విన్నీ ఖుషిని హాస్పిటల్ కి తీసుకుని వస్తాడు. తను వేదని ఒప్పించి తనతో సూప్ తాగిస్తుంది. విన్నీ ఖుషిని తీసుకొచ్చాడని యష్ రగిలిపోతూ ఉంటాడు. నీ పనులు నువ్వు చూసుకోలేవా, ఇంకొకరి విషయాల్లో ఎందుకు కల్పించుకుంటున్నావ్. నా కూతుర్ని హాస్పిటల్ కి తీసుకురావడానికి నువ్వు ఎవరు. తనని తీసుకొచ్చి వేద దగ్గర మార్కులు కొట్టేద్దామని అనుకుంటున్నావా. ఖుషి ఎంత దాని వయస్సు ఎంత హాస్పిటల్ బెడ్ మీద అమ్మని చూస్తే ఏంటి దాని పరిస్థితి. దానికి ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబులిటీ అని యష్ సీరియస్ అవుతాడు. ‘నా భార్య విషయంలో పరాయి వాడివి నీ పెత్తనం ఏంటి? నువ్వు తనకి బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు కానీ నాకు అనవసరం. వేద వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు ఎక్కడున్నావ్, తనకి ఖుషికి అమ్మ స్థానం ఇచ్చింది నేను. వేద పెళ్లి చెడిపోయినప్పుడు రానివాడివి ఇంకొకరి భార్య అయిన తర్వాత వస్తావా? నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు’ అని అరుస్తాడు.


Also Read: రాజ్ కంట పడకుండా తప్పించుకున్న కావ్య- చెల్లెళ్ళని దగ్గరకి తీసుకుని ఎమోషనల్ అయిన స్వప్న


‘నువ్వు ఇలా అరిచినంత మాత్రాన పెద్ద మొగాడివి అయిపోతావా? నీ భార్యగా వేద తన స్థానానికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేస్తుంది. మరి నువ్వు తనకి ఏం చేశావ్. తనని అనారోగ్యం పాలు చేసి ఐసీయులో పడేశావ్. ఒక భార్య భర్త దగ్గర నుంచి ఏం ఆశిస్తుందో నీకు తెలుసా? రియల్ హజ్బెండ్ అంటే ఒక ఇంట్లో కలిసి ఉండటం కాదు. బంధం ఆ బంధం ఒక్కరోజుతో ఏర్పడేది కాదు. ఒక భార్య భర్త దగ్గర నుంచి భరోసా, హోదా కోరుకుంటుంది. కానీ నువ్వు వేదకి ఇవ్వలేకపోయావ్, నువ్వు స్వార్థపరుడువి. వేద గురించి ఎప్పుడైనా ఆలోచించావా? భర్తవి అయ్యావ్ కానీ మంచి భర్తవి కాలేకపోయావ్. వేదకి నేను బెస్ట్ ఫ్రెండ్. తనకి నేను ఎప్పుడైనా అండగా ఉంటాను’ అని యష్ కి గట్టిగా ఇచ్చిపడేస్తాడు.


Also Read: వసు గురించి తప్పుగా మాట్లాడిన లెక్చరర్స్- ఊహించని నిర్ణయం తీసుకున్న రిషి


ఇంట్లో వాళ్ళందరూ వేదని చూడటానికి వస్తారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వసంత్, చిత్ర యష్ గురించి చెప్తారు. అందరికోసం అన్నీ చేస్తావ్ అని వసంత్ అంటాడు. కుటుంబం పూర్తి అవ్వాలంటే మీ పెళ్లి కావాలని వేద అంటుంది. యష్ విన్నీ మాటలు గుర్తు చేసుకుని నిజంగానే నేను మంచి భర్తని కాదా? ఇది వాడి ఒక్కడి అభిప్రాయమేనా అందరిదీనా? అని అనుకుంటాడు. ఖుషి వచ్చి అమ్మ పిలుస్తుందని చెప్తుంది. వేద దగ్గరకి వచ్చి కరుస్తూ ఉంటాడు వెంటనే విన్నీ మాటలు గుర్తుకు వచ్చి సైలెంట్ అయిపోయి మొహాన నవ్వు తెచ్చుకుంటాడు. నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను వేద అని మనసులో అనుకుంటాడు. స్టార్ట్ చేయండి నా మీద కేకలు వేయడం అని వేద అనేసరికి లేదు నేను సైలెంట్ గా ఉంటానని చెప్పేసరికి అలా అయితే మీరు బ్యాడ్ హజ్బెండ్ అని అంటుంది. అదేంటి కేకలు వేస్తే బ్యాడ్ హజ్బెండ్ అన్నాడు కదా విన్నీ మరి వేద ఇలా అంటుందెంటి అని మళ్ళీ ఆలోచనలో పడతాడు. మీరు మీలా ఉండండి మారిపోతే బోర్ కొట్టేస్తారని వేద అనేసరికి అంటే నన్ను గుడ్ హజ్బెండ్ అవనివ్వవా అని అంటాడు.