అవుట్ హౌస్ లో ఉండటం తన వల్ల కాదని ఇంట్లోకి వస్తానని అన్నయ్యకి చెప్పమని సంజయ్ తల్లిని అడుగుతాడు. కానీ రాజ్యలక్ష్మి మాత్రం కుదరదని అంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ వస్తాడు. ఏంటి సంజయ్ డల్ గా ఉన్నాడని అంటే ప్రియ కడుపుతో ఉంది కదా అవుట్ హౌస్ లో ఉండి కష్టపడుతుందని సంజయ్ ఫీల్ అవుతున్నాడని చెప్తుంది. జాతకం వల్ల రాకూడదని నువ్వే చెప్పావ్ కదా ఏం చేయలేమని అంటాడు. పంతులకి ఫోన్ చేసి పరిష్కారం అడిగాను. కోడలిని గడప దాటించకుండా వెనుక డోర్ నుంచి లోపలికి తీసుకెళ్లవచ్చని చెప్పారని రాజ్యలక్ష్మి మాయ మాటలు చెప్తుంది. ఆ మాటకి సంజయ్ సంతోషపడతాడు. భార్య గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడు మంచి భర్త దొరికాడని విక్రమ్ ప్రియతో అంటాడు. ఈ ఇంట్లో మంచి మనసున్న వ్యక్తి అంటే అది మీరే బావగారు అని తన కాళ్ళ మీద పడుతుంది. ఈ ఇంటిని ఇల్లాలిని చాలగా చూసే దేవత మా అమ్మ నువ్వు దణ్ణం పెట్టాల్సింది మా అమ్మ కాళ్ళకని చెప్తాడు.
Also Read: కనకాన్ని కలిసేందుకు గుడికి వెళ్తున్న స్వప్న- అపర్ణ మీద విరుచుకుపడిన ఇంద్రాదేవి
హాస్పిటల్ వెళ్ళి చెకస్ ఇవ్వమని సంజయ్ విక్రమ్ ని అడుగుతాడు. అతను వెళ్లిపోగానే రాజ్యలక్ష్మి ప్రియ చెంప పగలగొడుతుంది. దివ్య అద్దం వదిలిపెట్టకుండా రెడీ అవుతుంది. డ్రెస్ ఎలా ఉందని తల్లిని అడుగుతుంది. హాస్పిటల్ కి వెళ్ళడం లేదని అర్థం అయ్యింది ఎక్కడికి వెళ్తున్నావని అంటుంది. ఈ మధ్య నీలో ఏదో మార్పు కనిపిస్తుంది, ఏదో దాస్తున్నావని అనిపిస్తుందని తులసి అంటుంది. అమ్మ ఆలోచన ఎప్పుడు తప్పు కాదు విక్రమ్ మనసులో నేను ఉన్నానని తెలిసిన మరుక్షణం చెప్పేస్తానని మనసులో అనుకుంటుంది. ఎంత బాగున్నావో నాకు కాబోయే అల్లుడు ఎక్కడ ఉన్నాడో చాలా మిస్ అవుతున్నాడని తులసి అంటుంది. నేను వెళ్తుంది నీకు కాబోయే అల్లుడేనని మనసులో అనుకుంటుంది.
దివ్య విక్రమ్ ని కలవడానికి బయల్దేరుతుంటే హాస్పిటల్ నుంచి రమ్మని ఫోన్ వస్తుంది. వెంటనే విక్రమ్ కి ఫోన్ చేసి చిన్న పని పడింది లేట్ గా కలుసుకుందామని చెప్తుంది. లాస్య రాజ్యలక్ష్మిని కలుస్తుంది. డబ్బులు ముందు పెట్టి చెప్పిన పని చేయమని చెప్తుంది. తులసి మొగుడ్ని లాక్కున్నావ్ కానీ తనతో కలిసే ఉంటున్నావ్, నీకు నువ్వు ఆ ఇంట్లో తోపువి అనుకుంటావ్ కానీ ఏరిపారేసిన కరివేపాకని నీకు తెలుసు. ఒంటరి పోరాటం చేస్తున్నావ్ అని సుతిమెత్తగా వాతలు పెడుతూ ఉంటుంది. మీరు ఎందుకు పిలిచారో చెప్పనా దివ్యని దెబ్బ కొట్టే విషయంలో నన్ను వాడుకోవాలని అనుకుంటున్నావాని తెలుసని లాస్య కూడా ధీటుగా బదులిస్తుంది. సంజయ్ విషయంలో దివ్య చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్తుంది.
లాస్య: నీ కొడుకు కానీ కొడుకు విక్రమ్ పెళ్లి చేస్తా
రాజ్యలక్ష్మి: నీకేమైన పిచ్చి పట్టిందా దివ్య పని పట్టమంటే విక్రమ్ పెళ్లి చేస్తానని అంటావ్ ఏంటి
లాస్య; విక్రమ్ కి దివ్యనిచ్చి పెళ్లి చేసి కోడలిని చేసుకోండి
రాజ్యలక్ష్మి: అది హాస్పిటల్ లో నాతో మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది దాన్ని కోడల్ని చేసుకోమంటావ్ ఏంటి
లాస్య: ప్రియని కోడలిగా ఇంటికి తెచ్చుకున్నారు కానీ తనని ప్రేమగా చూసుకుంటున్నారా. విక్రమ్ నీ చేతిలో తొలుబొమ్మ ఎలా కావాలంటే అలా ఆడతాడు. ఇలాంటి సీన్ వాళ్ళ మధ్య ఊహించుకో అనగానే విక్రమ్ దివ్యని తిట్టినట్టు ఊహించుకుంటుంది. దివ్య నీ కాళ్ళ దగ్గర జీవితాంతం బానిసలాగా పడి ఉంటుంది
రాజ్యలక్ష్మి: దివ్యని ఈ ఇంటి కోడలిని చేయడం నీదే బాధ్యత
Also Read: గుండెల్ని పిండేసే సీన్, ఖైలాష్ పంపిన ఫోటోస్ చూసేసిన యష్- వేద తన తప్పులేదని నిరూపించుకుంటుందా?
లాస్య: నీకోక షాకింగ్ న్యూస్ చెప్పనా దివ్య, విక్రమ్ ప్రేమలో ఉన్నారు. నీకు తెలియకుండానే పెద్ద కథ నడిపిస్తున్నాడు. ప్రేమతో అతన్ని కట్టి పడేయండి
రాజ్యలక్ష్మి: ఐపోయావ్ దివ్య ఇక నుంచి నీ తలరాత నేను రాస్తాను