గుప్పెడంతమనసు జూలై 22 ఎపిసోడ్ (Guppedanta Manasu July 22nd Written Update)


రిషి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని తెలుసుకుని మహేంద్ర-జగతి ఆ క్షణం సంతోషించినా ఆ తర్వాత కంగారుపడతారు. శైలేంద్రకి ఏమైనా తెలిసిందా అనుకుంటారు..అదంతా విన్న శైలేంద్ర అక్కడకు ఎంట్రీ ఇస్తాడు. కానీ మహేంద్ర బయటపడకుండా ఆపుతుంది జగతి. 
మహేంద్ర: మాపై నీకు చాలా అనుమానాలున్నాయి కదా అందుకే మమ్మల్ని దొంగచాటుగా వెంబడిస్తున్నావ్..నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి రా నాతో అని శైలేంద్ర చేయి పట్టుకుని లాక్కెళతాడు మహేంద్ర..
జగతి మాత్రం మహేంద్ర  అని వారిస్తున్నా ఆగడు.... అన్నయ్యా అని హాల్లోకి వెళ్లి పిలుస్తాడు.. 
ఫణీంద్ర: ఏంటి మహేంద్ర ఏమైంది
మహేంద్ర: చెప్పు శైలేంద్ర అన్నయ్య అడుగుతున్నారు కదా నీ అనుమానాలు, ప్రశ్నలు అందరి ముందు చెప్పు
దేవయాని: అనుమానం ఏంటి ప్రశ్నలేంటి
ఫణీంద్ర: దేవయాని నోరెత్తావంటే మర్యాదగా ఉండదు. నా తమ్ముడికి కోపం వచ్చేంత తప్పుడు పని వీడు ఏదో చేసేఉంటాడు. చెప్పు మహేంద్ర వీడేం చేశాడు
మహేంద్ర: శైలేంద్ర హద్దుమీరి ప్రవర్తిస్తున్నాడు అన్నయ్యా..నేను జగతి బాల్కనీలో రిషి గురించి మాట్లాడుతూ బాధపడుతుంటే శైలేంద్ర వచ్చి అనుమానిస్తూ ప్రశ్నలు వేస్తున్నాడు. మా పనుల గురించి ఆరాలు తీస్తున్నాడు. అసలు తన సమస్యేంటో మీరే అడగండి.
ఏదో సర్దిచెప్పేందుకు శైలేంద్ర ప్రయత్నించినా...నోర్ముయ్ అని ఆపేస్తాడు ఫణీంద్ర..
ఫణీంద్ర: నీకు జ్ఞానం లేదా..ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా..అసలు నీ మనసులో అనుమానం ఎందుకొచ్చిందో చెప్పు. అయినా నువ్వు బాల్కనీలోకి వెళ్లాల్సిన అవసరం ఏమోచ్చింది..వెళ్లినా తిరిగి రావాలి కదా వాళ్ల విషయంలో ఎందుకు కలుగజేసుకున్నావ్... దేవయాని వైపు చూస్తున్న శైలేంద్రను చూస్తూ... ఏంటి మీ అమ్మను చూస్తున్నావ్ ఇందులో నీ పాత్రకూడా ఉందా అని దేవయానిపై ఫైర్ అవుతాడు. మొన్నే చెప్పాను రిషిపై కలుగజేసుకోవద్దని అయినా పదే పదే అదే చేస్తున్నావ్..నీ ఉద్దేశం ఏంటి...
ఇదేదో గొడవ జరిగేలా ఉందని జగతి భయపడి ఆపేందుకు ప్రయత్నిస్తుంది కానీ ఫణీంద్రమాత్రం తగ్గడు.. నువ్వు కారణం చెప్పేవరకూ ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలరు..
జగతి: ఇప్పటికే రిషి గురించి బాధపడుతున్నాం..ఈ గొడవ పెద్దది చేయడం ఇష్టం లేదు..శైలేంద్ర గురించి మీకు చెప్పాలి అనుకున్నాం చెప్పాం.. తన తప్పు తానే తెలుసుకుంటాడు ఈ ఒక్కసారికీ తనని వదిలేయండన్న జగతి మాటలకు సరేలే అంటాడు మహేంద్ర...
మహేంద్ర: దయచేసి మా విషయాల్లో కలుగజేసుకోవద్దు మా బాధలో మమ్మల్ని ఉండనీ..ఓ పక్క కాలేజీ పేరు నిలబెట్టడం కోసం, మరోపక్క రిషి కోసం ప్రతిక్షణం బాధపడుతున్నాం.. అర్థం చేసుకోవాల్సిన నువ్వే ఇలా ప్రవర్తిస్తుంటే బాధపడాల్సి వస్తోంది.
ఫణీంద్ర: నా తమ్ముడిజోలికి వస్తే కొడుకునైనా వదలను..మరోసారి రిపీటైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..జాగ్రత్త
దేవయాని: తనేదో తెలియక అలా చేశాడు...శలైంద్ర నువ్వు గదిలోకి వెళ్లు అని పంపించేస్తుంది
అన్నయ్యా sorry అని చెప్పిసి జగతిని తీసుకుని మహేంద్ర లోపలకు వెళ్లిపోతాడు


Also Read: నిజానికి చేరువలో రిషి -ఆవేదనలో వసు, మహేంద్ర ముందు ఓపెన్ అయిపోయిన శైలేంద్ర!


దేవయాని: మీ కొడుకుని వాళ్లముందు నిలదీయడం ఏంటి...ఇదేం బాలేదు
ఫణీంద్ర: కొడుకును వెనుకేసుకురావడం కాదు..అయినా అడగాల్సింది నన్నుకాదు వాడిని. భార్య భర్త మాట్లాడుకుంటుంటే అక్కడకు వెళ్లడం ఏంటి..వాడి మనసులో దురుద్దేశం ఉంటే నాలుగు మాటలు చెప్పు అనేసి వెళ్లిపోతాడు
ధరణి: మీ మంచితనం వల్లే ఈ దుర్మార్గుల విషయం బయటపడడం లేదు. నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు అనుకుంటుంది ధరణి...


రూమ్ కి వెళ్లిన తర్వాత రిషి...వసుధార మాటలు గుర్తుచేసుకుంటాడు. మీ అంతటమీరు నిజం తెలుసుకోండి, మీ తల్లి మిమ్మల్ని మోసం చేస్తుందా అన్న మాటలు తలుచుకుంటాడు. అప్పుడు నిజంగా అన్నిసార్లు నాపై అటాక్ ఎవరు చేయించారు, నా విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తూనే...అయినా గతం గురించి నాకు అనవసరం అనుకుంటాడు. అంతలోనే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ టేకప్ చేయమన్న జగతి మాటలు తలుచుకుని నన్ను రాయిలా మార్చేశారు నా వాల్ల కాదు. నేను వ్యక్తిగతంగా ఆలోచించి నా ఆశయాలకు దూరం అవుతున్నానా అని ఆలోచనలో పడతాడు..


Also Read: ఈగోమాస్టర్ ని ఆలోచనలో పడేసిన వసు, కత్తి పోటుకి ఇంచు దూరంలో రిషి!


మహేంద్ర-జగతి
ఎందుకింత తొందరపడ్డావ్ అని మహేంద్రని అడుగుతుంది. శైలేంద్రని అదుపులో పెట్టాలంటే ఇదే దారి అని రిప్లై ఇస్తాడు మహేంద్ర. రిషి గురించి మనం మాట్లాడుకున్నది వినే ఉంటాడని జగతి అంటే లేదులే జగతి అని సముదాయిస్తాడు మహేంద్ర. 
జగతి: అందరి ముందూ మంచిగా మాట్లాడి నాతో క్రూరంగా మాట్లాడేవాడు. తనే ప్రమాదాలు సృష్టించి తనే సానుభూతి ప్రకటించేవాడు 
మహేంద్ర: అన్నయ్య గురించి ఆలోచించి తగ్గాల్సి వస్తోంది..అలాగని నా కొడుక్కి హాని తలపెట్టిన శైలేంద్రని ఊరికే వదలను. తమ్ముడు అని ఆప్యాయంగా పిలుస్తూనే ఇంత ద్వేషం పెంచుతున్నాడు.
జగతి: నీకోపంలో బాధలో న్యాయం ఉంది కానీ తొందరపడకు 
మహేంద్ర: అంతా కోల్పోయాం ఇప్పుడు తొందరపడినా ఏం చేయలేం. 
జగతి: రిషి నన్ను అసహ్యించుకున్నా చీదరించుకున్నా పర్వాలేదు తను నా కొడుకు. తనకి నిజం తెలియక ప్రవర్తిస్తున్నాడు.దానికి రిషి బాధ్యుడు కాదు. తనెప్పుడూ క్షేమంగా ఉండాలి అది చాలు నాకు..
మహేంద్ర: నీకున్న ఓర్పు సహనం నాకు లేవు..అందరి ముందూ కొడుకుని పరాయివాడిలా పరిచయం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. నన్ను సార్ అని పిలుస్తుంటే గుండెలు పగిలిపోయాయి. వీడు చేసిన పాపాలకి మనమధ్య దూరం పెరిగింది. ఇలాంటి వాడిని ఊరికే వదిలేయకూడదు. 
జగతి: తనకి బుద్ధి చెప్పే సమయం వస్తుంది అప్పటి వరకూ ఆవేశపడకు...
ముల్లుని ముల్లుతోనే తీయాలి..కుట్రలు చేసేవాడిని ఇలాగే ఎదుర్కోవాలి వాళ్లు అన్నయ్యకు మాత్రమే భయపడి ఉంటారు వాళ్లని హద్దుల్లో పెడితే కానీ మనం అనుకున్నది జరగదని మహేంద్ర అంటే..ఇలా పదే పదే జరిగితే అని జగతి భయపడుతుంది. కానీ అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, అన్నయ్యని బాధపెట్టకుండా నెమ్మదిగా విషపురుగుల కోరలు తీసేద్దాం అని భరోసా ఇస్తాడు మహేంద్ర.. నువ్వు రిషి గురించి ఆలోచించు నేను వీళ్ల సంగతి చూస్తానని భరోసా ఇస్తాడు


అటు రూమ్ లో వసుధార రిషి ఆలోచనల్లో మునిగితేలుతుంది. ప్రేమబంధం, రిషిధార బంధం, ప్రేమ,జీవితం అని ఏవేవో మాట్లాడుకుంటుంది. మీరు అర్థం చేసుకునే వరకూ మీపై ఉన్న ప్రేమని గుండెల్లో దాచిపెట్టుకుంటాను సార్ అనుకుంటుంది. ఇంతలో ఏంజెల్ వచ్చి భోజనం తెస్తానంటే నేను డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తానంటుంది. సరే రా రిషిని కూడా పిలుద్దాం అంటుంది...