రిషికి జ్వరం రావడంతో వసు దగ్గరుండి మరీ జాగ్రత్తగా చూసుకుంటుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టలేదని వసు చెప్తుంది. ఆరోగ్యం బాగోలేదని ప్రెస్ మీట్ పక్కన పెట్టడం కరెక్ట్ కాదని రిషి అంటాడు. అప్పుడే దేవయాని వచ్చి రిషికి అసలే బాగోలేదు ఇప్పుడు కాలేజ్ పనులు మాట్లాడటం అవసరమా అని అంటుంది. తనకి రెస్ట్ కావాలి, అన్నీ రిషినే చేస్తే మీరేం చేస్తారని తిడుతుంది. ప్రెస్ మీట్ ఎరేంజ్ చేయమని మినిస్టర్ చెప్పారు చేయాల్సిందేనని రిషి దేవయానికి చెప్తాడు. వసు, రిషి ప్రెస్ మీట్ కి సంబంధించి మాట్లాడుకోవాలి కదా వెళ్లిపోదాం పద అని జగతి తీసుకెళ్లిపోతుంది. దేవయానిని కూడా వెళ్లిపొమ్మని చెప్తాడు.


Also Read: డాక్టరమ్మ ఊహల్లో తేలిపోతున్న విక్రమ్- నందు, లాస్యకి ఎదురుతిరిగిన దివ్య


ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాలో రిషి వసుకి చెప్తాడు. వసు వెళ్లిపోతుంటే వెళ్తావా అని మళ్ళీ తన మెడలో తాళి చూసి సైలెంట్ అయిపోతాడు. జరిగిన వాస్తవం మీకు తెలుసు ఈ బంధాలకి బంధనాలు పడితే వాటిని మీరే తొలగించాలి. జరిగిన దాన్ని మీరు వివరించి బహిర్గతం చేస్తేనే గౌరవంగా ఉంటుందని వసు అంటుంది. రిషికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతుంది. నిఈ తొందరపాటు మన బంధానికి అడ్డుగోడ కట్టింది. మన బంధానికి మచ్చ పడిందో లేదంటే మబ్బు పడిందో కానీ అలా జరిగి ఉండాల్సింది కాదు. జరిగిన దాన్ని తేలికగా తీసి పారేయలేను అలాగని నిన్ను క్షమించలేను. నిన్ను బాధపెడుతున్నానా, నేను బాధపడుతున్నానా నాకే తెలియడం లేదని రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు. వసు కాలేజ్ కి వస్తూ రిషి గురించి ఆలోచిస్తూ ఉండగా అక్కడ కారు కనిపిస్తుంది. రిషి క్యాబిన్ లో కూర్చుని పని చేయడం చూసి కాలేజ్ కి ఎందుకు వచ్చారని సీరియస్ అవుతుంది.


జ్వరం వచ్చింది ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చారని అరుస్తుంది. అంత గట్టిగా ధీమాగా మాట్లాడుతుందని అనుకుంటాడు. ఆఫీసు బాయ్ తో ట్యాబ్లెట్స్ తెప్పించి వసు వేసుకోమని చెప్తుంది. అదంతా కాలేజ్ స్టాఫ్ దొంగచాటుగా చూస్తారు. అయిపోయిందా ఇంకేమన్నా ఉందా నిఈ దబాయింపు అని రిషి వెళ్ళిపోతాడు. కాలేజ్ స్టాఫ్ వసు గురించి చెడుగా మాట్లాడతారు. వసుధారకి కొమ్ములు రావడానికి రిషి సర్ కారణం అని అంటారు. వసుకి పెళ్ళయి అయ్యిందని తెలుసు కదా వదిలేయకుండా ఎందుకు ఇలా చేయడం అని లెక్చరర్స్ మాట్లాడుకోవడం రిషి విని క్యాబిన్ కి రమ్మని పిలుస్తాడు. జగతిని కూడా రమ్మని బాయ్ కి చెప్పి పంపిస్తాడు. జగతి వసుకి థాంక్స్ చెప్పి రిషిని కలవడానికి వెళ్తుంది.


Also Read: 'ఐలవ్యూ శ్రీవారు' మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లనన్న వేద- విన్నీ మీద ఫైర్ అయిన యష్


రిషి: ఇవన్నీ ఇప్పటి దాకా వీళ్ళు చేసిన తప్పుల లిస్ట్. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, వీళ్ళ మాటలు స్వయంగా విన్నాను. వీళ్ళకి అవసరం లేని వాటి గురించి డిస్కస్ చేస్తున్నారు. పర్సనల్ మెటర్స్ లోకి వెళ్లారు. వసుధారతో కలిపి నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మేము తీసుకునే నిర్ణయాలు మేం తీసుకుంటాం. వసుధార గురించి మీరు ఇంతకముందు మాట్లాడినప్పుడు సర్ది చెప్పాను పెద్దమ్మ దగ్గరకి తీసుకెళ్ళి చెప్పించాను. అయినా మీరు ఎప్పటిలాగా మాట్లాడారు, మీరు మారరని అర్థం అయ్యింది. అందరి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని వార్నింగ్ ఇస్తాడు. ఇంకేమీ సలహాలు ఇవ్వను డిస్మిస్ చేస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు.