గదిలో వసు చున్నీ జయచంద్ర చూస్తాడు. ఈ గదిలో ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారా అని రిషిని అడిగేస్తాడు. వెంటనే రిషి వసుని చున్నీ తీసుకోమని చెప్తాడు. ఇది గెస్ట్ రూమ్ మీరు ఫ్రీగా ఉండవచ్చని అంటాడు. అందరితో కలిసి కూర్చుని జయచంద్ర భోజనం చేస్తూ ఉంటాడు. ఎటువంటి వాతావరణానికైనా ఇమడగలుగుతాను, ఒక్కోసారి కుగ్రామంలో కూడా ఉన్నాను. స్టార్ట్ హోటల్స్ కంటే అలాంటి వాటిలో ఉండటమే హాయిగా ఉంటుందని చెప్తాడు. ధరణి, వసు వడ్డిస్తుంటే కూర్చోమని అంటాడు కానీ ధరణి మాత్రం తర్వాత తింటానని చెప్పి వసుని కూర్చోమని చెప్తుంది. నీ భర్త పక్కన కూర్చుని ఇద్దరూ సంతోషంగా భోజనం చేయమని జయచంద్ర అనేసరికి దేవయాని మొహం మాడిపోతుంది. దీంతో వసు వెళ్ళి రిషి పక్కన కూర్చుంటుంది. వాళ్ళని జయచంద్ర ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. ధరణిని నీ భర్త ఇంట్లో లేరా అని అడుగతాడు.


రిషి, వసు సరిగా లేరని జయచంద్ర గమనిస్తాడు. అది చూసిన వసు రిషికి కూర బాగుంది వేసుకోమని చెప్తుంది. వసు రిషిని సర్ అని పిలుస్తున్నావ్ ఏంటని అడుగుతాడు.


వసు: పెళ్లికి ముందు నుంచే నేను ఆయన్ని సర్ అని పిలిచాను


జయచంద్ర: మీరిద్దరూ చాలా రిజర్వ్డ్ గా కనిపిస్తున్నారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా? లేదంటే పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో చేసుకున్నారా?


దేవయాని చెప్పబోతుంటే మన విషయాలు ఇంటి విషయాలు ఆయనకి చెప్పడం కరెక్ట్ కాదేమోనని మెల్లగా చెప్తాడు. తర్వాత జయచంద్ర గదికి వసు మంచి నీళ్ళు తీసుకుని వస్తుంది.


Also Read: గుండెల్ని పిండేసిన ఎమోషన్- ఒక్క నిమిషంలో జీవితాలు తారుమారు, వేదని అసహ్యించుకున్న యష్


జయచంద్ర: మీకు పెళ్ళై ఎన్నేళ్ళు అయ్యింది. మీది ప్రేమ వివాహమా? మీ ఇద్దరి కళ్ళలో ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది. మీ కళ్ళలో ప్రేమ ప్రపంచానికి కనిపిస్తుంది. మీది చాలా మంచి మనసు పరిస్థితిని చాల బాగా అర్థం చేసుకుంటావ్, ప్రేమ కోసం ఎవరినైనా ఎదిరిస్తావ్ మాట మీద నిలబడతావ్. మీ మధ్య ఏదో దూరం ఉన్నట్టుగా ఉంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడు దూరం ఉండకూడదు. నీ కళ్ళలో ప్రేమ ఒక్కటే కాదు బాధ కూడా కనిపిస్తుంది. మీ జంట చూడముచ్చటగా ఉంది. మీరు కలకాలం కలిసి ఉండాలి.


వసు: మీ ఆశీర్వాదం ఫలించాలి అని ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోతుంటే రిషి వస్తాడు. తనని చూసి బాధగా వెళ్ళిపోతుంది. రిషి ఏదో అడగాలని అనుకుని అడగకుండా వెళ్లిపోతుంటే ఏంటో చెప్పమని జయచంద్ర చెప్తాడు.


జయచంద్ర: మనసు చాలా విచిత్రమైనది కొన్ని సార్లు మనల్ని తప్పుదారిలో నడిపిస్తాయి. నువ్వు అదృష్టవంతుడివి. సీతలాంటి భార్య దొరికింది. తనకి ప్రేమ పరీక్ష పెట్టకు. తనకు నువ్వంటే ఎనలేని ప్రేమ ఉంది. నువ్వంటే ప్రాణం, మీరు ఇద్దరు కాదు ఒక్కరే మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పరిస్థితులకు ఎప్పుడు తల వంచకూడదని చెప్తాడు. సరేనని చెప్పి రిషి వసు గదికి వెళ్ళి ఏయ్ పొగరు అని పిలుస్తాడు. ఏంటి ఈ టైమ్ లో వచ్చారని అడుగుతుంది. థాంక్స్ చెప్తాడు.


రిషి: నా మీద నీకున్న ప్రేమ అమితమైంది దాయాలనుకున్న దాయలేనిది. అందుకే అందరూ ఈజీగా కనిపెట్టేస్తున్నారు. అందుకే థాంక్స్. ఇందాక జయచంద్ర చెప్పారు. నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావని. ఆయన ఎంత గమనించి ఉంటే ఆ మాట అని ఉంటారు. ఆ మాటలకు వసు కన్నీళ్ళు పెట్టుకుంటుంది.


Also Read: స్వప్నకి చుక్కలు చూపించిన కనకం- కావ్యని ఎత్తుకుని ప్రదక్షిణలు చేసిన రాజ్




వసు: జయచంద్ర ఆశీర్వదించారు అది ఫలిస్తే చాలు మనం కలిసి ఉంటే చాలు. ఆయన మాటలు వింటుంటే మన విషయంలో ఏదో సందేహం ఉన్నట్టు ఉంది. పెళ్లి అయ్యిందని మనం చెప్పాం కానీ ఆయన నమ్మలేదని చెప్తుంది కానీ రిషి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత రిషి దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన అనుమానం బలపడి నోరు తెరిచి నిలదీస్తే ఎలా? ఆయన వెళ్ళే వరకు తెలియకుండా జాగ్రత్త పడాలని అనుకుంటాడు. నేను, వసు వేర్వేరు గదుల్లో ఉంటే డౌట్ వస్తుందని వెంటనే వసు గదికి వెళ్లబోతుంటే మహేంద్ర ఎదురుపడతాడు. ఎక్కడికని అంటే చెప్పకుండా గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతాడు.