కొత్త దంపతులు గుడికి వెళ్ళి ఆచారం ప్రకారం పూజ చేయాలని సీతారామయ్య చెప్తాడు. నీతో గుడికి రావడం ఇష్టం లేదు ఎలాగైనా ఈ పూజ ఆపేయమని రాజ్ కావ్యని అడుగుతాడు. కానీ తను మాత్రం అడ్డదిడ్డంగా వాదిస్తుంది. నాకు సంబంధించినది ఏది మీకు ఇష్టం లేదు నేను ఎప్పుడో అర్థం చేసుకున్నా, కానీ ఇష్టం లేదు అన్న మాట విన్నప్పుడల్లా గుండెల్లో ముల్లు గుచ్చుతున్నట్టు ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోమని కావ్య చెప్తుంది. సరే అయితే ఇష్టం లేదనే మాట నీకే రాసి ఇస్తాను నువ్వే వెళ్ళి తాతయ్యకి చెప్పమంటే ఓహో అలాగా అయితే కచ్చితంగా గుడికి వస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది.


మీనాక్షి, కనకం గుడికి వస్తారు. ఇద్దరూ కాసేపు విచిత్రంగా మాట్లాడుకుంటారు. నిజం చెప్పు అసలు గుడికి ఎందుకు వచ్చావని మీనాక్షి అడిగితే మొక్కు ఉందని చెప్తుంది. అమ్మా నా చెల్లి నాతో ఆడరాని అబద్ధాలు ఆడించింది, చేయరాని మోసాలు  చేయించింది. ఎలాంటి సమస్య రాకుండా కాపాడమని మీనాక్షి అమ్మవారికి మొక్కుకుంటుంది. నాతో మాట్లాడిన మాట్లాడకపోయినా అత్తారింట్లో నా కూతురు కావ్య బాగుండెలా చూడమని కనకం కోరుకుంటుంటే నేను ఉన్నాను కదా అని స్వప్న అంటుంది. మొహానికి పసుపు పూసుకుని ఎవరు గుర్తు పట్టకుండా నటిస్తుంది.


Also Read: చంటిపిల్లల ఫోటో చూసి మురిసిన జానకి- ప్రెగ్నెన్సీ గురించి మల్లికని అడిగిన జ్ఞానంబ


స్వప్న: ముగ్గురు కూతుళ్ళు ఎవరికి ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నా


కనకం: నాకు ముగ్గురు కాదు ఇద్దరే కావ్య, అప్పు


స్వప్న: అమ్మవారినే మోసం చేస్తున్నావ్ నీకు ముగ్గురు కూతుళ్ళు ఒకమ్మాయి వెళ్ళిపోయింది. రెండో అమ్మాయి వెళ్లకూడని చోటుకి వెళ్ళింది


కనకం: వెళ్లకూడదని చోటు ఏమి కాదు దుగ్గిరాల ఇంటి కోడలిగా వెళ్ళింది


స్వప్న: నీకోక పెద్ద కూతురు ఉండేది అందంగా ఉండేది తల్లిగా ఏనాదైనా ఆలోచించావా. ఆ పెద్ద కూతురు నేను నీకు ప్రసాదించిన కూతురు అది నీకు పేరు తెస్తుంది అనగానే కనకం కోపంతో ఊగిపోతుంది.


కనకం: అది నా కడుపున పుట్టలేదు దాని పేరు కూడా పలకడం ఇష్టం లేదు. దాన్ని పెద్దింటి కోడలుని చేయాలనుకున్నా కానీ మా అక్క నగలు తీసుకుని లేచిపోయింది. దాని కంట్లో కారం కొట్ట అని నోటికొచ్చినట్టు తిట్టేస్తుంది


స్వప్న: నీ పెద్ద కూతురు ఎదురుపడితే మాట్లాడవా


కనకం: మాట్లాడను చంపేస్తాను మా జీవితాలు ఇలా కావడానికి అదే కారణం నిప్పుల్లో నిలబెడతానని శూలం పట్టుకుంటుంది. అలాంటి కూతుర్ని నా కడుపులో ఎందుకు పడేశావ్ దీనికి కారణం నువ్వే అనేసరికి స్వప్న నీ పెద్ద కూతురు చాలా మంచిదని చెప్పి పారిపోతుంది.


Also Read: ఒక్కటైన దివ్య, విక్రమ్- కూతురి ప్రేమ విషయం తులసి ముందు బయటపెట్టేసిన లాస్య


రాజ్ వాళ్ళు గుడికి రావడం మీనాక్షి చూసి షాక్ అవుతుంది. అది చూసి తిక్క తిక్కగా మాట్లాడటం చూసి కనకం ఆశ్చర్యపోతుంది. అక్క బతుకు నాశనం చేయడానికే నన్ను గుడికి తీసుకొచ్చావా అని తిడుతుంది. కనకానికి వాళ్ళని చూపించేసరికి చాలా సంతోషంగా నవ్వుతుంది. కావ్య వాళ్ళు గుడికి వస్తారని నిజంగా తనకి తెలియదని కనకం చెప్తుంది కానీ మీనాక్షి నమ్మదు. నవదంపతులు బ్రహ్మముడి వేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలని పూజారి చెప్తాడు. అదంతా చాటుగా కనకం, స్వప్న చూస్తూ ఉంటారు. ఇద్దరూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తిట్టుకుంటారు. రాజ్ కావాలని లాక్కుంటూ వెళ్తుంటే కావ్య కాలు బెణికినట్టు  నటిస్తుంది. ఇక నడవలేదు కదా అయితే ప్రదక్షిణలు ఆపేద్దామని రాజ్ అంటాడు. కానీ భార్యని ఎత్తుకుని ప్రదక్షిణలు చేయాలని పూజారి చెప్పేసరికి రాజ్ బిత్తరపోతాడు.