ఎస్సై ఫోన్ చేసి కావ్య తన అక్క గురించి కంప్లైంట్ ఇచ్చిన విషయం చెప్పడంతో అడుగుదామని తన గదికి వెళతాడు. కానీ లోపలికి వెళ్లబోతు ఎందుకు వచ్చిన తంటా అని తలుపు వేసి వెనక్కి తిరిగేసరికి కళ్యాణ్ ఉంటాడు. ఎవరైతే చూడకూడదు అనుకున్నానో వాడే చూశాడే అని నసుగుతాడు. వదిన అంటే నీకు ప్రేమ కదా అని అంటే రాజ్ ఏదేదో మాట్లాడేసి జారుకుంటాడు. రాజ్ కి ఎస్సై మళ్ళీ ఫోన్ చేసి స్వప్న ఎక్కడ ఉందో తెలిసిపోయిందని చెప్తాడు. తను దొరకగానే మీ దగ్గరకి వస్తానని అంటాడు. వద్దు నేను మీతో వస్తానని రాజ్ అనుకుంటాడు. నేరుగా వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే నువ్వు వెళ్లిపోవడానికి కారణం ఎవరో తెలిసిపోతుందని అనుకుని హాల్లోకి వచ్చి కళావతి అని గట్టిగా అరుస్తూ పిలుస్తాడు.


రాజ్: మొన్న రాత్రి ముసుగు వేసుకుని ఎక్కడికి వెళ్ళావ్. నా నోరు నొక్కి నామాటకి వాల్యు లేకుండా చేశారు చెప్పు ఎక్కడికి వెళ్ళావ్


రుద్రాణి: ముసుగు వేసింది నేనే అని చెప్పినట్టు ఐడియా ఇచ్చింది కూడా నేనే అని చెప్పేస్తుందా


కావ్య: పోలీస్ స్టేషన్ కి


రాజ్: ముసుగు వేసుకుని పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లిందో తెలుసా పెళ్లి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ అక్క గురించి కంప్లైంట్ ఇచ్చి వచ్చింది


Also Read: యష్ లైఫ్ లో వైఫ్ ఉండకూడదని అభిమన్యు స్కెచ్- గుండెలు పగిలేలా ఏడుస్తున్న వేద


ఇంద్రాదేవి: దుగ్గిరాల ఇంటి కోడలిగా వెళ్ళావా, కనకం కూతురిగా వెళ్ళావా


రాజ్: నా భార్య హోదాలో వెళ్ళింది మిసెస్ రాజ్ అని చెప్పింది


సీతారామయ్య: ఇలాంటి పొరపాట్లు నువ్వు చేయడం ఏంటమ్మా? నీకు మీ అక్క గురించి ఆందోళనగా ఉంటే ఇంట్లో ఎవరికైనా చెప్పొచ్చు కదమ్మా


ఇంద్రాదేవి: తప్పమ్మా దుగ్గిరాల ఇంటి కోడలు అర్థరాత్రి గడప దాటి వెళ్ళడం అంటే తప్పు


అపర్ణ: విన్నావా మా అత్తయ్య మావయ్యలు నువ్వు చేసింది తప్పు. అయినా నువ్వు అడుగుపెట్టిన రోజే పుట్టింటితో సంబంధాలు ఉండకూడదని షరతు పెట్టాను అది మీరి వెళ్ళడం ఏంటి


కావ్య: క్షమించండి దుగ్గిరాల ఇంటి కోడలు గడప దాటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం తప్పే కానీ మరొక మార్గం తోచలేదు. నా ఉనికి ప్రశ్నార్థకంగా మారిన ఈ ఇంట్లో ఎవరిని సాయం అడగాలో అర్థం కాలేదు. నేను షరతు ఉల్లంఘించలేదు. నా కుటుంబంతో ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు


రాజ్: చాలు ఆపు నువ్వు ఎలా వెళ్ళినా ఈ ఇంటి నుంచి వెళ్ళావ్, ఈ కుటుంబానికి ద్రోహం చేసిన దాని కోసం వెళ్ళావ్


కావ్య: పెళ్లి మండపం నుంచి మాయ చేసి ఎవరో మోసం చేసి తీసుకెళ్లారు తను దొరికితే అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి


రాజ్: అయితే మీ అక్క దొరుకుతుంది మణికొండలో ఒక హోటల్ లో ఉంది వెళ్ళి తీసుకొస్తాను. ఈ కళావతి రూపం తెలియాలయంటే వాళ్ళ అక్క రావాలి


Also Read: జ్ఞానంబకి నడిరోడ్డు మీద వార్నింగ్ ఇచ్చిన రౌడీ తండ్రి- తప్పు ఒప్పుకుని క్షమించమన్న జానకి


కళ్యాణ్ వెంటనే అప్పుకి ఫోన్ చేసి విషయం చెప్దామని అనుకుంటాడు. కనకం లిఫ్ట్ చేస్తుంది. కళ్యాణ్ ని మాట్లాడనివ్వకుండా వాగుతుంది. స్వప్న ఎక్కడ ఉందో రాజ్ అన్నయ్యకి తెలిసిపోయింది, అన్నయ్య ఆవేశం చూస్తుంటే స్వప్నని తీసుకొచ్చి గొడవ చేయాలనుకుంటున్నాడు. ముందు అన్నయ్య కంటే మీరు వెళ్ళి స్వప్నని తీసుకుని వెళ్లిపోండి పరిస్థితులు చక్కబడిన తర్వాత తీసుకురావచ్చని సలహా ఇస్తాడు. కనకం వెంటనే మీనాక్షికి ఫోన్ చేసి సాయం చేయమని అడుగుతుంది. మీనాక్షిని తీసుకుని స్వప్న దగ్గరకి బయల్దేరుతుంది. స్వప్నని తీసుకొచ్చి కళావతి నిజస్వరూపం తేల్చేస్తానని అనుకుంటాడు. అటు కావ్య కూడా స్వప్న దగ్గరకి బయల్దేరుతుంది. రాజ్, కనకం, పోలీసులు అందరూ ఒకేసారి హోటల్ దగ్గరకి వస్తారు. రాజ్ ని చూసి కనకం వాళ్ళు కనిపించకుండా కారులో ఉంటారు. అప్పుడే రాహుల్ వస్తూ హోటల్ బయట రాజ్ వాళ్ళని చూస్తాడు. సప్నా ఇక్కడ ఉన్న విషయం తెలిసిపోయిందని టెన్షన్ పడతాడు.