Laxmi Yog on Shukra Gochar 2023: గ్రహాలు ఓ రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశించే సమయంలో ఆ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మే 29 వరకూ మిథున రాశిలో సంచరించిన శుక్రుడు మే 30 నుంచి కర్కాటక రాశిలో సంచరించనున్నాడు.  సుఖం, ఆకర్షణ, విలాసాలు, అందం, భౌతిక సౌకర్యాలకు కారకంగా భావించే శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి లక్ష్మీయోగం సూచిస్తోంది. జ్యోతిషశాస్త్రంలో లక్ష్మీ యోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం మకర రాశి వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని, అదే సమయంలో శుక్రుని సంచారంతో మరికొన్ని రాశులవారి భవిష్యత్ కూడా ప్రకాశించబోతోందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. 


మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం ఈ రాశివారికి కలిసొస్తుంది. ఈ సమయంలో మీరు ఎంత కష్టమైన పని తలపెట్టినా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ లభిస్తుంది. వేతనం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. వ్యాపారాలు లాభాలు పొందుతారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి. ఇల్లు లేదా వాహనాన్ని కూడా కొనుగోలు చేసే ఆలోచన బలపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.


Also Read: పది రకాల పాపాలను తొలగించే రోజు దశపాపహర దశమి ప్రత్యేకత ఇదే!


మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)


శుక్ర సంచారం వల్ల ఏర్పడిన లక్ష్మీయోగం మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఇది మీకు సంపద, ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి.  నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. శుక్రుడి అనుగ్రహం వల్ల జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఏర్పడి దాంపత్య జీవితంలో సంతోషం నెలకొంటుంది.


కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)


శుక్రుడి సంచారం కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. శుక్రుడు మీ రాశిలోనే సంచరిస్తున్నందున ఉద్యోగంలో పదోన్నతి, జీతంలో పెరుగుదల ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. ఈ రోజు పెట్ట పెట్టుబడులు భవిష్యత్ లో లాభాలను సూచిస్తాయి. వైవాహిక జీవితం బావుంటుంది. 


సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)


ఈ రాశివారికి కూడా శుక్రుడి సంచారం శుభఫలితాలను ఇస్తోంది. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. కెరీర్ బావుంటుంది. వృత్తి,వ్యాపారం, ఉద్యోగం బాగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏ విధమైన సమస్య తలెత్తినా చిటికెలో పరిష్కరించేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.


Also Read: మే 30 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారు ఎవర్నీ అతిగా నమ్మొద్దు


వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)


కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం వల్ల మీరు ఏ పని తలపెట్టినా కలిసొస్తుంది. కోరుకున్నవి నెరవేరుతాయి. ధనలాభం ఉంటుంది. విద్యారంగంలో అనుబంధం ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. విదేశాల్లో చదవాలనుకునేవారి కోరికలు నెరవేరతాయి.


మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)


శుక్ర సంచారంతో  ఏర్పడిన లక్ష్మీయోగం వల్ల మకర రాశి వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఈ యోగం మీ హోదాను పెంచుతుంది. ఆర్థికంగా మరో మెట్టు ఎక్కిస్తుంది.  ఈ సమయంలో మీరు మీ రంగంలో చేసే పని నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యక్తిగత జీవితంలో ఆనందం, ప్రేమ పెరుగుతాయి


మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కర్కారట రాశిలో శుక్రుడి సంచారం మీన రాశివారికి బాగానే ఉంటుంది. ఈ సమయంలో ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.