రిషి తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ ఉంగరం తీసి వసుధార చేతిలో పెడతాడు. మన బంధానికి మనం పెట్టుకున్న పేరు రిషిధార ఇప్పుడు వసుధార మాత్రమే మిగిలి ఉంది. రిషిధారని మీ అబద్ధపు సాక్ష్యాలు కూల్చేశాయని బాధగా అంటాడు. ఈ ఒక్క విషయంలో క్షమించండి సార్ ఇంకెప్పుడు ఏ విషయం మీ దగ్గర దాచనని వసు బతిమలాడుతుంది. కానీ రిషి మాత్రం మీతో బంధం నన్ను ఎప్పుడు హింసిస్తూనే ఉంది అందుకే నాకు బంధాలు సరిపోవని అంటాడు.


రిషి: ప్రేమికుల మధ్య అభిప్రాయ బేధాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ మన మధ్య నమ్మకం అనే ఇష్యూ వచ్చింది. నమ్మకం కోల్పోయిన చోట ప్రేమ నిలబడదు


వసు: నేను మీ నీడను


రిషి: నన్ను మనిషిగా చంపేశారు వదిలేయ్


వసు: మీమీద ప్రేమ, అభిమానం ఎప్పటికీ పోవు


Also Read: టెన్షన్.. టెన్షన్.. నెలతప్పిన స్వప్న, వెన్నెలతో రాహుల్ నిశ్చితార్థం- కిడ్నాపైన కావ్యని కాపాడేదెవరు?


రిషి: అదే నిజమైతే నన్ను ఎప్పటికీ కలవాలని అనుకోకు సెలవు అనేసి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోతాడు


వసు నిలబడి ఏడుస్తుంటే జగతి ఓదార్చడానికి వస్తుంది. భుజం మీద చెయ్యి వేస్తే నన్ను టచ్ చేయకండి మేడమ్. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. జరుగుతున్నవన్నీ రిషి సర్ కి చెప్దామని, విషయం దాచి పెడితే భరించలేరని చెప్పాను. నేను భయపడుతున్నట్టే జరిగింది కదా.


జగతి: నేను ఏం చేసినా మీకోసమే చేశాను


వసు: రిషిని కాపాడుకోవాలని నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. ఆయన మనసులో నుంచి నన్ను చెరిపేసేలా చేశారు. మీరే మా ప్రేమకి కారణం ఆ ప్రేమ విడిపోవడానికి కారణం కూడా మీరే అయ్యారు


జగతి: మీ ప్రేమ చాలా గొప్పది రిషి ఎప్పటికైనా తిరిగి వస్తాడు నిన్ను అర్థం చేసుకుంటాడు


వసు: అది కల.. సర్ ఇంక తిరిగిరారు తన మనసుని ముక్కలు చేశాము. అందుకే మన బంధానికి ముగింపు పలికారు డానికి సాక్ష్యం ఇదేనని రిషి ఇచ్చిన ఉంగరం చూపిస్తుంది. మీ మాట విన్నందుకు నాకు నేను విధించుకున్న శిక్ష ఇది. మీరు చెప్పినట్టు చేస్తే రిషి సర్ దక్కుతారు అనుకున్నా కానీ ఎవరికీ కాకుండా ఒంటరిగా వెళ్లిపోయారు. మీరు అడిగిన గురు దక్షిణ ఇచ్చినందుకు నాకు మంచి ప్రతిఫలం ఇచ్చారు. మీరు మళ్ళీ నన్ను కలవద్దు. రిషి సర్ లాగే నేను అందరికీ దూరంగా వెళ్లిపోతున్నా


జగతి: ఒంటరిగా ఎక్కడికి వెళ్తావ్ వద్దు వెళ్లొద్దు


Also Read: ఆదిత్యని వెళ్ళగొట్టిన అభిమన్యు- తప్పతాగి రోడ్డు మీద తిరుగుతున్న మాళవిక


వసు వెళ్ళిపోతుంది. అటు రిషి, ఇటు వసు వెళ్లిపోతూ జరిగినవన్నీ గుర్తు చేసుకుంటారు. వసు ఒక్కతే ఏడుస్తూ ఇంటికి రావడం చూసి సుమిత్ర కంగారుపడుతుంది. ఏమైంది కట్టుబట్టలతో ఎందుకు వచ్చావని అంటుంది. రిషి సర్ జీవితంలో నేను లేనమ్మా అని వసు ఏడుస్తూ చెప్పేసరికి సుమిత్ర షాక్ అవుతుంది. ఇద్దరి మధ్య జరిగిన విషయం మొత్తం చెప్తుంది. రిషి సర్ ని కాపాడుకోవడం కోసం అలా చేయాల్సి వచ్చింది నా ప్రేమకి నేనే సంకెళ్ళు వేసుకుని చివరికి ఒంటరిగా మిగిలిపోయానని పరోక్షంగా ఆయన్ని చంపేశానని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఏంటి నీ జీవితం ఇలా అయిపోయిందని సుమిత్ర గుండెలు బాదుకుని ఏడుస్తుంది. బాధ తట్టుకోలేక సుమిత్రకి గుండె నొప్పి వస్తుంది. రిషి ఒకచోట కూర్చుని టీ తాగుతూ తండ్రితో గడిపిన క్షణాలు తలుచుకుంటాడు. అక్కడ పిల్లవాడు లెక్కలు సరిగా రాలేదని ఇబ్బంది పడుతుంటే రిషి తనకి నేర్పిస్తాడు.