రుద్రాణి ఇంట్లో రాహుల్ కి నిశ్చితార్థం ముహూర్తం ఫిక్స్ చేస్తుంది. వెంటనే ఈ విషయం స్వప్న అక్కకి చెప్తే నమ్మదు ఎలా అని కావ్య ఆలోచనలో పడుతుంది. అప్పుడే అప్పు కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది. స్వప్న అక్కకి నిశ్చితార్థం పెట్టేశారు రేపు సాయంత్రం. నిజం అమ్మ వాళ్ళకి చెప్పెద్దామని అప్పు అంటుంది. అదేంటి రాహుల్ సంగతి ఏం చేద్దామని అంటే వాడు ఒక లోఫర్ ఇదే తన జీవితానికి మంచిదేమోనని కావ్య సర్ది చెప్తుంది. తను ఫోన్ మాట్లాడటం రాహుల్ విని నవ్వుకుంటాడు. అక్కడే కాదు ఇక్కడ జరగబోయే నిశ్చితార్థం కూడా ఆపలేవు. ఇదంతా నేను ప్లాన్ చేసిందే ఎలా ఉందని అంటాడు.


కావ్య: నీ ప్లాన్ బాగుంది కానీ బెదిరిపోవడానికి నేనేమీ శృతిని, షర్మిలని కాదు. తీస్తా మొత్తం బయటకి తీస్తా. ఈసారి నువ్వు గెలిచావ్. గేమ్ నువ్వు స్టార్ట్ చేశావ్ విన్నింగ్ షాట్ నేను కొడతాను


రాహుల్: ఏం చేస్తావని వణికిపోతాడు


Also Read: రాజ్యలక్ష్మిని బెదిరించిన దివ్య- అన్ని దారులు మూసేసి నందుని ఇరకాటంలో పడేస్తున్న లాస్య


కావ్య: తెలిసో తెలియకో నాతో పెట్టుకున్నావ్ నేను నీ జన్మ పాపాలు కడిగేస్తాను


మేనేజర్ ఇంటికి వస్తాడు. ఏంటి మీరు వచ్చారని రాజ్ అడుగుతాడు. మీ పెళ్లి రోజు నుంచి ఆఫీసు చూసుకుంటానని చెప్పారు కానీ రావడం లేడు పైగా వన్ వీక్ నుంచి ప్రొడక్షన్ ఆగిపోయింది. వర్కర్స్ కి బోనస్ గా ఇస్తానన్న రూ.30 లక్షలు రాహుల్ తీసుకున్నారు. దీంతో వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారని చెప్పేసరికి రాజ్ షాక్ అవుతాడు. రెండు రోజుల్లో క్లియర్ చేస్తానని రాహుల్ చెప్పారు కానీ చేయలేదు అందుకే మీకు నేరుగా వచ్చానని చెప్తాడు. వర్కర్స్ డబ్బు రాహుల్ ఎందుకు వాడుకున్నాడని రాజ్ ఆలోచిస్తాడు. ఇప్పటికైనా రాహుల్ గురించి తెలుసుకోమని కావ్య సలహా ఇచ్చి వెళ్ళిపోతుంది.


ఇంట్లో అందరూ రాహుల్ కి డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటే రాజ్ కోపంగా చూస్తాడు. వెనుకే కావ్యని చూసి రాహుల్ కి వణుకు మొదలవుతుంది. అత్తయ్య లైఫ్ లో చాలా పోగొట్టుకుంది ఇలాంటి టైమ్ లో రాహుల్ గురించి బయట పెట్టి తన సంతోషాన్ని పాడు చేయడం కరెక్ట్ కాదని మౌనంగా వెళ్ళిపోతాడు. రాహుల్ నిజస్వరూపం బయట పెట్టె మార్గాన్ని చూపించమని కావ్య దేవుడిని వేడుకుంటుంది. శృతి కళ్యాణ్ కి ఫోన్ చేసి రాహుల్ గురించి మాట్లాడాలని చెప్తుంది. రాహుల్ నన్ను మోసం చేశాడు అనేందుకు ఒక మార్గం ఉందని చెప్పేసరికి కావ్య సంతోషపడుతుంది. రాజ్ కావ్యకిచ్చిన గడువు ఈరోజుతో ముగిసిపోతుందనే విషయం గుర్తు చేస్తాడు. నువ్వు ఈరోజు నిజాన్ని నిరూపించకపోతే దుగ్గిరాల హోదాని వదులుకోవాలని అంటాడు.


Also Read: ఇంట్లో నుంచి మాళవికని గెంటేసిన అభిమన్యు- యష్, వేద ఫస్ట్ నైట్


కావ్య తన ప్లాన్ సక్సెస్ అవాలంటే తనకొక సాయం చేయాలని కళ్యాణ్ ని అడుగుతుంది. ఒక లెటర్ ఇచ్చి స్వప్నకి అది అందేలా చేయమని చెప్తుంది. మళ్ళీ శృతికి ఫోన్ చేసి సాక్ష్యాలు ఏమి దొరకలేదని కానీ ఒక చోటకి వెళ్తే రాహుల్ మోసం చేసిన విషయం తెలుస్తుందని చెప్తుంది. వెంటనే కావ్య తనని కలవడానికి వెళ్ళిపోతుంది. స్వప్న తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పు వచ్చి దెప్పి పొడుస్తుంది.