Stocks to watch today, 27 February 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 46 పాయింట్లు లేదా 0.26 శాతం రెడ్‌ కలర్‌లో 17,496 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌: మహిళల ప్రీమియర్ లీగ్ T20 టోర్నమెంట్ మొదటి సీజన్ నుంచి 5 సంవత్సరాల పాటు, కంపెనీ కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్‌తో ప్రకటనలకు సంబంధిన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.


ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్: వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌ విభజన కోసం Edelweiss Financial Services తన వాటాదార్ల ఆమోదం పొందింది. తద్వారా Nuvama వెల్త్ మేనేజ్‌మెంట్ లిస్టింగ్‌కు మార్గం సుగమం అయింది.


పిరమల్ ఎంటర్‌ప్రైజెస్: ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన రూ. 100 కోట్ల వరకు సురక్షిత, రేటెడ్, లిస్టెడ్, రీడీమ్ చేయదగిన, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్‌ల జారీ కోసం యోచిస్తోంది. దీంతో పాటు రూ. 500 కోట్ల వరకు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం ఉంది. దీంతో మొత్తం సైజ్‌ రూ. 600 కోట్ల వరకు ఉంటుంది.


పవర్‌ గ్రిడ్‌: ఈ సంస్థకు చెందిన 'కమిటీ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆన్‌ ప్రాజెక్ట్స్‌', రూ. 800 కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.


ఇండియాబుల్స్ హౌసింగ్: రూ. 100 కోట్ల వరకు సురక్షితమైన, రీడీమ్ చేయదగిన, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల పబ్లిక్ ఇష్యూకి ఈ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. మరో రూ. 800 కోట్ల వరకు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ను నిలుపుకునే అవకాశం ఉంది, మొత్తం సైజ్‌ రూ. 900 కోట్ల వరకు ఉంటుంది.


NBCC ఇండియా: మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (MNNIT) వివిధ భవనాలకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా (PMC) పనిచేయడానికి NBCC ఇండియా రూ. 350 కోట్ల విలువైన ఆర్డర్‌లు అందుకుంది.


Paytm: భారత టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్, తన ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్‌ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో విలీనం చేయడం ద్వారా Paytmలో వాటా కోసం ప్రయత్నిస్తున్నట్లు బ్లూంబెర్గ్ నివేదించింది. మరోవైపు, పేటీఎం షేర్లను అమ్మాలని యాంట్‌ గ్రూప్‌ ఆలోచిస్తోంది.


వొడాఫోన్ ఐడియా: అమెరికన్ టవర్ కార్ప్‌కు (ATC) రూ. 1,600 కోట్ల ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల (OCDలు) ప్రిఫరెన్షియల్ ఇష్యూకు Vodafone Idea షేర్‌హోల్డర్లు శనివారం ఆమోదం తెలిపారు. దీనివల్ల US టవర్ కంపెనీకి వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన చాలా బకాయిలు మాఫీ అవుతాయి.


జైడస్ లైఫ్ సైన్సెస్: Pitavastatin టాబ్లెట్‌లను అమెరికాలో మార్కెట్ చేయడానికి US FDA నుంచి Zydus లైఫ్‌ సైన్సెస్‌ తుది ఆమోదం పొందింది. ప్రైమరీ హైపర్‌లిపిడెమియా లేదా మిక్స్‌డ్ డైస్లిపిడెమియా ఉన్న రోగుల్లో డైట్‌కి అనుబంధ చికిత్సగా దీనిని ఉపయోగిస్తారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.