దుగ్గిరాల ఇంట్లో రాహుల్ నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరూ రాజ్ ని గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావని అడుగుతూ ఉంటారు. కావ్య వచ్చి రాజ్ పక్కకి పిలిచి తనతో రమ్మని పిలుస్తుంది. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఎక్కడికి నేను రానని అంటాడు. సాక్ష్యాధారాలు కావాలని అన్నారు కదా ఫోన్ ఇవ్వండి వెళ్తానని అడుగుతుంది. ఈరోజు నాకు ఆఖరి రోజని చెప్పారు సాక్ష్యాలు కావాలంటే మీరు నాతో రండి లేదంటే ఫోన్ ఇవ్వమని గట్టిగా అడిగేసరికి ఫోన్ ఇచ్చి త్వరగా రమ్మని పంపిస్తాడు. అటు కనకం ఇంట్లో కూడా స్వప్నకి నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తుంది. ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు స్వప్న లేచిపోయిన విషయం ముందే చెప్పారా అని సూటి పోటి మాటలు అంటారు. తెలుసని కనకం చెప్పేసరికి అయితే వాడికి గతి లేక లేదంటే ఏ రోగం ఉందో ఏమోనని దెప్పిపొడుస్తారు. వాళ్ళకి మీనాక్షి గట్టిగానే బదులిస్తుంది. వచ్చిన అమ్మలక్కల మధ్య చిచ్చు పెట్టి పంపించేస్తుంది.


Also Read: డబుల్ ట్విస్ట్, నిజం తెలుసుకున్న స్వప్న- కావ్యని కిడ్నాప్ చేయించిన రాహుల్


కావ్య హడావుడిగా బయటకి వెళ్ళడం రాహుల్ చూస్తాడు. ఈవిడ ఒంటరిగా బయల్దేరిందంటే మనకి గోతులు తీయడానికి అయి ఉంటుందని వెంటనే రౌడీలకు ఫోన్ చేసి తనని ఫాలో అవమని చెప్తాడు. ఎవరికి తెలియకూడదని నాలో కరుడుగట్టిన మృగాన్ని బయటకి రానివ్వలేదు కానీ నువ్వు దాన్ని బయటకి తీసుకొస్తానని అంటున్నావ్ దానికి ముందుగా బలైపోయేది నువ్వు, మీ అక్క అనుకుంటాడు. స్వప్న గదిలో కూర్చుని తన బతుకు ఇంతేనా అని బాధపడుతుంది. ఇంట్లో ఎవరూ తనకి సాయం చేయలేదని రుద్రాణి హడావుడి చేస్తుంది. అపర్ణ, ధాన్యలక్ష్మి బాగానే కౌంటర్ వేస్తారు. ఇంతమందిని పేరు పేరునా విమర్శించి అలిసిపోయావు అందరూ అన్ని పనులు చేయబట్టే ఇప్పుడు నీకు చేయడానికి ఏ పని లేదని రాజ్ బదులిస్తాడు. మీ అమ్మ అసూయ పడేలా నా కొడుకు పెళ్లి చేస్తానని రుద్రాణి బింకాలు పలుకుతుంది. అప్పుడే అరుంధతి వాళ్ళు వస్తారు. రుద్రాణి ఎదురెళ్ళి ఆహ్వానం పలికితే పట్టించుకోకుండా అపర్ణ దగ్గరకి వెళతారు.


Also Read: రాజ్యలక్ష్మిని బెదిరించిన దివ్య- అన్ని దారులు మూసేసి నందుని ఇరకాటంలో పడేస్తున్న లాస్య




ఈ ఇంటికి నా కూతురు కోడలు అయితే నాకంటే నువ్వు బాగా చూసుకుంటావాని ఒప్పుకున్నానని అరుంధతి అంటుంది. రాజ్ కి పెళ్లి కాకపోతే తనకే ఇచ్చేవాడినని చెప్తుంది. రుద్రాణి వెన్నెలని తన గదిలోకి వచ్చి రెడీ అవమని పిలుస్తుంది. అపర్ణ గది అయితే మాకు కంఫర్ట్ గా ఉంటుందని అరుంధతి గాలి తీసేస్తుంది. కావ్య శృతిని కలుస్తుంది. వెంటనే రౌడీ రాహుల్ కి ఫోన్ చేసి చెప్తాడు. వాళ్ళు ఇక్కడికి రాకూడదు అవసరం అయితే వాళ్ళని కిడ్నాప్ చేయమని చెప్తాడు. అప్పుడే రాజ్ వచ్చి పూజకి టైమ్ అవుతుంటే ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నావ్ ఏంటని అంటాడు. కళ్యాణ్ లెటర్ ఇవ్వడానికి అప్పు దగ్గరకి వస్తాడు. కావ్య ఇచ్చిన లెటర్ ఇచ్చి నిశ్చితార్థం అయిన తర్వాత ఇవ్వమని చెప్తాడు. రౌడీలు కావ్య ఆటోని ఓవర్ టేక్ చేసి వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేసేస్తారు. అమ్మలక్కలు కనకాన్ని కావ్య రావడం లేదా అని అడుగుతారు. లేదు రుద్రాణి కొడుకు రాహుల్ కి కూడా ఈరోజే నిశ్చితార్థం జరుగుతుందని కనకం చెప్పడం స్వప్న విని షాక్ అవుతుంది.