సీతాదేవి దంపతులు కనకం ఇంటికి వస్తారు. తన కూతురికి న్యాయం చేయమని కనకం వాళ్ళని బతిమలాడుతుంది. ఈ శిథిలమైన శిల్పాన్ని తీసుకెళ్ళి మీ అందమైన బొమ్మల మధ్య నిలబెట్టమని అడగలేమని కృష్ణమూర్తి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. కావ్య తన అక్క గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోమని అడుగుతుంది. తన కడుపులో బిడ్డ పెరుగుతుంది, తనకి న్యాయం చేయమని అంటుంది. వీళ్ళ జీవితానికి ఒక దారి చూపించాలనే వచ్చామని ఇంద్రాదేవి చెప్తుంది. మీ స్వప్నని రాహుల్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుని ఆ విషయం చెప్పడానికి ఇక్కడకి వచ్చామని రాజ్ చెప్తాడు. ఈ విషయం బయటకి రాకముందే పెళ్లి చేయాలని సీతారామయ్య అంటాడు. కావ్య రాజ్ కి కళ్ళతోనే థాంక్స్ చెప్తుంది.


ఇంట్లో అందరూ సీతారామయ్య వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రుద్రాణి మీద శుభాష్ సీరియస్ అవుతాడు. నీ కొడుకుని సవ్యంగా పెంచలేక ఇలా తయారు చేశావ్ ఇదేనా పెంపకం ఇలాగేనా పెంచేదని తిడతాడు. నా తప్పుకి మా మమ్మీని ఎందుకు అంటారని రాహుల్ మాట్లాడితే శుభాష్ సీరియస్ అవుతాడు. అందరూ తలా ఒక మాట అంటారు. ఏంటి అందరూ నా మీద నా కొడుకు మీద యుద్ధం ప్రకటిస్తున్నారని రుద్రాణి సీరియస్ అవుతుంది. జరిగిన తప్పులో నా కొడుకు తప్పు  ఎంత ఉందో ఆ స్వప్న తప్పు కూడా అంతే ఉందని తిడుతుంది. అప్పుడే కావ్య వాళ్ళు ఎంట్రీ ఇస్తారు.


Also Read: తన మనసులో కృష్ణకే స్థానమని తెగేసి చెప్పిన ముకుంద- బాధలో కూరుకుపోయిన 'కృష్ణ ముకుంద మురారీ'


ఇంద్రాదేవి: వారం రోజుల్లో స్వప్నకి రాహుల్ కి పెళ్లి చేస్తామని మాట ఇచ్చి వచ్చాం


రుద్రాణి: నేను ఒప్పుకోను


అపర్ణ: ఎందుకు ఒప్పుకోవు. నా కొడుకు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే పెళ్లిలో నుంచి లేవదీసుకుపోయాడు. నా కొడుకంటే అసూయ రాహుల్ కి మాత్రమే కాదు నీకు కూడ. వాడంటే రగిలిపోయి ఈ అమ్మాయికి ముసుగు వేసి పెళ్లి చేశాం. ఇప్పుడు నీ కొడుక్కి అసూయతో పెళ్లి చేయాలని అనుకోవడం లేదు రాహుల్ తప్పు చేశాడని సాక్ష్యాలతో సహా రుజువు చేసింది ఈ అమ్మాయి. నీతో సహా అందరూ నమ్మిన తర్వాత స్వప్నతో పెళ్లి చేయాలని నిర్ణయించాం. నేను ఒప్పుకున్నాను ఇంట్లో అందరూ సమ్మతించిన తర్వాతే మాట్లాడటానికి వెళ్లారు


రుద్రాణి: అందరూ సమ్మతిస్తే నేను సమ్మతించాల్సిన పని లేదా


కావ్య: ఒప్పుకోకపోతే చెప్పండి నేను న్యాయ పోరాటానికి దిగుతాను, మా అక్కని తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తాను సాక్ష్యాలతో సహా నిరూపించి మీ కొడుకుని జైలుకి పంపిస్తాను


ఇంద్రాదేవి: ఈ కేసు కోర్టుకి వెళ్ళడం అంటే దుగ్గిరాల ఇంటి పరువు రోడ్డుకి ఎక్కినట్టే అప్పుడు అందుకు కారణమైన మీ ఇద్దరినీ ఇంటి నుంచి గెంటేస్తాను


రుద్రాణి: కావ్యకి అక్క అంటే రాహుల్ కి చెల్లెలు వరుస అవుతుంది వావి వరసలు లేకుండా ఎలా పెళ్లి చేయమంటావ్ ఇది అనాచారం కాదా?


అపర్ణ: అనాగరికం గురించి మీ తల్లీ కొడుకులే మాకు గుర్తు చేయాలి


రుద్రాణి: అవకాశం దొరికింది కదా అని ఏమి లేని పిల్లని నా కొడుక్కి అంట గట్టాలని చూడొద్దు. కావాలంటే స్వప్నకి అబార్షన్ చేయించి వేరే సంబంధం చేయమని డబ్బు ఇద్దాం నాన్న


Also Read: తులసిని తోసేసి మరీ కేఫ్ కాగితాలు చేజిక్కించుకున్న లాస్య- దివ్య, రాజ్యలక్ష్మి మాటల యుద్దం


కావ్య: రుద్రాణి గారు మర్యాదగా మాట్లాడండి ఒక పశువుని కన్నందుకు మీరు బాధపడాల్సింది పోయి ఒక ఆడపిల్లని బలిపశువుగా మార్చమని సలహా ఇస్తున్నారా?


రాహుల్: అసలు మొత్తం చేసింది ఇదేనమ్మా అని కావ్యని అనేసరికి రాజ్ లాగిపెట్టి ఎవరిని ఏమంటున్నావ్ అని చెంప పగలగొడతాడు


శుభాష్: నా ఇంట్లో పడి తింటూ నా ఇంటి కోడలిని అదీ ఇదీ అని మాట్లాడతావా అని కొట్టబోతుంటే సీతారామయ్య అడ్డుపడతాడు


అపర్ణ: కావ్య నాకు ఇష్టం లేకపోయినా ఇంటికి వచ్చిన కోడలు ఆమె వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా మేము ఎవరం మాట్లాడలేదు నీకే ఆ సంస్కారం ఉంటే నీ కొడుక్కి బుద్ధి చెప్పి క్షమాపణ చెప్పించే దానివి


రుద్రాణి: ఎన్ని చెప్పినా చెల్లి వరుస అయ్యే అమ్మాయితో పెళ్లి జరిపించను


అపర్ణ: అసలు నువ్వు మాకు ఏ వరుస అవుతావు, నువ్వేమైన మా ఆయన రక్తం పంచుకుని పుట్టావా? 


ధాన్యలక్ష్మి: రాజ్ కి ఏ వరుస అవనప్పుడు ఏ విధంగా చెల్లెలు అవుతుంది


సీతారామయ్య: ఇక వాదనలు అనవసరం స్వప్నని రాహుల్ కి ఇచ్చి చేయడానికి నేను నిర్ణయించాను