కింద పడుకుంటే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని కావ్య వచ్చి మంచం మీద పడుకుంటానని అంటే కుదరదని కిందకే పంపించేస్తాడు. తను నిద్రపోయిన తర్వాత మెల్లగా భుజం గీరేసరికి గట్టిగా అరిచి లేస్తుంది. నేనేమైనా గురక పెట్టానా అని అడుగుతాడు. అసలు మీరు నిద్రపోతే కదా గురక పెట్టడానికని అంటుంది. అరుంధతి అపర్ణకి ఫోన్ చేసి వెన్నెల రాహుల్ పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడమని అడుగుతుంది. రాహుల్ తో పెళ్లి అనేసరికి అపర్ణ డల్ గా ఉంటుంది. రాహుల్ ఇంటి వాడు కాదనను కానీ తను మంచి వాడు కాదు రేపు ఏదైనా సమస్య వస్తే ఏంటని భయపడుతుంది. ఈ పెళ్లికి అడ్డుపడితే రుద్రాణి అసలు ఊరుకోదని శుభాష్ అంటాడు. రాహుల్ ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి బతుకు ఏమవుతుందోనని టెన్షన్ పడుతుంది. ఇద్దరూ కాసేపు దీని గురించి మాట్లాడుకుంటారు.


Also Read: పెళ్లి చేసుకొచ్చిన అభిమన్యు, మాళవిక షాక్ - హనీమూన్ కి చెక్కేసిన వసంత్ దంపతులు


హమ్మయ్య గంట నిద్రపోయాను అనుకుని రాజ్ మళ్ళీ నిద్రలేచి కావ్యని లేపి గురక సౌండ్ వినిపించిందా అంటాడు. కళ్యాణ్ వెన్నెలతో రాహుల్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి ఫోన్స్ మీద ఫోన్స్ వస్తాయి. అది కళ్యాణ్ ని చూసి కావ్యని తీసుకొస్తాడు. మనం స్వప్నని మాత్రమే చూడాలని అనుకున్నాం కానీ తను తప్ప మిగతా అందరూ అమ్మాయిలు ఫోన్లు చేస్తున్నారని చెప్తాడు. అప్పుడే టీవీ యాంకర్ శృతి ఇంటి దగ్గరకి వచ్చి రాహుల్ కి ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావ్ అంటే మీ ఇంటి ముందని అనేసరికి రాహుల్ షాక్ అవుతాడు. డైరెక్ట్ గా ఇంటికే వచ్చావ్ ఏంటని టెన్షన్ పడతాడు. ఈ అమ్మాయి రిపోర్టర్ అని పెళ్ళిలో రాహుల్ తనతో క్లోజ్ ఉండటం చూశానని కళ్యాణ్ గుర్తు చేసుకుంటాడు. ఫోటో చూసి అందరూ అపార్థం చేసుకుంటున్నారని అనేసరికి నేను కాక ఇంక ఎంత మంది ఉన్నారని అంటుంది. దీంతో తనని సైలెంట్ గా అక్కడ నుంచి తనని తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళని కావ్య వాళ్ళు ఫాలో అవుతారు.


శృతి: నువ్వు నన్ను మోసం చేస్తున్నావా


రాహుల్: నా ప్రేమని నువ్వు అనుమానిస్తున్నావా. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకోవాలని అనుకున్నా. కానీ నీకు నా మీద నమ్మకం లేదు. నేను నిన్ను మోసమే చేస్తాను తనకి చాలా ఆస్తి ఉంది


శృతి: నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు


రాహుల్: నువ్వు మాత్రం నన్ను ఆస్తి కోసమే కదా లవ్ చేసింది అయినా నేను లవ్ చేసిన అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకోవాలంటే అది జరగదు లిస్ట్ చాలా పెద్దది అందులో నువ్వు మిడిల్ క్లాస్ అమ్మాయివి. ఒక బిజినెస్ డీల్ చేద్దామా. నీ న్యూస్ చానెల్ ని డెవలప్ చేస్తాను నాకు పెళ్లి అయినా కూడా నిన్ను బాగా చూసుకుంటాను


శృతి: అంటే ఏంటి నీ ఉద్దేశం నన్ను ఉంచుకుంటాను అంటావా


రాహుల్: కేసు అని పిచ్చి వేషాలు వేస్తే నీ మిస్సింగ్ కేసు మీ చానెల్ లోనే వస్తుంది


Also Read: స్వప్నని పెళ్లిచేసుకుంటానని వచ్చిన అరుణ్- రాహుల్ కి వెన్నెలనిచ్చి పెళ్లి చేస్తానన్న అరుంధతి


శృతి ఏడుస్తుంటే కావ్య వచ్చి ఖర్చిఫ్ ఇస్తుంది. నీ ఫీలింగ్స్ తో ఆడుకున్న వాడిని ఈజిగా వదిలేస్తావా అంటుంది. రాహుల్ నిన్ను పెళ్లి చేసుకుంటానని అనేందుకు ప్రూవ్స్ ఏమున్నాయని కావ్య అడుగుతుంది. వాడు చాలా తెలివిగా నాతో ఫోటోస్ ఏం దిగలేదని చెప్తుంది. గుర్తుకురావడం లేదని శృతి అంటుంది. ఒక్కరోజే టైమ్ ఉంది ఎలాగైనా గుర్తు చేసుకుని చెప్పమని అంటారు.