యష్ ని తీసుకుని వేద ఇంటికి వస్తుంది. నాలో ప్రేమ మీకు కనిపించడం లేదా మీ కోసం ప్రాణం ఇస్తాను. మీరంటే నాకు పిచ్చి. మన బంధం ఒక సంవత్సరం అగ్రిమెంట్ అనుకుని ఆగిపోతున్నారేమో కాదు మనది ఎన్నెన్నో జన్మలబంధం. అయినా మీ మనసులో ప్రేమని చెప్పాలని అనుకున్నారు కదా మరి మీ బాధ చెప్పడానికి ఏం అడ్డు వస్తుంది. ప్రేమని దాచుకోవచ్చు కానీ బాధని ఒక్క క్షణం కూడా దాచుకోకూడదు. అది మనిషిని దహించివేస్తుంది. మీ గుండెల్లో బాధని నాకు ఇచ్చేయండి. మీలాంటి మంచి వారికి బాధలు ఉండకూడదు. మీరు ఎప్పటికీ బాధ పడకూడదు. ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. మీ బాధకి నేనేమైనా కారణమా. మన మధ్య పోట్లాటలు అయిపోయాయి. ఇప్పుడు మన మధ్య ఉంది ప్రేమ మాత్రమే. తెలియక ఏదైనా ఉంటే చెప్పి నిలదీయండి. నా భర్తగా మీకు హక్కు ఉంది అని యష్ కాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తుంది.


వేద యష్ మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటే మాలిని వస్తుంది. ఎక్కడ కనిపించాడని అడిగితే రోడ్డు పక్కన అని చెప్పేసరికి మాలిని ఏడుస్తుంది.


వేద: ఆయన ఎందుకో హర్ట్ అయ్యారు, ఆయన బాధ వెనుక కారణం కనుక్కోవాలి


Also Read: కావ్యని తప్పుబట్టిన కుటుంబం- రాజ్ కంట పడకుండా స్వప్న తప్పించుకుంటుందా?


మాలిని: యష్ ఇలా ప్రవర్తించడం ఇది మొదటి సారి కాదు ఇలాంటి పరిస్థితి మాళవిక వాడిని వదిలి వెళ్లిపోయినప్పుడు వచ్చింది. అప్పుడు నా బిడ్డ గుండె పగిలిపోయింది, మనసు ముక్కలైంది. పిచ్చివాడిలా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇలాగే ఉండే వాడు. అమ్మా వేద అలాంటి వాడి జీవితంలో దేవతలా వచ్చావ్ యష్ ని మార్చావ్ కానీ మళ్ళీ ఇలా అవుతుంది ఏంటి మాసిపోతున్న పాత గాయాన్ని మళ్ళీ తిరగబెడుతుంది ఎవరు నాకు భయంగా ఉంది  


ఆయన ఎవరి వల్ల హర్ట్ అయ్యారో ఎందుకు అలా ఉన్నారో తెలుసుకోవాలని ఆలోచనలో పడుతుంది. వసంత్, చిత్ర కూడా వేద వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడతారు. వేద ఏడుస్తుంటే విన్నీ ఏమైందని అడుగుతాడు. ఆయనే నా భర్త, నా ప్రాణం ఊపిరి, ఆయన లేనిదే నేను లేను. ఆయన లేని జీవితం నాకు అక్కర్లేదు. ఒకవేళ ఆయన్ని వదిలేసుకోవాల్సి వస్తే ప్రాణాలు వదిలేసుకుంటాను. నా భర్తని నన్ను ఒక్కటి చేయాలని నువ్వు ఆలోచించినంతగా ఎవరు ఆలోచించలేదు. నువ్వు అర్థం చేసుకున్నట్టు నా భర్త ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఏడుస్తుంది. నీకోసం ఏమైనా చేస్తానని విన్నీ అంటాడు. నా భర్తని నాకు దూరం కానివ్వనని మాట ఇవ్వమని వేద అడుగుతుంది.


Also Read: యష్ లైఫ్ లో వైఫ్ ఉండకూడదని అభిమన్యు స్కెచ్- గుండెలు పగిలేలా ఏడుస్తున్న వేద


విన్నీ కాసేపు ఆలోచించి చేసేదేమి లేక వేదకి ప్రామిస్ చేస్తాడు. పొద్దున్నే ఖుషిని వేద రెడీ చేస్తుంటే యష్ వచ్చి కోపంగా చూస్తాడు. తనని పక్కకి లాగేసి నాకుతుర్ని రెడీ చేయడానికి నేను ఉన్నాను వేరే ఎవరు అక్కర్లేదని అంటాడు. అలా అంటారు ఏంటి ఖుషిని రోజు స్కూల్ కి తీసుకు వెళ్ళేది నేనే కదా అని అంటే అవసరం లేదు ఇక నుంచి నేనే చూసుకుంటానని యష్ కోపంగా వేదకి సమాధానం చెప్పకుండా వసంత్ కి చెప్తాడు.