Stocks to watch today, 05 April 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 60 పాయింట్లు లేదా 0.22 శాతం రెడ్‌ కలర్‌లో 17,514 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


బజాజ్ ఫైనాన్స్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ కొత్త లోన్ బుకింగ్స్‌ భారీగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 20% బలమైన వృద్ధిని నమోదు చేశాయి. FY23లో ఇది రికార్డు స్థాయి నంబర్‌.


HCL టెక్: ఆదాయాల సీజన్‌కు ముందు, IT సేవల ప్రదాత HCL టెక్నాలజీస్ లిమిటెడ్‌ను JP మోర్గాన్ షాక్‌ ఇచ్చింది. ఈ ఐటీ కంపెనీకి సమీప-కాల రిస్క్‌లు ఉన్నాయని పేర్కొంటూ "నెగెటివ్‌ క్యాటలిస్ట్‌ వాచ్‌"లో ఉంచింది.


NBCC: మిజోరంతో పాటు భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనుల కోసం కేంద్ర హోం శాఖకు చెందిన 'సరిహద్దు నిర్వహణ విభాగం' నుంచి రూ. 448 కోట్ల విలువైన ఆర్డర్‌ను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌బీసీసీ దక్కించుకుంది.


సౌత్ ఇండియన్ బ్యాంక్‌: సౌత్ ఇండియన్ బ్యాంక్ అడ్వాన్స్‌లు 17% వృద్ధితో రూ. 72,107 కోట్లకు చేరుకోగా, డిపాజిట్లు స్వల్పంగా 3% పెరిగి రూ. 91,652 కోట్లకు చేరుకున్నాయి.


రైల్‌టెల్: బిహార్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ నుండి 110 కోట్ల రూపాయల విలువైన వర్క్ ఆర్డర్‌లను రైల్‌టెల్ పొందింది.


మహీంద్ర ఫైనాన్స్: 2023 మార్చి త్రైమాసికంలో, కంపెనీ డిస్‌బర్స్‌మెంట్లు రూ. 13,750 కోట్లుగా ఉన్నాయి, గత సంవత్సరంలోని ఇదే కాలం కంటే ఇది 50% వృద్ధి. FY23లో డిస్‌బర్స్‌మెంట్లు దాదాపు రూ. 49,500 కోట్లు, ఇది కూడా సంవత్సరం ప్రాతిపదికన 80% పెరిగింది.


వేదాంత: ఈ కంపెనీ నాలుగో త్రైమాసిక బిజినెస్‌ అప్‌డేట్స్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వేదాంత షేర్లు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి. లాంజిగర్ రిఫైనరీలో అల్యూమినా ఉత్పత్తి త్రైమాసికంలో 7% తగ్గి 411 kt గా నమోదైంది.


రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ కంపెనీ టెలికాం యూనిట్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కలిసి 2 బిలియన్ డాలర్ల యాడ్-ఆన్ ఫారిన్ కరెన్సీని చాలా తక్కువ రేట్ల వద్ద సమీకరించినట్లు పీటీఐ నివేదించింది.


బ్రిటానియా ఇండస్ట్రీస్: 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌పై మధ్యంతర డివిడెండ్‌గా రూ. 72 చెల్లించేందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్ బోర్డు ఆమోదించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.