తెలంగాణలో తీవ్ర కలకలం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు స్పీడ్ పెంచింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని సిట్ అధికారులు ఏప్రిల్ 3న విచారించారు. దాదాపు 3 గంటలపాటు ఆయనను ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక విషయాలను నమోదు చేసుకున్నారు. ఈ కేసులో జనార్ధన్ రెడ్డి స్టేట్ మెంట్ కీలకం కానుంది.
కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి నిందితులు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ తస్కరించడం నుంచి ప్రశ్నపత్రాల లీక్ వరకు జరిగిన పరిణామాలపై ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కమిషన్‌లో పనిచేసే ఉద్యోగుల విధివిధానాలు, ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తిస్తారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రశ్నపత్రాల తయారీ, వాటిని భద్రపరచడం, పరీక్షలు నిర్వహించే తీరు, దానికి అనుసరించే పద్ధతులపై ఆరా తీసినట్లు సమాచారం. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ఆఫీసులో చేసిన పనితీరు గురించి ఛైర్మన్ నుంచి వివరాలు సేకరించింది. ప్రవీణ్ , రాజశేఖర్ ల ల్యాప్ టాప్ సమాచారాన్ని మరోసారి పరిశీలించింది సిట్.
ముగ్గురి కస్టడీకి కోర్టు అనుమతి..
మరోవైపు ఈ కేసులో ముగ్గురు నిందితులు ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారించింది. సిట్ అధికారుల అభ్యర్థన మేరకు వారిని 3 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో ముగ్గుర్ని ఏప్రిల్ 4న చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని ఏప్రిల్ 6 వరకు సిట్ అధికారులు విచారించనున్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో మొత్తం 15 ప్రశ్నపత్రాలు!
తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసులో నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. సిట్ గుర్తించిన ప్రశ్నపత్రాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్; ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు; డీఏవో జనరల్ స్టడీస్, మ్యాథ్స్ పేపర్లు; ఏఈ జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు; ఏఈ సివిల్, ఎలక్ట్రికల్ పేపర్ 2; టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్లు ఉన్నాయి. అదేవిధంగా జులైలో జరగాల్సిన జేఎల్ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్‌డ్రైవ్‌లో లభ్యమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లక్షల రూపాయల డబ్బు చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!
తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం కష్టపడి చదివిన నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. రాత్రింభవళ్లు చదివి.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించివారైతే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎవరో చేసిన పాపం, తమకు శాపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలాగైనా సర్కారు కొలువు కొట్టి కుటుంబానికి అండగా నిలబడాలని భావించే వారి వ్యతలు చెప్పుకోలేనివి. భద్రాచలానికి చెందిన భవానీది ఇదే పరిస్థితి. చిన్ననాటి నుంచే దివ్యాంగురాలైన భవాని సరిగా మాట్లాడలేదు, చెవులు కూడా సరిగా వినపడవు. అయినప్పటికీ కష్టపడి చదివి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసింది, మెయిన్స్‌కు అర్హత కూడా సాధించింది. తీరా గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించడంతో వారి కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
తెలంగాణలో పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 29న ప్రకటించింది. కొత్త షెడ్యూలు ప్రకారం మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలకు; మే 9న అగ్రికల్చర్, మెకానికల్ విభాగాలకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించిననున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..