వేద కళ్ళు తెరిచి భర్త యష్ కోసం వెతుకుతూ ఉంటుంది. జరిగింది అంతా తలుచుకుని ఏవండీ ఏవండీ అని కలవరిస్తుంది. యష్ బాధపడుతుంటే చిత్ర వాళ్ళు వచ్చి ఏదైనా తినడానికి రమ్మని పిలుస్తుంది కానీ వద్దని అంటాడు. ‘నా వల్లే వేదకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని, ఉపవాసం చేయలేవని రెచ్చగొట్టాను. పాపం వేద ఎంత ఆకలిని అణుచుకుందో, తనకి హెల్త్ ప్రాబ్లం ఉందట అది తెలియక తనని పస్తులు పెట్టాను. లోపల పేగులు ఎంత నలిగిపోయాయో అంత కష్టం కూడా ఎందుకు భరించిందో తెలుసా నా కోసం నా కుటుంబం కోసం కానీ నేను అసలు తనని పట్టించుకున్నానా’ అని యష్ ఎమోషనల్ అవుతాడు. వదినకి ఏం కాదని వసంత్ తనకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. వేద లేకుండా యశోధర్ లేడు జీరో అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
Also Read: దివ్యని చూసి ప్రేమలో పడిపోయిన విక్రమ్- పెళ్లి సంబంధం ఖాయం చేసిన లాస్య
వేద భర్త కోసం చూస్తూ ఉంటే డాక్టర్ వచ్చి పలకరిస్తుంది. నర్స్ వచ్చి విన్నీకి వేద స్పృహలోకి వచ్చిందని తన హజ్బెండ్ ని కలవరిస్తుందని చెప్తుంది. విన్నీ వెళ్ళి యష్ కి చెప్పడంతో పరుగున తన దగ్గరకి వస్తాడు. వేద స్పృహలోకి రావడం చూసి యష్ ఊపిరి పీల్చుకుంటాడు. అసలు తనకి ఏమైందని ఎందుకు హాస్పిటల్ లో జాయిన్ చేశారని వేద అడుగుతుంది. అసలు నువ్వు డాక్టర్ వేనా అంత హెల్త్ ప్రాబ్లం ఉంటే ఎందుకు ఇలా చేశావ్ అని తన మీద అరుస్తాడు. చచ్చిపోయేదానా అని వేద అనేసరికి యష్ తన నోటికి చేయి అడ్డం పెట్టేస్తాడు. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి పోను, భగవంతుడు బలవంతంగా తీసుకెళ్లినా దెయ్యంలా వెనక్కి వచ్చి పీడిస్తాను అని వేద అనేసరికి యష్ నవ్వుతాడు. మీరు కన్నీరు కారుస్తుంటే మీ మొహానికి సూట్ అవలేదు, మీరు కొప్పడితేనే నాకు నచ్చుతుందని వేద అంటుంది.
Also Read: 'బ్రహ్మ' ఆట మొదలైంది- స్వప్న పెళ్లి కాంట్రాక్ట్ కావ్యకి, మరో అమ్మాయితో రాహుల్
డాక్టర్ వచ్చి యష్ ని తిడుతుంది. మీ భార్య మీ బాధ్యత అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఫాస్టింగ్ ఇంకోసారి చేయకు అని యష్ అంటాడు. పైకి చెప్పరు కానీ చాలా ప్రేమ ఉంది.. ఏవండీ ఐ లవ్యూ అని వేద మురిసిపోతుంది. అభిమన్యు ఆఫీసులో అమ్మాయితో క్లోజ్ గా ఉండటం చిత్ర చూస్తుంది. యష్ వేద కోసం సూప్ తీసుకొచ్చి ఇస్తాడు. తను మాత్రం ఉపవాసం కాసేపటిలో అయిపోతుందని వద్దని అంటుంది. యష్ కోపంగా అరుస్తూ ఉంటే విన్నీ వచ్చి పలకరిస్తాడు. వేద నేను చెప్తే తాగుతుంది అని ఇద్దరూ కాసేపు బాక్స్ తీసుకుంటూ బతిమలాడతారు. మీరు ఎవరు చెప్పినా నేను తాగను అని వేద అంటుంది. నువ్వు ఎవరు చెప్తే తాగుతావో నాకు తెలుసు అందుకే వాళ్ళని తీసుకొచ్చాను అనగానే ఖుషి వస్తుంది. పరుగున వచ్చి ఖుషి తల్లిని కౌగలించుకుంటుంది. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను మమ్మీ అని ఖుషి అంటుంది. ఉపవాసంలో ఉన్నానని చెప్తుంది కానీ ఖుషి వినదు. కానీ ఖుషి మాత్రం తన తల మీద ఒట్టు పెట్టుకుంటుంది. దీంతో వేద సూప్ తీసుకుంటుంది. ఏ పని చేయడానికి అయినా ఒక పద్ధతి ఉంటుందని అరిస్తే పనులు జరగవని విన్నీ యష్ తో అంటాడు.