఆయుషు తీరిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న కృష్ణ
ఒక్కడివే నువ్వు మీ మమ్మీని తీసుకెళ్లలేవు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయమని మేనేజర్ చెప్తాడు. వాళ్ళు ఎవరూ రారని ఏడుస్తాడు. వేద, యష్ అందంగా రెడీ అయిపోతారు. ఇది చెప్పడానికి ఎందుకు కష్టపడ్డారు నాకే నేరుగా చెప్పొచ్చు కదా అని సిగ్గుపడుతుంది. ఇద్దరూ రొమాంటిక్ గా గడుపుతారు. మాళవిక తూలుతూ నన్ను అందరూ చీట్ చేశారు వదిలేయ్ అని నడుస్తూ రోడ్డు పక్కన చెత్తలో పడిపోతుంది. లేమమా వెళ్దాం రామ్మా అని ఆదిత్య ఏడవడం ప్రేక్షకులని కన్నీరు పెట్టిస్తుంది. నీకు ఏమైందని ఏడుస్తున్నావ్ నీకు నేను ఉన్నానని ధైర్యం చెప్పేందుకు చూస్తాడు. మనకి నాన్న ఉన్నాడు రామ్మా అని తనని బతిమలాడతాడు. ఆదిత్య యష్ కి ఫోన్ చేస్తాడు.