పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ అపర్ణ వాళ్ళు చూసి తలపాగా ఎక్కడ అని అంటారు. అప్పుడే కళ్యాణ్ కి కావ్య ఫోన్ చేస్తుంది. తలపాగా మర్చిపోయారని చెప్తుంది. ఎవరితోనైనా పంపిస్తారా అని కావ్యని అడుగుతాడు. నేనే వచ్చి పికప్ చేసుకుంటానని కళ్యాణ్ అంటుండగా రాజ్ ఫోన్ లాక్కుని తప్పు మీరే చేశారు కాబట్టి మీరే తీసుకొచ్చి ఇవ్వండి అని కోపంగా చెప్తాడు. ఇక చేసేదేమి లేక కావ్య దాన్ని తీసుకుని వెళ్తుంది. రాహుల్ మీడియాని పిలిచి ఏం చేయాలో చెప్తాడు. బ్రేకింగ్ న్యూస్ ఇస్తానని అంటాడు. అప్పుడే స్వప్న రాహుల్ కి కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. నిన్ను దూరం పెట్టేది దగ్గర కావడానికే అని మనసులో అనుకుంటాడు. కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చి ప్రేమ కురిపించాడు మరి ఇప్పుడు ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని స్వప్న అనుకుంటుంది.


Also Read: వసు గురించి తప్పుగా మాట్లాడిన లెక్చరర్స్- ఊహించని నిర్ణయం తీసుకున్న రిషి


కనకం పెళ్లి కొడుకు ఇంటి నుంచి ఇంకా పసుపు రాలేదేంటి అని టెన్షన్ పడుతూ ఉంటే రాహుల్ గురించి చెప్పడానికి వస్తుంది. రాజ్ వాళ్ళ ఇంట్లో రాహుల్ ఉంటాడు, హైట్ గా అందంగా ఉంటాడు, ఫారిన్ లో కూడా ఇల్లు ఉంది. రాజ్ లా బోరింగ్ పర్సన్ కాదు అయితే నీకు ఏం అభ్యంతరం లేదా అని స్వప్న చెప్తుంది. కావ్యకి ఆ రాహుల్ కరెక్ట్ గా సెట్ అవుతాడు సూపర్ అని కనకం అంటుంది. ఆ మాటకి స్వప్న తల్లి గొంతు పట్టుకుని పిసికేసినట్టు ఊహించుకుంటుంది. కాసేపటికి తేరుకుని అదంతా కల అని స్వప్న అనుకుంటుంది. పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర నుంచి పసుపు వచ్చిందని మీనాక్షీ వచ్చి చెప్తుంది. అటు రాజ్ కి మంగలస్నానాలు ఏర్పాటు చేస్తూ ఉండగా కావ్య తలపాగా తీసుకుని వస్తుంది. రాజ్ కి కనిపించకుండా వెళ్లాలని అనుకుంటుంది కానీ ఎదురుగానే ఉండటం చూసి షాక్ అవుతుంది. కావ్య వాచ్ మెన్ తో తలపాగా ఇచ్చి పంపిస్తుంది. అది నువ్వు ఎందుకు తీసుకొచ్చావ్ ఎవరు ఇచ్చారు ఎక్కడ ఉంది ఆ అమ్మాయి అని రాజ్ అడుగుతాడు. కళావతి ఏమైనా వచ్చి వెళ్ళిందా ఏంటి అని అనుకుంటాడు.


Also Read: డాక్టరమ్మ ఊహల్లో తేలిపోతున్న విక్రమ్- నందు, లాస్యకి ఎదురుతిరిగిన దివ్య


రాహుల్ స్వప్న ఇంటికి పసుపు తీసుకుని వస్తాడు. కృష్ణమూర్తి వాళ్ళకి స్వాగతం చెప్పి ఆహ్వానిస్తారు. పెళ్లి కొడుకు తరఫున ఇవన్నీ తీసుకొచ్చామని కనకం వాళ్ళకి ఇస్తాడు. స్వప్న రాహుల్ ని చూసి కోపంగా అతని దగ్గరకి వెళ్తుంది. కానీ రాహుల్ మాత్రం స్వప్న వైపు కూడా చూడకపోయేసరికి రాజ్ తో పెళ్లి చేయాలని అనుకుంటున్నాడా ఏంటని అనుకుంటుంది. అప్పుడే స్వప్నని తీసుకెళ్ళి నలుగు పెట్టడానికి కూర్చోబెడతారు. పసుపు కలుపుతూ ఉంటే స్వప్న కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. పసుపు ప్లేట్ కూడా నేలమీద పడిపోతుంది. స్వప్న కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరూ టెన్షన్ పడతారు. రాహుల్ తనని ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. కావ్య మొహానికి కొంగు కప్పుకుని రాజ్ కి కనిపించకుండా తిరుగుతుంది. రాజ్ ని రేఖ వాళ్ళు తలపాగా పెట్టుకోమని చెప్పి ఆట పట్టిస్తారు. వాళ్ళని తరుముకుంటూ వచ్చి కావ్యని ఢీ కొడతాడు. అప్పుడే కావ్య పడిపోకుండా రాజ్ పట్టుకుంటాడు.


కావ్య రాజ్ కి కనిపించకుండా తప్పించుకుని వెళ్ళిపోతుంది. అమ్మలక్కలు అరిష్టం వల్ల ఇలా జరిగిందని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. రాహుల్ తనకి సేవలు చేస్తూ ఉంటాడు. డైటింగ్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని కనకం అంటుంది. మీనాక్షి కాసేపు తిక్కతిక్కగా మాట్లాడుతుంది. స్వప్న కళ్ళు తెరుస్తుంది.