యానివర్సరీ వేడుకల్లో వేద యష్ మెడలో పూలమాల వేస్తుంది. విన్నీకి ఐలవ్యూ చెప్పిన మాట గుర్తు చేసుకుని యష్ కోపంగా మెడలో వేసిన మాల తీసేస్తాడు. ఈ జర్నీ ఇంతటితో ఆపేద్దాం వేద లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ఉండటం తనకు చేతకాదని అంటాడు. ఏ రిలేషన్ షిప్ లో అయినా ఉండాల్సింది హానెస్టీ అదే లేనప్పుడు ఆ రిలేషన్ షిప్ వెస్ట్ అని చెప్పేసి పూల మాల విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ షాక్లో ఉంటారు. అంతా హ్యాపీగా ఉందనుకుంటే ఎందుకు ఇలా జరిగిందని మాలిని వాళ్ళు అనుకుంటారు. ఎవరు దిష్టి పెట్టారో ఏమోనని సులోచన బాధపడుతుంది. అప్పుడే వసంత్ ఇంటికి వస్తాడు. యష్ ఎక్కడ కనిపించాడా అని మాలిని ఆత్రంగా అడుగుతుంది. కనిపించలేదని చెప్తాడు. అసలు ఏమైంది అల్లుడు గారితో గొడవ పడ్డావా అని వేదని సులోచన వాళ్ళు అడుగుతారు. అప్పటి వరకు హ్యాపీగా ఉన్నాడు సడెన్ గా ఏం జరిగిందో అర్థం కావడం లేదని వసంత్ కూడా అంటాడు.


Also Read; పెళ్లి చూపుల్లో దివ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విక్రమ్- షాక్‌లో తులసి ఫ్యామిలీ


అందరూ వేదని ఏమైందని నిలదీస్తారు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేస్తారా? నా భర్త ఎందుకు ఇలా చేశాడో నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్లాడో నాకు అర్థం కావడం లేదు, మీరు నన్ను ప్రశ్నిస్తే నేనేం చెప్తానని వేద బాధగా అంటుంది. యష్ బార్ లో కూర్చుని తాగుతూ ఉంటాడు. తనతో పాటు ఎదురుగా ఉన్న మరో వ్యక్తి తన భార్య తనని మోసం చేసిందని బాధగా చెప్పుకుంటాడు. యష్ కూడా తన భార్య తనని తప్ప అందరినీ ప్రేమిస్తుందని అంటాడు. వేరే వాళ్ళని ప్రేమిస్తుంది నా పక్కన ఉన్నప్పుడు సంతోషంగా ఉండదు, అతని పక్కన ఉన్నప్పుడు తన మొహం వెలిగిపోతుంది, నా బాధని ఎవరు తీర్చలేరు. నేను తనని ఎంతగానో ప్రేమించాను కానీ తను మాత్రం ఒక్కసారి కూడా ఐలవ్యూ చెప్పలేదు. మనకి ప్రేమ దక్కాల్సిన చోట మనకి కాకుండా ఆ ప్రేమ వేరే వాళ్ళకి దక్కుతుంటే ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? అది నాకు తెలుసు. ఎవరికైనా ఒక తప్పు ఒకరి జీవితంలో ఒకటే సారి జరుగుతుంది. కానీ నా జీవితంలో ఒకే తప్పు రెండు సార్లు జరిగిందని ఎమోషనల్ అవుతాడు.


Also Read: స్వప్నకి చుక్కలు చూపించిన కనకం- కావ్యని ఎత్తుకుని ప్రదక్షిణలు చేసిన రాజ్


‘ఈ జన్మకి నేను ఆయన నోటి నుంచి వినాలనుకున్న మాటలు నేను చెప్పాలనుకున్న మాటలు వినేందుకు ఒక్క నిమిషమే.. కని ఒకే ఒక నిమిషంలో అంతా జరిగిపోయింది నా జీవితం తిరగబడింది. ఏవండీ మీరంటే నాకు ఇష్టం నాకు ప్రాణం, జన్మజన్మలకీ మీరే నాకు భర్త కావాలని మైక్ లో చెప్పాలని అనుకున్నా కానీ అంతలోనే’.. అని వేద గుండె పగిలేలా ఏడుస్తుంది. తనే వెళ్ళి యష్ ని వెతుక్కుని తీసుకొస్తానని చెప్తుంది. ఈ భూ ప్రపంచంలో ఎవరు తన భర్త నుంచి తనని వేరు చేయలేరని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. యష్ రోడ్డు మీద నిలబడి తాగుతూ బాధగా మాట్లాడతాడు. నేను కోరుకున్నది ఏదీ నాకు దక్కలేదు. నా లైఫ్ లో ఎవరూ ఉండరు. ఐ హేట్ మై లైఫ్. వేదని చూస్తే జరిగిందంతా గుర్తుకు వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళనని అంటాడు. వేద ఏడుస్తూ రోడ్డు మీద యష్ ని వెతుక్కుంటూ తిరుగుతూ ఉండగా రోడ్డు మీద యష్ కారు కనిపిస్తుంది. దిగి వెళ్ళి చూడగా రోడ్డు పక్కన కూర్చుని తాగుతూ ఉంటాడు.