గుప్పెడంతమనసు ఫిబ్రవరి 28 ఎపిసోడ్ (Guppedanta Manasu February 28th Update)


వసుధార-రిషి గురించి తప్పుగా మాట్లాడిన ఇద్దరు లెక్చరర్లను తన క్యాబిన్ కి పిలిచి డిస్మిస్ చేస్తున్నట్టు చెబుతాడు. రిషినివాళ్లు బతిమలాడుతుండగా..మిగతా ఫార్మాలిటీస్ అన్ని జగతి మేడం చూసుకుంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జగత కూడా నేనేం చేయలేను అనేస్తుంది. వసుధరాని బతిమలాడుదామా అని ఓ లెక్చరర్ అంటే..దేవయాని మేడం కాళ్లు పట్టుకుందాం పదండి అనుకుంటూ అక్కడి నుంచి వెళతారు..


అటు ఇంట్లో దేవయానికి పండ్లు తీసుకొచ్చి ఇస్తుంది ధరణి. ఈ మధ్య నా మీద నీకు లేనిపోని ప్రేమ పొంగుకొస్తోందని సెటైర్స్ వేస్తుంది.మీ మీద పాత ప్రేమ అలాగే ఉందంటుంది ధరణి. ఇంతలో కాలేజీ నుంచి లెక్చరర్లు ఇద్దరూ వచ్చి దేవయాని కాళ్లపై పడతారు. వసుధార మా జాబ్ పోయేలా చేసిందని చెబుతారు. ఏం జరిగిందని దేవయాని అడిగితే.. కాలేజీలో జరిగినదంతా చెబుతారు.. షాక్ అయిన దేవయాని..మీకు ఓ పని చెబుతాను ప్రెస్ మీట్ లోమీరు ఇదే విషయాన్ని చెప్పండి అని సలహా ఇస్తుంది. 
దేవయాని: వసుధార మాపై చాడీలు చెప్పి ఉద్యోగం తీయించింది.. రిషి సార్ చాలా మంచివాడు.. వసుధార వల్లే రిషి సార్ కి బ్యాడ్ నేమ్ అని చెప్పమంటుంది
లెక్చరర్లు: మా ఉద్యోగం ఉన్నట్టేనా
దేవయాని: నేను మీ వెనుక ఉన్నాకదా ఎందుకు భయపడుతున్నారు
లెక్చరర్లు: మీరు ఏం  చెబితే అదే చేస్తాం... వసుధార చాలా ఎక్కువ చేస్తోంది
దేవయాని: వసుధార గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్.. నేను చెప్పిన పని చేయండి
లెక్చరర్లు: మళ్లీ మీ మాట వెనక్కు తీసుకోరు కదా
అవన్నీ నాకు వదిలేయండి అని భరోసా ఇస్తుంది దేవయాని. ఇదంతా వింటుంది ధరణి


Also Read: వసు గురించి తప్పుగా మాట్లాడిన లెక్చరర్స్- ఊహించని నిర్ణయం తీసుకున్న రిషి


వసుధార..రిషి  గురించి ఆలోచిస్తుంది. జ్వరంలో కాలేజీలో ఉంటే ఇలాగే నీర్సపడిపోతారు అనుకుంటూ రిషి దగ్గరికి వెళుతుంది. ఏంటి సార్ మళ్ళీ వచ్చిందేంటా అనుకుంటున్నారా అంటుంది.  నేనేమనుకోవాలో అది కూడా నువ్వే డిసైడ్ చేస్తావా అనడంతో ప్రస్తుతానికి అంతే సార్ మీకు హెల్త్ బాగోలేదు అని అంటుంది వసుధార. ఇంటికి వెళ్తాను అన్నారు వెళ్ళలేదు అనగా ప్రెస్ మీట్ అయ్యాక వెళ్తాను అని అంటాడు రిషి. ఇంటికి వెళ్ళండి అంటుంది. నా పై నీ పెత్తనం ఏంటని అడుగుతాడు. వెళ్లాల్సిందే అని పట్టుబట్టడంతో..రిషి వెళ్తూ వసుధార కూ థాంక్స్ చెప్పాలి అనుకుని చేయందిస్తూ...మెడలో తాళి చూసి చేతిని వెనక్కి తీసుకుంటాడు. వసుధారను వెళ్లిపొమ్మని చెబుతాడు
రిషి:వసుధార నువ్వు మెడలో తాళి వేసుకున్న విషయం నాకు నచ్చలేదు నువ్వు తప్పు చేశావు ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను
జగతి మహేంద్ర మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి రావడంతో ఎక్కడికి వెళ్తున్నావు రిషి అని అడుగుతాడు మహేంద్ర. వెళ్తున్నాను డాడ్ అనడంతో ఈ టైం లో ఇంటికి వెళ్ళడం ఏంటి రిషి అని అడిగితే కొన్ని తప్పవు డాడ్ ఆర్డర్స్ పాటించాలి కదా అని అంటాడు రిషి.
జగతి: మీకు ఎవరు వేశారు ఆర్డర్ 
రిషి: జ్వరం వేసింది అంటూ ఏం మాట్లాడాలో తెలియక తింగరి తింగరిగా మాట్లాడుతూ ఉంటాడు. 
అప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో  రిషికి ఆర్డర్ వేసింది ఎవరో కాదు వసుధార అనుకుంటూ జగతి-మహేంద్ర ఇద్దరూ నవ్వుకుంటారు


Also Read:  ఫిబ్రవరి 28 రాశిఫలాలు, ఈ రాశి ఉద్యోగులు బాగా పనిచేస్తారు కానీ భావోద్వేగాలు నియంత్రించుకోవడంలో ఫెయిల్ అవుతారు
మరొకవైపు కాలేజీ ప్రొఫెసర్లు ఇద్దరూ ఇప్పుడు ఏం చేద్దాం అనడంతో ప్రెస్ మీట్ పెట్టి మనకు జరిగిన అన్యాయం చెబుదాము అప్పుడు రిషి సార్ కాదు కదా వసధార కూడా దిగిరావాల్సిందే అనుకుంటారు. వాళ్లు ప్రెస్ మీట్ అరెంజ్ చేసుకునే పనిలో ఉంటారు..దేవయాని కాలేజీకి బయలుదేరుతుంది


మరోవైపు రిషి కారులో వెళుతూ నేను కూడా ప్రెస్ మీట్ లో ఉంటే బాగుండేది కానీ ఈ పొగరు నన్ను బలవంతంగా పంపించింది అనుకుంటూ ఉంటాడు రిషి. జగతి,మహేంద్ర వసుధార వాళ్ళు ప్రెస్ మీట్ కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఫణీంద్ర జగతి... రిషి లేకపోతే బాగుండదు రిషి కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అనడంతో సరే బావగారు అని జగతి ఫోన్ చేస్తూ ఉండగా ఫోన్ లిఫ్ట్ చేయడు.


అప్పుడు పక్కనే కాలేజీ ఫ్యాకల్టీ ప్రెస్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో రిపోర్టర్స్ అక్కడికి రావడంతో సర్ మేమే సార్ మీకు కాల్ చేసింది మా జాబులు పోయాయి. మా జాబ్స్ పోగొట్టి వాళ్ళు మాత్రం ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసుకుంటున్నారు మాకు అన్యాయం జరిగిపోయింది సార్ అంటుండగా ఒక్క నిమిషం ఆగండి మేడం మీ మీద మాకు ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చాయి. మీరు చేసిన పనుల్లో తాలూకా లిస్ట్ అంతా ఇదే అనడంతో వాళ్ళు షాక్ అవుతారు...  జగతి వసుధార ఆశ్చర్యపోతారు. తప్పంతా మీ వైపు పెట్టుకొని రిషి సార్ ని, వసుధారని నిందిస్తారా మీ విషయంలో మేము హెల్ప్ చేయలేము మాకు మాత్రమే కాదు రిపోర్టర్స్ అందరికీ రిషి సార్ పంపించారు అనడంతో కాలేజీ ఫ్యాకల్టీ షాక్ అవుతారు. అప్పుడు ఆ రిపోర్టర్ వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.