మురారీ తన డైరీని బయట పడేయాలని వెళ్లబోతుంటే తాము బయటకి వస్తామని అందరూ అంటారు. ఏం చేయాలో అర్థం కాక ఫోన్ వచ్చినట్టు కలరింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. మురారీ గదిలోకి వెళ్ళి ఆ డైరీ తన బట్టల కబోర్డ్ లో పెడతాడు. ఈ డైరీ వల్ల చాలా ప్రమాదం కృష్ణ తన మనసులో మాట చెప్తే బాగుండని అనుకుంటాడు. ఏసీపీ సర్ ఎందుకు అలా బిహేవ్ చేశారు కంగారుపడుతున్నారు అది ఆయన చెప్పకపోయినా నేనే కనిపెట్టాలి కనిపెడతానని కృష్ణ అనుకుంటుంది. కృష్ణ మురారీ బట్టలు సర్దుతుంటే అన్నీ కిందపడిపోతాయి. అందులోనే డైరీ ఉండటంతో మురారీ టెన్షన్ గా నిద్రలో నుంచి సడెన్ గా ఉలిక్కిపడి లేస్తాడు.
Also Read: జగతిని దోషిని చేసి వెళ్ళిపోయిన వసు- గుండెనొప్పితో కుప్పకూలిన సుమిత్ర, ఇక రిషిధార కలవనట్టేనా?
బట్టలు తానే సర్దుతానని చెప్పి కృష్ణని వెళ్లిపొమ్మని కంగారుగా చెప్తాడు. తను వెళ్లిపోవడంతో డైరీ కోసం వెతుకుతుంటే మళ్ళీ కృష్ణ వచ్చేసరికి టెన్షన్ పడతాడు. మళ్ళీ వెళ్లిపోగానే డైరీ తీసి బెడ్ కింద పెట్టేస్తాడు. మధుకర్ ని ఉతికి ఆరేస్తుంది అలేఖ్య. పొద్దున్నే నిద్రలేచి కుయ్యో మొర్రో అని ఏడుస్తాడు. పెళ్ళాం తిరగబడితే ఎలా ఉంటుందో ఇప్పుడైనా అర్థం అయ్యిందా అని భర్తని బెదిరిస్తుంది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని వణికిపోతాడు. కృష్ణ గదిలో బెడ్ సర్దుతూ ఉండగా డైరీ తన చేతికి తగులుతుంది. అందులో మురారీ తన ప్రేమ ముకుంద గురించి రాసుకున్నది చదువుతుంది. మెరుపులా కనిపించింది. హృదయంలో పూల వాన కురిపించి నా జీవితానికి ఒక పరిమళం అద్దింది అని రాసింది చూస్తుంది. ఏసీపీ సర్ జీవితంలో ఇంకొక అమ్మాయి ఉందా? ఆ మనసులో ఈ అమ్మాయి మీద ఇంత ప్రేమ ఉందా? అని కృష్ణ షాక్ అవుతుంది.
Also Read: టెన్షన్.. టెన్షన్.. నెలతప్పిన స్వప్న, వెన్నెలతో రాహుల్ నిశ్చితార్థం- కిడ్నాపైన కావ్యని కాపాడేదెవరు?
డైరీలో పేజ్ తిప్పే టైమ్ కి మురారీ రావడంతో దాన్ని మళ్ళీ దాచి పెట్టేస్తుంది. కృష్ణ డైరీ చూసి చాలా బాధపడుతుంది. మురారీ వైపు బాధగా చూస్తుంటే ఏమైందని సైగ చేస్తాడు ఏమి లేదని కళ్ళతోనే చెప్తుంది. ఇద్దరి మధ్యలో టవల్ అడ్డుగీతలాగా సింబాలిక్ గా పడుతుంది. ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పటికైనా వెళ్లిపోవాలని వచ్చాను. నిన్నటితో ఎప్పటికీ మీతో ఉండాలని కోరుకున్నా కానీ ఇప్పుడు మీ మనసులో మరొక అమ్మాయికి స్థానం ఇచ్చారని తెలిసేసరికి చిన్న టవల్ కూడా మన మధ్య అడ్డుగోడలాగా కనిపిస్తుందని కృష్ణ మనసులోనే బాధపడుతుంది. కృష్ణ వెళ్లిపోగానే డైరీ ఉందా లేదా అని చూసుకుంటాడు.