మధుకర్ ఒక కాన్సెప్ట్ చెప్తాడు. ఇద్దరూ కాలేజ్ స్టూడెంట్స్ లాగా నటించి రీల్స్ చేయమని ఐడియా ఇస్తాడు. కృష్ణ నాకు నటన అంటే చాలా ఇష్టం అందరూ నన్ను దద్దమ్మలాగా చూస్తున్నారు. మీరు మొన్న చేసిన వీడియోకి చాలా డబ్బులు వచ్చాయి మళ్ళీ వీడియో చేస్తే బాగుంటుందని షూటింగ్ ప్లాన్ చేసుకున్నానని బతిమలాడతాడు. నీ ప్రాబ్లం విన్నాక హెల్ప్ చేయాలని అనిపిస్తుంది కానీ ఏసీపీ సర్ ఒప్పుకుంటారా అంటుంది. మురారీ వస్తే విషయం చెప్తుంది. వీడియో చేస్తే డబ్బులు వస్తాయని కృష్ణ అంటుంది. వాడికి డబ్బులు వస్తే నాకు ఆఫీసర్స్ దగ్గర నుంచి దొబ్బులు వస్తాయని అంటాడు. కానీ కృష్ణ మాత్రం ముద్దుగా ఒప్పుకోవా అని అడిగేసరికి సరే అంటాడు. వాళ్ళు షూటింగ్ కి ఒప్పుకున్నందుకు మధుకర్ ఇల్లు మొత్తం తిరుగుతూ డాన్స్ చేస్తూ పిచ్చి వాడిలా మాట్లాడతాడు.
Also Read: వావ్ వాట్ ఏ సీన్.. రుద్రాణిని వాయించేసిన కావ్య, సపోర్ట్ చేసిన అపర్ణ- శృతికి హ్యాండ్ ఇచ్చిన రాహుల్
మధుకర్ షూటింగ్ కి మొత్తం రెడీ చేస్తాడు. బెలూన్స్ తో అందంగా డెకరేట్ చేస్తారు. కృష్ణ సిగ్గుపడుతూ వస్తుంది. ఒక కవిత్వం చెప్పి నిజంగానే తన మనసులో ప్రేమని కృష్ణ మురారీ ముందు ఉంచుతుంది. నిస్సందేహంగా ఇది ప్రేమే మురారీ. ఇప్పుడు నేను కాను నీతో ఉండాలని వచ్చి నీలో నేనైపోయాను. మోకాళ్ళ మీద నిలబడి మురారీకి గులాబీ పువ్వు అందిస్తుంది. మురారీ దాన్ని సంతోషంగా అందుకుని తనని హగ్ చేసుకుంటాడు. ఈ వీడియో ద్వారా కృష్ణ నిజంగా తన మనసులో ప్రేమని బయట పెడుతుంది. నేను రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి నువ్వు చెప్పింది ఏంటి? అద్భుతంగా చెప్పావ్ ఒక కావ్యంలాగా చెప్పావని మధుకర్ కృష్ణని మెచ్చుకుంటాడు. మురారీ చెప్పేది లేదా అని కృష్ణ అంటుంది. నేను చెప్పే అవసరం లేదు చెప్పాలని కూడా అనుకోవడం లేదని మురారీ అనేసరికి కృష్ణ బాధపడుతుంది.
Also Read: పెళ్లి చేసుకొచ్చిన అభిమన్యు, మాళవిక షాక్ - హనీమూన్ కి చెక్కేసిన వసంత్ దంపతులు
అలేఖ్య కృష్ణ వాళ్ళతో లవ్ ప్రపోజల్ వీడియో షూటింగ్ చేస్తున్నారని ముకుంద ముందు మాట్లాడుకుంటారు. ఈ వీడియోతో వాళ్ళు భార్యాభర్తలుగా కాదు గొప్ప లవర్స్ గా కనిపిస్తారని అలేఖ్య అంటుంది. అప్పుడే మధుకర్, మురారీ వాళ్ళు ఇంటికి వస్తారు. ఈరోజు మీ కోడలు పర్ఫామెన్స్ చింపేసిందని మధుకర్ సంబరంగా చెప్తాడు. ఎలా చేసింది నీ భార్య అని రేవతి అడిగేసరికి నేను నా డైలాగ్ కూడా మర్చిపోయాను అంత బాగా చేసిందని అంటాడు. అందరూ కృష్ణకి కంగ్రాట్స్ చెప్పి మెచ్చుకుంటారు. ముకుంద మాత్రం బాధగా ఉంటుంది. తండ్రి ఫోటో ముందు నిలబడి తన భర్తతో ప్రేమలో పడ్డానని కృష్ణ తెగ సిగ్గుపడిపోతుంది.