జానకి చూసుకోకుండా బాబుకి విరిగిపోయిన పాలు తాగించబోతుంటే మల్లిక వచ్చి పెద్ద సీన్ చేస్తుంది. బాబుని  చంపేయాలని అనుకుంటున్నావా ఏంటని గొడవ చేస్తుంది. ఆ మాటలకు జానకి చాలా బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. గదిలోకి బాధపడుతుంటే రామ టిఫిన్ తీసుకుని వస్తాడు. బాధని దిగమింగుకుంటూ ఆకలిగా లేదని అబద్ధం చెప్తుంది. ఎవరి మీద కోపం ఆకలి మీద చూపించకూడదని అంటాడు. అందరికీ జాగ్రత్తలు చెప్పే నేను ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నాను. మల్లిక, అఖిల్ మాటలు అనడం తప్పు కాదు. రేపటి నుంచి బాబు దగ్గరకి వెళ్ళను దూరం నుంచి చూసి ఆడుకుంటానని చెప్తుంది. రేపు మనకి బిడ్డ పుడితే ఇలాగే జరిగితే ఏం చేస్తారని రామ సర్ది చెప్పి టిఫిన్ తినిపిస్తాడు.


Also Read: మనసుల్ని మెలిపెట్టేసిన నందు- విక్రమ్ కి నిజం చెప్పడానికి ట్రై చేస్తున్న ప్రియ


స్టేషన్ కి వచ్చిన జానకి సుగుణకి గుడ్ మార్నింగ్ చెప్తుంది. చిరాకుగా సమాధానం చెప్తుంది. ఎస్సై ఒక పని అప్ప జెప్పారని చెప్తుంది. బ్యాంక్ రాబరీ జరిగిన చోటుకి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోమని చెప్పినట్టు చెప్తుంది. ఎస్సై ఎక్కడికి వెళ్లాడని అంటే సెటిల్ మెంట్ కి వెళ్లాడాని ఇలా చెప్తుంది. అప్పుడే మనోహర్ ఫోన్ చేసి తన టేబుల్ మీద ఫైల్ జానకితో పంపించమని చెప్తాడు. మల్లిక జానకిని దోషిగా నిలబెట్టినందుకు తెగ సంతోషపడుతుంది. ఈ పాపం ఊరికే పోదని మలయాళం అంటాడు. నువ్వు కూడా జానకి అభిమాన సంఘంలో చెరిపోయావా అని వాడిని రివర్స్ లో తిడుతుంది. అసలు తప్పు నీదే జెస్సి బాబుని పట్టుకోమంటే అక్కడ పెట్టేసి వెళ్లిపోయావ్ నువ్వు వెళ్లబట్టే కదా గొడవ జరిగిందని వాడిని బెదిరిస్తుంది. ఎవరు అవునన్నా కాదన్న జానకిది దురదృష్ట జాతకమని బాబుకి తనని దూరం పెట్టడం మంచిదని మలయాళంతో అనడం గోవిందరాజులు వింటాడు.


Also Read: పెళ్లి నుంచి స్వప్నని తప్పించింది కళావతేనన్న రాజ్- కావ్య తన తప్పు లేదని నిరూపించుకోగలుగుతుందా?


ఆవేశంగా కిచెన్ లోకి వచ్చిన గోవిందరాజులు మలయాళంని అడ్డం పెట్టుకుని మల్లికని తిడతాడు. మొత్తం వినేశాడు డౌట్ లేదని మల్లిక మనసులో టెన్షన్ పడుతుంది. నోటికొచ్చినట్టు తిట్టేసి ఉతికి ఆరేసి వెళ్ళిపోతాడు. జ్ఞానంబ జెస్సిని పిలిచి బాబుకి పోలియో డ్రాప్స్ వేయించాలని చెప్తుంది. రామ, నేను వెళ్ళి వేయిస్తామని అంటుంది. మీరు తీసుకువెళ్లారని తెలిస్తే అఖిల్ గొడవ చేస్తాడని భయపడుతుంది. ఈ విషయం చెప్పొద్దులే అని రామ వాళ్ళు బాబుని తీసుకుని వెళతారు. మల్లిక రావడం చూసి బాబు ఎక్కడ ఉన్నాడో అడుగుతుందని టెన్షన్ గా లోపలికి వెళ్ళిపోతుంది. జానకి ఫైల్స్ తీసుకుని మనోహర్ చెప్పిన చోటుకి వెళ్తుంది. మెట్లు ఎక్కుతూ ఉండగా బిల్డర్ అక్కడ ఒక వ్యక్తిని కత్తితో పొడవడం జానకి చూస్తుంది. ఇంకా రాలేదేంటని మనోహర్ జానకికి ఫోన్ చేస్తే మర్డర్ అటెంప్ట్ జరిగిందని చెప్తుంది. దీంతో మనోహర్ కంగారుగా కిందకి వస్తాడు. ఇక్కడ పరిస్థితి తాను చూసుకుంటానని చెప్పి అతన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమని చెప్తాడు. చంపిన వ్యక్తిని నేను చూశాను బిల్డర్ మధు అని జానకి చెప్తుంది.