గుప్పెడంతమనసు ఏప్రిల్ 6 ఎపిసోడ్


 పెళ్లి విషయంలో రిషి-వసు ఇద్దరిలో ఎవరు కరెక్టో కాలేజీలో ఓటింగ్ పెడతాడు జయచంద్ర.  అందరూ ఓటింగ్ లో పాల్గొనవచ్చని చెబుతాడు. అయితే రిషి...వసు చేసింది కరెక్టే కదా అనుకుంటే...రిషి సార్ చేసినదాంట్లో తప్పేముందు తనని ఇంత బాధపెట్టింది నా నిర్ణయమే కదా అనుకుంటుంది వసుధార. అంటే రిషి వసుకి ఓటేస్తే...వసు రిషికి ఓటేస్తుంది. జగతి నువ్వు ఎవరికి ఓటేస్తున్నావని మహేంద్ర అడిగితే.. అలా చెప్పకూడదు అంటుంది జగతి. ఇదేం జనరల్ ఎలక్షన్ కాదుకదా అని మహంద్ర సెటైర్ వేస్తే..అంతకన్నా ఎక్కువే అని రిప్లై ఇస్తుంది జగతి.  ఓట్లు లెక్కేసిన జయచంద్ర..ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడం చూసి అంతా డిస్కస్ చేసుకుంటారు. ఇంతలో జయచంద్ర... మరో రెండు ఓట్లు నా దగ్గరున్నాయి అంటాడు జయచంద్ర. నా చేతిలో ఉన్న రెండు ఓట్లు ఒకటి వసుధారది ఒకటి రిషిది ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూద్దాం అంటాడు. 


Also Read: రిషిధార పెళ్లి ఓటింగ్ లో గెలుపెవరిది, గుప్పెడంతమనసులో చెప్పలేనంత అలజడి!


రిషి ఇచ్చిన పేపర్ ఓపెన్ చూసి చూపించి...వసుధార పేరు ఉండడంతో అంతా ఆశ్చర్యపోతారు..వసు సంతోష పడుతుంది
వసుధార పేపర్ ఓపెన్ చేస్తున్నా అని జయచంద్ర అనడంతో..అంతా టెన్షన్ గా ఎదురచూస్తుంటారు... వసు..రిషికి ఓటేసింది అనడంతో ఆశ్చ్యపోతాడు.వీరిద్దరిని సమర్ధించేవారు సమానంగా ఉండడం ఒకెత్తు అయితే, వీరిద్దరూ ఒకరికి ఒకరు ఓటు వేసుకోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం అంటాడు జయచంద్ర. ఇందాక వాళ్ళిద్దరూ ఒకరు నేను కరెక్ట్ అంటే ఒకరు నేను కరెక్ట్ అనుకుంటూ వాదించారు కానీ ఇప్పుడు మాత్రం ఒకరివాదన ఒకరికి నచ్చక మరొకరి వాదన నచ్చింది..అందుకే ఒకరికొకరు ఓటేసుకున్నారని చెబుతాడు. అందుకు కారణం ఒకరంటే మరొకరికి గౌరవం ఉందని చెబుతాడు. ఇద్దరూ సమానమే అని తెలుస్తోంది...ఏ పరిస్థితిని అయినా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి  ఆ మాటలు విని జగతి, మహేంద్ర సంతోషిస్తారు. వాళ్ల మధ్య ఉన్న ప్రేమే వాళ్లతో ఇలా చేయించింది...వాళ్ల ప్రేమే వాళ్లిద్దరూ సమానం అని చెప్పింది అంటాడు మహేంద్ర. అన్ని కోణాల్లో ఆలోచించి చెబుతున్నాను వీరిద్దరూ సమానమే అని జయచంద్ర చెప్పి స్పీచ్ ముగించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్లిపోవడంతో... 


Also Read: ఏప్రిల్ 6 రాశిఫలాలు, ఈ రాశివారిని చూసి అందరూ అసూయపడతారు


వసు-రిషి మాత్రమే మిగులుతారు..జయచంద్ర అన్నమాటలు గుర్తుచేసుకుంటారు...అంతులేని ఆనందంతో ఇద్దరూ కన్నీళ్లతో హగ్ చేసుకుంటారు. 
జయచంద్ర, మహేంద్ర,  జగతి అక్కడికి వచ్చి చప్పట్లు కొడతారు. 
జయచంద్ర: చూశారా మీ ఇద్దరి మధ్య ఎంత మంచి అవగాహన ఉందో, మీరిద్దరూ ఒకరు లేకపోతే ఒకరు బ్రతకలేరు.  మీ స్వభావాలే మీ దూరానికి కారణం. మీ ప్రేమకు పునాది కూడా ఆ స్వభావాలే . ఓటింగ్ లో ఇద్దరు మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అయోమయ పడుతున్నారు. రిషి,వసు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మీరిద్దరూ కలిసి ఉండాలని గట్టిగా అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం వచ్చినా కూడా మిమ్మల్ని ఇబ్బంది విడదీయలేదు
వసు: సార్  మాది వివాహ బంధం అనుకుంటే ఈ తాళి నా మెడలో ఉంటుంది సార్
మహేంద్ర: రిషి నీ అభిప్రాయం ఏంటి
జయచంద్ర: మహేంద్ర గారు రిషికి ఆలోచించుకునే సమయం ఇవ్వండి 
మహేంద్ర: సరే రిషి రేపు పొద్దున వరకు మీకు టైం ఇస్తున్నాను 
ఆ తర్వాత జయచంద్ర బయలుదేరుతుండడంతో అందరూ సంతోషంగా జయచంద్రకి బై చెబుతారు. మీ జంట ఎప్పటికీ ఇలాగే ఉండాలని దీవించి వెళ్లిపోతాడు. 


ఆ తర్వాత రిషి ఒంటరిగా కూర్చుని జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వసుతో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకుంటాడు. చాలు ఇప్పటితో మా ఇద్దరి మధ్య ఉన్న దూరానికి ముగింపు పలకాలి అనుకుంటాడు.