యష్ రోడ్డు పక్కన కూర్చుని తాగుతూ ఉంటే వేద వచ్చి బాటిల్ పక్కకి నెట్టేస్తుంది. ఏమైంది ఎందుకు తాగుతున్నారని వేద అడుగుతుంది. తనని పక్కకి నెట్టేసి నీ సహాయం నాకేమీ అవసరం లేదని చిరాకుపడతాడు. ఎందుకు సడెన్ గా ఇలా మారిపోయారు నేనేం తప్పు చేశానని అడుగుతుంది. నువ్వేం చెయ్యలేదు నేనే చేశాను జరిగిన తప్పు తెలిసి కూడా గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే తప్పు చేశాను. నేను ఇష్టపడేది ఎప్పుడూ నా దగ్గర ఉండదు.


వేద: నేను ఉన్నా కదా నాతో చెప్పండి


యష్: నాకు ఎవరూ వద్దు నన్ను వదిలేసి వెళ్లిపోతారు నువ్వు వెళ్లిపోతావు


వేద: మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికైనా వెళ్తానా, మీకోసం నేను ఎంతగా ఆరాటపడుతున్నానో తెలుసు. మిమ్మల్ని ఎంతగా కోరుకుంటున్నానో తెలుసు. ఫంక్షన్ ముందు వరకు మీరు ఇదే పరిస్థితిలో ఉన్నాను మరి ఇప్పుడు ఏమైంది. నేను ఎక్కడికి వెళ్ళను నన్ను నమ్మండి, రండి ఇంటికి వెళ్దాం అని పడిపోతుంటే వేద పట్టుకుంటుంది


Also Read: కళావతిని వెనకేసుకొచ్చిన మిస్టర్ డిఫెక్ట్- స్వప్నని తీసుకురావడానికి వెళ్ళిన రాజ్


కాసేపటికి మెళుకువ వచ్చి లేచేసరికి వేద మెడలో తాళి యష్ చైన్ కి మేలేసుకుంటుంది. వెంటనే దాన్ని తీసేసి కారు ఎక్కి కూర్చుంటాడు. మిమ్మల్ని వెళ్లనివ్వనని వేద కారు ఎదురుగా నిలబడి నా మీద మీకు ప్రేమ లేదంటే అడ్డు తప్పించుకుని వెళ్ళమని అంటుంది. యష్ ని ఆ పరిస్థితిలో చూసి వేద గుండె పగిలేలా ఏడుస్తుంది. ఏమైంది మీకు ఎందుకు ఇలా మారిపోయారు. ఈరోజు మన జీవితంలో ఎంత గొప్ప రోజు సంతోషంగా ఇంట్లో వాళ్ళతో గడపాల్సిన రోజు. అందరినీ వదిలేసి ఇలా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది. నాకు తెలియకుండా నేను తప్పు చేశానా? నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానని బాధపడుతుంది.


అభిమన్యు ఖైలాష్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడే ఖైలాష్ వచ్చి యష్ వెళ్లిపోయాడని చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగాలి, మానసికంగా కుంగిపోవాలి. దీన్ని ఆసరాగా తీసుకుని బిజినెస్ లో తొక్కేయాలని అనుకుంటాడు. యష్ జీవితం నాశనం చేయాలంటే ఇది సరిపోదు లైఫ్ లో వేద మొహం చూడకుండా చేయాలి. యష్ వేదని పట్టించుకోకుండా చేయగలిగితే ఇద్దరి మధ్య దూరం పెరిగి విడాకులు అయిపోవాలి. వాడి లైఫ్ లో వైఫ్ అనేది ఉండకూడదని అనుకుంటాడు. ఇంటి దగ్గర అందరూ టెన్షన్ పడుతూ ఉంటే వేద యష్ ని తీసుకుని వస్తుంది. తాగి తూగుతున్నాడని మాలిని కోపంగా అరుస్తుంది. ఎందుకు ఇంకా వాడిని మోస్తున్నావ్ వదిలేసేయ్ అంటుంది. వదిలేసేంత తేలికైనది కాదు మా బంధమని చెప్తుంది. ఆ మాటకి యష్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. గుండెల్లో అంత బాధ పెట్టుకుని ఎందుకు వాడిని వెనకేసుకొస్తున్నావాని సులోచన కూడా అంటుంది. బాధ అయినా సంతోషమైన భర్తేనని మీరే చెప్పారు కదా అందుకే నేను అదే చేస్తున్నానని వేద చెప్పేసి యష్ ని గదిలోకి తీసుకెళ్తుంది.


Also Read: జ్ఞానంబకి నడిరోడ్డు మీద వార్నింగ్ ఇచ్చిన రౌడీ తండ్రి- తప్పు ఒప్పుకుని క్షమించమన్న జానకి


మీ బాధ ఏంటో నాతో పంచుకోవచ్చు కదా నాలో ప్రేమ మీకు కనిపించడం లేదా మీకోసం ఏమైనా చేస్తానని అనిపించడం లేదా అని వేద యష్ పక్కనే కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. మీరంటే నాకు పిచ్చి మన బంధం ఒక సంవత్సరం అగ్రిమెంట్ అనుకుని ఆగిపోతున్నారేమో మనది ఎన్నెన్నో జన్మల బంధం అని అంటుంది.