దివ్య మెడలో విక్రమ్ పసుపు తాడు వెయ్యగానే తాను పలుపు తాడు వేసి దాని మీద పగ తీర్చుకుంటానని రాజ్యలక్ష్మి అంటుంది. ప్రియ దివ్యని వదిలిపెట్టమని కాళ్ళ మీద పడుతుంది. కానీ రాజ్యలక్ష్మి మాత్రం దివ్య కూడా తన కాళ్ళ మీద పడాలని క్షమించమని వేడుకోవాలని అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తానని అంటుంది. దివ్య తాతయ్యతో కలిసి చెస్ ఆడుతూ సరదాగా ఉంటుంది. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఎవరితో ఆడతావాని దివ్య అడుగుతుంది. అప్పుడే తులసి, నందు వచ్చి వెడ్డింగ్ కార్డ్ శాంపిల్స్ తీసుకొస్తారు. మీరిద్దరూ నచ్చింది తీసుకోవచ్చు కదా అంటుంది కానీ తులసి మాత్రం నీకు నచ్చినదే సెలెక్ట్ చేయాలని చెప్తుంది. నందు ఒక కార్డ్ సెలెక్ట్ చేసి తీసుకొస్తే తులసి మరొకటి తెస్తుంది. ఈ రెండింటిలో ఏది నచ్చితే అది చెప్పు మొహమాటం వద్దని అంటాడు. తులసి మనసులో నా సెలెక్షన్ నచ్చుతుందని అనుకుంటే నందు కూడా అదే అనుకుంటాడు.


Also Read: పెళ్లి నుంచి స్వప్నని తప్పించింది కళావతేనన్న రాజ్- కావ్య తన తప్పు లేదని నిరూపించుకోగలుగుతుందా?


దివ్య తండ్రి తెచ్చిన కార్డ్ నచ్చిందని చెప్పేసరికి సంబరపడిపోతాడు. దివ్యకి నచ్చింది నేను సెలెక్ట్ చేసిన కార్డ్ కానీ వాళ్ళ నాన్న కళ్లలో సంతోషం, ప్రేమ చూడటం కోసం అది నచ్చిందని చెప్పిందని తులసి అసలు నిజం చెప్తుంది. కార్డ్ విషయంలో నా ఇష్టం కన్నా నాన్న కళ్ళల్లో సంతోషం చూడాలని అనిపించిందని చెప్తుంది. ఇప్పటి వరకు తులసి మాత్రమే ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు దివ్య కూడా మరో తులసి అయ్యిందని పరంధామయ్య మెచ్చుకుంటాడు. నందు దివ్య పుట్టిన వీడియో చూస్తూ ఎమోషనల్ అవుతాడు. తులసి కూడా వచ్చి నందు దగ్గర కూర్చుని మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తే బాగుండని అనుకుంటుంది. ఇద్దరూ కూతురి జ్ఞాపకాల్లో మునిగితేలుతారు. మన మధ్య దూరం దివ్యకి నాన్నని దూరం చేసింది ఈ నాన్న మీద కోపం పెంచుకుంది. నేను రియలైజ్ అయ్యేసరికి దూరం పెరిగిపోయింది. తనకి నా మీద ఆపేక్ష తగ్గిపోయిందని తండ్రి మనసు తల్లడిల్లిపోవడం దివ్య చూస్తూనే ఉంటుంది. నా పిల్లలు ఇప్పటికీ నాతో ఉన్నారంటే అది నీ వల్లేనని తులసికి దణ్ణం పెడుతుంటే దివ్య వచ్చి తండ్రిని కౌగలించుకుంటుంది.


దివ్య: నువ్వంటే నాకు ఎప్పుడు కోపం లేదు అమ్మని దూరం చేసుకున్నారనే బాధ తప్ప మరొకటి లేదు నాన్న. ఇంకెప్పుడు నీకు దూరం కాను నాన్న


నందు: నవ్వుతాడు తులసి మాటలు నువ్వు నమ్ముతున్నావా


దివ్య: ఎందుకు నవ్వుతున్నారు నేను అబద్ధాలు చెప్తున్నాన


Also Read: తల్లడిల్లిపోతున్న మాలిని, ఖుషిని దూరం చేస్తున్న యష్- వేద ప్రేమ చూసి విన్నీ మారతాడా?


ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో అమ్మానాన్నలకి ఎలా దూరం అవుతుందో చక్కగా చెప్తాడు. ఆ సీన్ చాలా ఎమోషనల్ అవుతాడు. దివ్యని ఇరికిస్తున్న విషయం తనకి ఎలా చెరవేయాలో అర్థం కావడం లేదు. నగలు తీసుకోవడానికి వాళ్ళ అమ్మ వస్తుంది తనకి ఎలాగైనా చెప్పాలని అనుకుంటుంది. కానీ అప్పుడే రాజ్యలక్ష్మి వచ్చి తులసి రావడం లేదని నగల షాపు అతన్నే ఇంటికి పంపిస్తానని ఫోన్లో మాట్లాడటం వింటుంది. అందరూ కూర్చుని దివ్య పెళ్లి గురించి తర్వాత తన జీవితం ఎంత గొప్పగా ఉంటుందోనని ఊహించుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రాజ్యలక్ష్మి పంపించిన చీరలు, నగలు వస్తాయి. అన్నింటికీ మా అత్తగారు మా అత్తగారు అంటూ మాట్లాడుతుంది. దివ్య కన్నీళ్ళు పెట్టుకునేసరికి అనసూయ కూడా బాధపడుతుంది.