వేద యష్ తో కలిసి పార్టీకి వెళ్తానని చెప్తుంది. నేను నా భర్తతో కలిసి పార్టీకి వెళ్తే ఇక్కడ ఎవరూ హర్ట్ అవరు అందుకే యష్ తోనే వెళ్తుంది. ఇక అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు. అమ్మని పార్టీకి ఒప్పించినందుకు ఖుషిని మెచ్చుకుంటాడు. పోలీస్ కానిస్టేబుల్ మాళవికకి ఫోన్ చేసి అభిమన్యుని బెయిల్ ఇచ్చి తీసుకుని వెళ్లిపోయారని చెప్తాడు. దీంతో మాళవిక హారతి పట్టుకుని గుమ్మంలోకి వస్తుంది. అభి నీలాంబరిని పెళ్లి చేసుకుని వస్తాడు. వాళ్ళని చూసి మాళవిక షాక్ అవుతుంది. ఎప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటావ్ ఎందుకు కొత్త జంటకి హారతి ఇవ్వమని భ్రమరాంబిక అంటుంది. మాళవిక హారతి పళ్ళెం చేజారుస్తుంది. అందరూ ఇంట్లోకి వెళతారు. అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఈవిడ మెడలో ఈ దండలు ఏంటని మాళవిక నిలదీస్తుంది.
Also Read: మనసులోని ప్రేమని మురారీకి చెప్పిన కృష్ణ- ప్రేమ దూరం అవుతుందని బాధపడుతున్న ముకుంద
భ్రమరాంబిక: నా తమ్ముడు అభిమన్యు నీలాంబరి పెళ్లి చేసుకున్నారు
మాళవిక: నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు దీన్ని ఎవతినో పెళ్లి చేసుకుని వచ్చావ్. ఇందుకోసమేనా నన్ను ప్రేమించానని చెప్పి నీ దగ్గరకి తెచ్చుకున్నావ్. నా కొడుక్కి నాకు అండగా ఉంటానని చెప్పి ఎందుకు ఇంత మోసం చేశావ్
అభి: ఏంటి చెప్పేది తను నీలాంబరి అంటే పవర్. తన పొజిషన్ వేరు నీలా ఎదుటి వాళ్ళ మీద పడి పరాన్న జీవిలా బతికేరకం కాదు
మాళవిక: నేను ఎదుటి వాళ్ళ మీద పడి బతుకుతున్నానా
అభి: నేను జైలుకి వెళ్తే ఏమైనా చేయగలిగావా? కనీసం ఒక లాయర్ ని అయినా తీసుకొచ్చావా? కానీ నీలాంబరి అలా కాదు క్షణాల్లో బెయిల్ తీసుకొచ్చి విడిపించింది. నిన్ను నమ్ముకుని నూతిలో దూకడం కంటే ఇలాంటి అమ్మాయిని చేసుకుని పుష్పకవిమానంలో తిరగడం మంచిది. నీకు నాకు ఏ సంబంధం లేదు వెళ్లిపో
మాళవిక: ఎక్కడికి వెళ్ళాలి నిన్ను నమ్మి వచ్చినందుకు ఇంత మోసం చేస్తావా
అభి: ఇంతక ముందు యష్ భార్యవి తనని వదిలేసి నా దగ్గరకి వచ్చావ్ ఇప్పుడు నేను వదిలేస్తే వేరే వాడి దగ్గరకి వెళ్తావ్, నీలాంటి వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి
మాళవిక: ఆపు చాలా దారుణంగా మాట్లాడుతున్నావ్. నిన్ను వదిలి నేను వెళ్ళను
Also Read: వావ్ వాట్ ఏ సీన్.. రుద్రాణిని వాయించేసిన కావ్య, సపోర్ట్ చేసిన అపర్ణ- శృతికి హ్యాండ్ ఇచ్చిన రాహుల్
తన జీవితాన్ని నాశనం చేయవద్దని ఎంత బతిమిలాడినా కూడా వినిపించుకోకుండా మాళవికని అభిమన్యు ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తాడు. వేద పార్టీకి రెడీ అవుతుంటే ఖుషి వచ్చి నువ్వు బాగోలేదు ఏదో తక్కువ అయ్యిందని అంటుంది. అప్పుడే యష్ వచ్చి తలలో మల్లెపూలు తగ్గాయని తీసుకొచ్చి మురిపెంగా పెడతాడు. మాళవిక రోడ్డు మీద వెళ్తూ అభి చెప్పిన మాయ మాటలు గుర్తు చేసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది.