గుప్పెడంతమనసు ఏప్రిల్ 5 ఎపిసోడ్
జయచంద్ర లైబ్రరీలో రాసుకుంటూ ఉండగా జగతి అక్కడికి వెళ్లి ఏదో విషయం చెప్పాలని ఇబ్బంది పడుతూ ఉంటుంది.
జయచంద్ర: ఏ విషయమైనా ఇబ్బంది పడకుండా నిర్మొహమాటంగా చెప్పండమ్మా
జగతి: ఈ కాలేజీ ఎండి రిషి నా కొడుకు అన్న విషయం మీకు తెలుసు కదా సార్. వసు,రిషి ఇద్దరు భార్యాభర్తలు చాలా మంచివాళ్లు. ఎదుటి వ్యక్తులను ఎంతో బాగా అర్థం చేసుకుంటారు కానీ ఎందుకో తెలియదు కానీ వాళ్లు కలవలేక పోతున్నారు సార్ . వాళ్లిద్దరూ పక్కపక్కనే ఉన్న కలిసి ఉండలేకపోతున్నారు సార్ అని బాధను వ్యక్తం చేస్తుంది.మీరు సహాయం చేయాలి..వాళ్లిద్దర్నీ కలపాలి
జయచంద్ర: కచ్చితంగా చేస్తానమ్మ..నేనుచేయాల్సింది నేను చేస్తాను ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు
థ్యాంక్స్ చెప్పేసి జగతి అక్కడినుంచి వెళ్లిపోతుంది
ఆ తర్వాత కాలేజీలో తన లెక్చర్ స్టార్ట్ చేస్తాడు జయచంద్ర...ఈ రోజు ఏ టాపిక్ పై మాట్లాడుకుందాం అని స్టూడెంట్స్ నుంచి అభిప్రాయ సేకరణ చేపడతాడు...ఆస్కార్, రాజకీయాలు..ఇలా చాలా టాపిక్స్ రావడంతో నిత్యం చూసేవి ఎందుకు ...కొత్తగా ఏదైనా మాట్లాడుకుందాం అని మొదలుపెట్టి...వివాహ వ్యవస్థ గురించి చెప్పడం మొదలెడతాడు...
జయచంద్ర: మన సంస్కృతి సంప్రదాయాలకు మూలమైనది వివాహవ్యవస్థ...విదేశాల్లో కూడా మన సంప్రదాయం ప్రకారం వివాహాలు చేసుకుంటున్నారు..బలమైన కారణంతోనే పూర్వీకులు వ్యవస్థను ఏర్పాటు చేశారు.. కానీ.. ఇప్పుడిప్పుడు ఆధునికత ఎక్కువైపోయి జనాలు పెళ్లి విలువ, బంధంవిలువ తెలుసుకోలేక ప్రతి చిన్నదానికి విడాకులు అంటున్నారు... అసలు వివాహం అంటే ఏంటో తెలుసా? తాళి, జీలకర్ర బెల్లం కాదు..రెండు మనసులు కలవడం..వివాహాలు 8 రకాలు అని వివాహ వ్యవస్థ వివరంగా గురించి చెబుతాడు.
Aso Read: వెన్నెల్లో రిషిధార, ఇద్దర్నీ ఒక్కటి చేసేందుకు జయచంద్ర సహాయం అడిగిన జగతి!
రిషి: ఇదంతా విన్న రిషి...సార్ చెప్పిన ఏ పద్ధతిలో మన పెళ్లి జరిగింది...నువ్వునేను చేసుకున్న వివాహం ఏ రకం చెప్పు వసుధారా
రిషి మాటలు విన్న వసుధార లేచి నిల్చుని...ఈ 8 రకాల వివాహమే కాకుండా ఇంకోరకం వివాహం కూడా ఉందిసార్ అది కూడా చేర్చాలి అంటుంది...అదే ఆపత్కాల వివాహం...ఇది తొమ్మిదోరకమైన వివాహం..దీన్ని కూడా పరగణలోకి తీసుకోవాలి తీసుకుని తీరాలి.
జయచంద్ర: సరే..అమ్మా వసుధారా నువ్వు ఏం చెప్పదలుచుకున్నా స్టేజ్ పైకి వచ్చి చెప్పమ్మా
వసుధార: తప్పని పరిస్థితుల్లో తన ప్రేమను, తన వాళ్లను కాపాడుకునేందుకు ఓ ఆడపిల్ల తనకు తానుగా తాళి వేసుకుంటే అది ఆపత్కాల వివాహం అంటారు. ఓ దుర్మార్గుడి బారినుంచి తనను తాను రక్షించుకునేందుకు తను ప్రేమించిన మనిషిని భర్తగా ఊహించుకుని తనకు తానుగా తాళి వేసుకుంటే వివాహం అవుతుంది కదా...సాధరణంగా ఓ వ్యక్తిని చంపడం నేరంగా వస్తుంది తనని తాను రక్షించుకునే క్రమంలో ఎదుటివ్యక్తిని గాయపరచడం నేరంకాదు..ఓ అమ్మాయి తన ప్రేమను రక్షించుకోవడం కోసం మెడలో తాళి వేసుకోవడం వివాహమే కదా...
రిషి: వసు మాటలు విని లేచి నిల్చున్న రిషి..నాకు ఓ సందేహం ఉందంటూ స్జేజ్ పైకి వెళతాడు... ఇందాక మీరు చెప్పిన 8 రకాల వివాహాల్లో స్త్రీ, పురుషులు ఇద్దరూ లేకుండా వివాహం ఏదైనా ఉందా సార్..
వసు: అందుకే నేను ఇది తొమ్మిదోరకమైన వివాహం అన్నాను
రిషి: స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉంటేనే వివాహం అవుతుంది.. ఓ పురుషుడిని ఊహించుకుని మెడలో తాళి వేసుకుంటే అది ఊహే అవుతుంది కానీ పెళ్లికాదు...ఒకవేళ అది వివాహంఅనుకున్నా దాన్ని అంగీకరించేందుకు ఎవ్వరూ ముందుకురారు... పెళ్లంటే ఓ పద్ధతి ప్రకారం సంప్రదాయం ప్రకారం జరిగేది..వసుధార చెప్పినట్టు ఏదైనా వివాహం జరిగితే దాన్ని సంప్రదాయం ఒప్పుకుంటుందా.. పెళ్లంటే రెండు మనసులు కలవడం ...ఇక్కడ రెండోవాళ్లే లేనప్పుడు అది పెళ్లి ఎలా అవుతుంది...
జయచంద్ర: మీ ఇద్దరు ఇచ్చిన విశ్లేషణ కరెక్టే... భర్త అనే వ్యక్తిపట్ల ఆమెకు ఉన్న అంకితభావం చెబుతోంది... ఇలా మాట్లాడాలి అంటే ఎంతో మనోబలం ఉండాలి.. ఇక రిషి గురించి చెప్పుకుంటే..పెడదారినపడుతున్న యువతను చూసి భయపడుతున్న తల్లిదండ్రులకు ఈయనోపెద్ద ఊరట.. మన విలువను మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇంత గొప్పగా చదువుకుని సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాడంటే రిషి నిజంగా ఆదర్శప్రాయుడు..ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.. ఇద్దర్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు నేను చెప్పాలా...మీరు చెప్పాలా..మీ అందరి ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియాలి.. ఇప్పుడు మీ అందరకీ ఓటింగ్ పెడుతున్నాను...
రిషిధార పెళ్లికి సంబంధించి ఓటింగ్ లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తర్వాత ఎపిసోడ్ లో తెలుస్తుంది....
Also Read: ఏప్రిల్ 5 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఆదాయం - ఆ రాశువారికి అద్భుత అవకాశం