Gruhalakshmi February 27th: డాక్టరమ్మ ఊహల్లో తేలిపోతున్న విక్రమ్- నందు, లాస్యకి ఎదురుతిరిగిన దివ్య

దివ్య ఎంట్రీ ఇవ్వడంతో సీరియల్ కొత్త మలుపు తీసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Continues below advertisement

విక్రమ్ ఇంటికి వచ్చి తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని పలకరించకుండా వెళ్ళిపోతాడు. ఈ అమ్మ వల్ల తప్పు ఏదైనా జరిగిందా అని రాజ్యలక్ష్మి ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. అమ్మ ఎప్పుడు తప్పు చేయదు, దేవత కొప్పడే రోజు వస్తే అదే తన ఆఖరి రోజు అవుతుందని విక్రమ్ అంటాడు. సమయానికి అన్నం తినడం లేదని ఆరోగ్యం సరిగా చూసుకోవడం లేదని విక్రమ్ తల్లి మీద అలుగుతాడు. దీంతో సోరి చెప్తుంది. విక్రమ్ తాతయ్య వచ్చి ఇంగ్లీషు టీచర్ వచ్చిందని చెప్తాడు. అమ్మ ఆరోగ్యం బాగోలేదని చదువు ఆటకెక్కించావ్ ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకోమంటే నేర్చుకోవడం లేదని విక్రమ్ తాతయ్య బలవంతంగా తనని ట్యూషన్ కి పంపించేస్తాడు.

Continues below advertisement

Also Read: 'ఐలవ్యూ శ్రీవారు' మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లనన్న వేద- విన్నీ మీద ఫైర్ అయిన యష్

దివ్య సంతోషంగా ఇంటికి వచ్చి తనకి జాబ్ వచ్చిందని చెప్తుంది. లాస్య స్వీట్స్ తినిపించి ఇది ఉద్యోగం వచ్చినందుకు కాదు పెళ్లి సంబంధం కుదరబోతున్నందుకు అని చెప్తుంది. అది విని తులసి మినహా అందరూ షాక్ అవుతారు. నన్ను అడగకుండా చెప్పకుండా సంబంధం ఫిక్స్ చేయడం ఏంటని దివ్య సీరియస్ గా అడుగుతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇలాంటి  సంబంధం దొరకదని వాళ్ళకి ఉన్న ఆస్తులు అన్నీ వరుస పెట్టి చెప్తుంది. తులసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. జాబ్ దక్కిన ఆనందం గంట కూడా లేకుండా చేస్తున్నారని బాధపడుతుంది. దివ్య మాటలు విని జూనియర్ తులసిలా తయారైయ్యిందని లాస్య మనసులో అనుకుంటుంది. పెళ్లి చూపులు కూడా తనని అడిగే ఫిక్స్ చేయాలని ఖరాఖండిగా చెప్పేసి వెళ్ళిపోతుంది.

Also Read: దివ్యని చూసి ప్రేమలో పడిపోయిన విక్రమ్- పెళ్లి సంబంధం ఖాయం చేసిన లాస్య

విక్రమ్ కి ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చి తనకి లైన్ వేస్తూ ఉంటుంది. ఆమె దగ్గరకి వచ్చేసరికి విక్రమ్ భయంతో  ఆంజనేయ దండకం మొదలుపెట్టేస్తాడు. చూస్తుంటే మనోడుకి అమ్మాయిలంటే కాసింత భయంలాగా కనిపిస్తుంది. టీచర్ ప్రేమ పాఠాలు నేర్పిస్తాను అంటూ వంకరగా మాట్లాడుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో తెలుసా అని టీచర్ అడిగేసరికి విక్రమ్ దివ్య ఊహాల్లొకి వెళ్ళిపోతాడు. పక్కన దివ్య ఉందని అనుకుని తెగ మురిసిపోతాడు. కాసేపటికి తేరుకుని గదిలో నుంచి పారిపోవాలని అనుకుంటాడు. కానీ దేవుడు గది లాక్ చేసి తియ్యనని అంటాడు. నందు తులసి దగ్గరకి వచ్చి మాట్లాడాలని అంటాడు. దివ్య పెళ్లి విషయం గురించి అయితే ఏమి చేయలేనని తులసి అంటుంది. అలా చేతులెట్టేస్తే ఎలా అని లాస్య టీ పట్టుకుని రావడంతో తులసి ఆశ్చర్యంగా చూస్తుంది. చెప్పే విధంగా చెప్తే తులసి మాట వింటుందని లాస్య బిస్కెట్స్ వేసేందుకు ట్రై చేస్తుంది.

 

Continues below advertisement
Sponsored Links by Taboola