Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

నటి అనసూయ నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఆంటీ వివాదంతో పాటు కొత్త సినిమాల వివరాల గురించి చెప్పుకొచ్చింది.

Continues below advertisement

అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకుల్ని తన అంద, చందాలతో ఎంతో ఆకట్టుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పలు ఛానెల్స్ లో యాంకర్ గా షోలు చేసింది. పలు సినిమాల్లో నటించింది. బుల్లితెరపై టాప్ యాంకర్ గా వెలుగు వెలిగిన అనసూయకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించిన మెప్పించడంతో అవకాశాలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో టీవీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి సినిమా ఇండస్ట్రీలోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టింది.  

Continues below advertisement

వరుస సినిమాలతో బిజీ బిజీ

కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరెక్కిన 'రంగమార్తాండ'లో ప్రకాష్ రాజ్ కోడలి పాత్రలో అనసూయ కనిపించారు.  తాజాగా విడుదలైన ఈ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం 'పుష్ప 2', ‘అరి’, సహా పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. ‘పుష్ష’ సినిమాలో కాత్యాయినిగా ఆకట్టుకున్న అనసూయ, ‘పుష్ప2’లో మరింత అలరించనున్నట్లు తెలుస్తోంది.    

అభిమానులతో చిట్ చాట్

ఆదివారం కావడంతో అభిమానులతో ఇన్ స్టాలో  ఇంటరాక్ట్ అయ్యింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఆంటీ వివాదంతో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వెల్లడించింది.

1) సండే స్పెషల్ ఏంటి మేడం?

అనసూయ: అమ్మ చేసిన మామిడికాయ పప్పు, చుక్కకూర పచ్చడి.

2) అక్క మిమ్మల్ని ఎవరైనా ఆంటీ ఆంటే ఎందుకు అంత కోపం వస్తుంది?

అనసూయ: ఎందుకంటే వాళ్ల అర్థాలు వేరే ఉంటాయి కాబట్టి. ఎనీ వే, ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ల ఖర్మకే వదిలేస్తున్న. నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నందున వాటిని పట్టించుకోవడం లేదు.

3) కొత్త మూవీ గురించి ఏదైనా అప్ డేట్?

అనసూయ: ఏప్రిల్ రెండో వారంలో  నా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అద్భుమైన డైరెక్టర్, మంచి టీమ్. పూర్తి వివరాల కోసం కాస్త వెయిట్ చేయాల్సిందే.

4) మీరు చాలా స్ట్రాంగ్, ఇన్స్ ప్రెషన్, కానీ, సైలెంట్ గా ఉంటే ఏం బాగా లేదు!

అనసూయ: థ్యాంక్యూ. కానీ, నేను సైలెంట్ గా లేనే. కొంచెం ఫోకస్ మార్చాను. మాట్లాడాలి అన్నప్పుడు నన్ను నేను అపలేను.

5) టీవీ షోలు, ఇనాగరేషన్స్, యాడ్స్, మూవీస్, ఫ్యామిలీకి టైమ్ ఇస్తారా?

అనసూయ: నేను టాప్ మోస్ట్ ప్రియారిటీ నా కుటుంబానికే ఇస్తాను.

6)ఇవాళ వెజ్  తీసుకున్నారా? నాన్ వెజ్ తీసుకున్నారా?

అనసూయ: నిన్న, ఇవాళ, రేపు, ఎప్పుడైనా వెజ్ తీసుకుంటాను. ఎందుకంటే నేను వెజిటేరియన్.  వీటితో పాటు పలు ప్రశ్నలకు అనసూయ సమాధానం చెప్పింది.

అనసూయ మనసులో ఏమీ దాచుకోదు!

వాస్తవానికి అనసూయ భరద్వాజ్ మనసులో ఏమీ దాచుకోదు. తన మనసుకు అనిపించిన విషయాలను బయటకు చెప్పేస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారని సైలెంట్ గా ఉండే రకం కాదు తను. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులుకు ఫిర్యాదు కూడా చేసింది. అంతేకాదు,  ఎవరైన తన గురించి పిచ్చి కామెంట్స్ చేస్తే, చీరి చింతకు కట్టేలా రిప్లై ఇస్తుంది. అందుకే ఆమెపై ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడింది. ఆమె పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా, సినిమా రంగంలో మాత్రం మంచి స్వింగ్ లో కొనసాగుతోంది. 

Read Also: వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Continues below advertisement