గుప్పెడంతమనసు ఏప్రిల్ 4 ఎపిసోడ్


జయచంద్ర ఏమైనా అనుకుంటారని ఆలోచించిన రిషి..ఎలాంటి డౌట్ రాకుండా ఉండాలంటే ఆయన ఉన్న రెండు రోజులూ జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తాడు. వసు రూమ్ కి వెళతాడు. ఏంటిసార్ వచ్చారని వసుధార అడిగితే...ఏం రాకూడదా కారణాలు చెప్తే కానీ లోపలికి రానివ్వవా అని అంటాడు. మళ్లీ థాంక్స్ చెప్పడానికి వచ్చారా సార్ అనగా రెండోసారి థాంక్స్ చెప్పించుకునే అలవాటు నీకేమైనా ఉందా అని అడుగుతాడు. ఆ తర్వాత కాసేపు వసుకి దగ్గరగా వచ్చి వెనుకే ఉన్న దిండు,దుప్పటి తీసుకుని టెర్రస్ పై పడుకుంటానని చెబుతాడు. ఇంతలో ధరణి అక్కడికి వచ్చి ఇక్కడే పడుకుంటావ రిషి నేను కావాలంటే బయట పడుకుంటాను అనడంతో వద్దులే వదిన నా రూమ్ లో ఏసీ పనిచేయడం లేదు నేను పైకి వెళ్లి టెర్రస్ పై పడుకుంటాను చల్లగాలి కావాలని చెబుతాడు. రిషిని చూసిన జగతి..ఇప్పుడు అర్థమైందా..జయచంద్రకి అనుమానం రాకుండా ఉండేందుకే రిషి అలా చేస్తున్నాడని క్లారిటీ ఇస్తుంది. 


Also Read: వసు బాధని గమనించిన జయచంద్ర- ఒకే గదిలో రిషిధార, దేవయానికి పెద్ద షాక్


ఆ తర్వాత టెర్రస్ పై పడుకున్న రిషి..చందమామని చూస్తూ..జయచంద్ర వసుధారని పొగిడిన విషయం తలుచుకుంటూ ఊహల్లో ఉంటాడు. ఇంతలో అక్కడకు వస్తుంది వసుధార. 
రిషి: ఏంటి వసుధార ఇక్కడికి వచ్చావు . ఇంతవరకు చందమామలో కనిపించావు అప్పుడే ఇక్కడికి వచ్చావు 
వసు: నిజంగానే కనిపించానా సార్ 
రిషి: చందమామలో అలా చూస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు 
వసు:మన మధ్య ఉన్న దూరం గురించి జయచంద్ర గారికి తెలియకూడదని ఇలా చేస్తున్నారు కదా సార్ 
రిషి: నా దృష్టి అంతా ఎప్పుడూ కూడా సమస్య మీదే ఉంటుంది ఒకరిని భ్రమ పెట్టడం నా ఉద్దేశం కాదు ...అవును నువ్వు నిద్ర పోలేదా 
వసు: మీరు నిద్రపోయారో లేదో చూద్దామని వచ్చాను సార్ ... కొత్త రూం కదా సార్ తొందరగా నిద్ర పట్టడం లేదు 
రిషి: కళ్ళు మూసుకుని పడుకో అదే నిద్ర పడుతుంది
వసు: మీరు చందమామ వైపు అలాగే చూస్తూ ఉండండి సార్ 
రిషి: మార్నింగ్ తొందరగా వచ్చి నిద్ర లేపు 
ఆ తర్వాత జయచంద్ర ఉదయాన్నే ధ్యానం చేస్తుండగా ఇంతలో వసుధార అక్కడికి టీ తీసుకొని వస్తుంది. అప్పుడు జయచంద్ర నీలో ఏదో అలజడి కనిపిస్తోంది అలజడి వల్ల ప్రశాంతత ఉండదు మనశ్శాంతి తెచ్చుకోమ్మ అని అంటాడు. ఇంతలో రిషి అక్కడికి రావడంతో ఇద్దరితో మాట్లాడతాడు
జయచంద్ర:  అభిరుచులు వేరై ఉండవచ్చు మనసులు వేరై ఉండవచ్చు కానీ అభిప్రాయాలు మాత్రం ఒకటే అంటాడు జయచంద్ర. ఒకరికోసం ఒకరు బతకాలి. స్వభావాలు జీవితాలను శాసించకూడదు. 
కాసేపట్లో కాలేజీకి బయలుదేరుతున్నాం అని చెప్పేసి రిషి, వసు వెళ్లిపోతారు


Also Read: ఏప్రిల్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు తక్కువ మాట్లాడాలి - బాగా మాట్లాడాలి - పని విధానం మార్చుకోవాలి


దేవయాని: ధరణీ...అతను ఏం చేస్తున్నారు.. అతిథికి ఎవరు మర్యాదలు చేస్తున్నారు 
ధరణి: వసుధార చేస్తోంది. ఓహో నన్ను ఇందుకోసం పిలిచారా అత్తయ్యా  అనుకుంటూ... జయచంద్ర గారికి ఎవరు మంచివాళ్లు, ఎవరు చెడ్డవారో తెలిసిపోతుందట..శివుడి మూడోకన్నులా అంటూ దేవయానిని కాసేపు ఆటపట్టిస్తుంది. 
ఇంతలోనే అక్కడికి జయచంద్ర వస్తారు..అప్పుడే వచ్చిన రిషి..ఏంటి పెద్దమ్మా టెన్షన్ గా ఉన్నారని అనడంతో ఏం లేదు నాన్న అని ప్రేమ ఒలకబోస్తుంది. అందరు కలిసి కాలేజీకి బయలుదేరుతారు.
వసుధార, రిషి ఇద్దరు కార్లో ముందుకూర్చుంటే..జయచంద్ర వెనుక కూర్చుంటారు. ఇద్దరూ కాలేజీవిషయాలు మాట్లాడుకుంటారు. మధ్యలో పదే పదే సార్ సార్ అంటుంది...
జయచంద్ర: పెళ్లికి ముందునుంచీ మీ ఆయన్ని సార్ అని పిలవడం అలవాటు అంటున్నావు..కానీ పెళ్లి తర్వాత కూడా అలా పిలవడం బావోదేమో... తెలుగింటి ఆడపిల్లలు ఎవరూ కూడా భర్తని సార్ అని పిలవరు కదా.
రిషి: అది గౌరవం కదా సార్
జయచంద్ర: భార్య భర్త మధ్య ఉండాల్సింది ప్రేమ కదా..గౌరవం కూడా ఉండాలి కానీ.. ప్రేమ అనేది మీ మధ్య బంధాన్ని గట్టిపరుస్తుంది. బయటి వారిముందు గౌరవించుకోవడం తప్పులేదు..కానీ మీ ఇద్దరూ పర్సనల్ గా ఉన్నప్పుడు గౌరవం కన్నా ప్రేమ ఉండాలి.. గౌరవం మనసులో ఉంటే చాలు. అమ్మా వసుధారా..ఆ అలవాటు మార్చుకునే ప్రయత్నం చేయమ్మా
రిషి: తప్పకుండా చేస్తుంది సార్..నెక్ట్స్ టైమ్ మనం కలిసేసరికి పిలుపు మారుతుందని మాటిస్తాడు రిషి
వసు: నిజంగానా అని వసుధార మనసులో అనుకుని థ్యాంక్యూ ఎండీగారు అనుకుంటుంది...
ఆ తర్వాత జయచంద్ర లైబ్రరీలో రాసుకుంటూ ఉండగా జగతి అక్కడికి వచ్చి ఏదో విషయం చెప్పాలని ఇబ్బంది పడుతూ ఉంటుంది.
జయచంద్ర: ఏ విషయమైనా ఇబ్బంది పడకుండా నిర్మొహమాటంగా చెప్పండమ్మా 
జగతి: ఈ కాలేజీ ఎండి రిషి నా కొడుకు అన్న విషయం మీకు తెలుసు కదా సార్. వసు,రిషి ఇద్దరు భార్యాభర్తలు చాలా మంచివాళ్లు. ఎదుటి వ్యక్తులను ఎంతో బాగా అర్థం చేసుకుంటారు కానీ ఎందుకో తెలియదు కానీ వాళ్లు కలవలేక పోతున్నారు సార్ . వాళ్లిద్దరూ పక్కపక్కనే ఉన్న కలిసి ఉండలేకపోతున్నారు సార్ అని బాధను వ్యక్తం చేస్తుంది