గుప్పెడంతమనసు ఏప్రిల్ 22 ఎపిసోడ్


ఫణీంద్ర, మహేంద్రను ఇంటికెళ్లి కలసిన సౌజన్యారావు..మీ కాలేజీని మా కాలేజీలో కలపడం ఇష్టంలేదన్న రిషి..మా కాలేజీని మీ కాలేజీలో కలపమన్నాడు...నాకు ఆ ప్రొపొజల్ నచ్చింది...మంచి పేరున్నడీబీఎస్టీ కాలేజీలో మా కాలేజీని కలపడం నాకు అంగీకారమే అంటాడు సౌజన్యారావు. 
ఫణీంద్ర: ఈ విషయం రిషితో కాకుండా మాకెందుకు చెబుతున్నారు
సౌజన్యారావు:రిషి కుర్రాడు ఆవేశంలో నా గుండు పగలగొట్టినా పగులగొడతాడు అందుకే పెద్దవాళ్లతో మాట్లాడదామని మిమ్మల్ని కలిశాను...మీరు రిషితో మాట్లాడండి..తను ఓకే అంటే ముందుకు వెళదాం..
మహేంద్ర: దీనివల్ల మీకెందుకు లాభం
సౌజన్యారావు: ఇది మీకు మంచి అవకాశం..మెడికల్ కాలేజీకోసం బిల్డింగ్ కట్టక్కర్లేదు, లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు..మా కాలేజీని మీ కాలేజీలో మెర్జ్ చేయడమే మిగిలింది..రిషి ఒప్పుకున్నట్టు నాకు పిలుపొస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పేసి వెళ్లిపోతాడు సౌజన్యారావు
దేవయాని: ఒప్పేసుకోండి మంచి ఆఫర్ కదా
ఫణీంద్ర: ఒప్పుకోవాల్సింది నువ్వు నేను కాదు..రిషి
దేవయాని: చాలా డబ్బులు సేవ్ అవుతాయి కదా.. 
మహేంద్ర: అసలు రిషితో కాకుండా మనతో చెప్పడమే తేడాగా ఉంది...


Also Read: రిషికి తెలియకుండా సంతకాలు పెట్టించిన జగతి-వసు, దేవయాని కొడుకు ఉచ్చులో రిషి పడినట్టేనా!


ఇంటికొచ్చిన రిషి...వెతుకుతూ ఉంటాడు.. పెద్దమ్మ ఎక్కడా కనిపించడం లేదని అడిగితే..అత్తయ్యకి ఒంట్లో బాలేదని చెబుతుంది ధరణి. హాస్పిటల్ కి వెళ్లకుండా ఇక్కడే ఉండడం ఏంటని రిషి వెళతాడు...ఇదంతా విన్న జగతి-వసుధారకి ఏదో అనుమానం వస్తుంది. సడెన్ గా ఆరోగ్యం బాగాలేకపోవడం ఏంటని వసుధార అంటే..నీ అనుమానం నాకు అర్థమైంది. ఇందాక సౌజన్యారావు వచ్చి ఏదో ప్రొపోజల్ పెట్టారట.. అది అక్కయ్యకి నచ్చింది..రిషిని ఒప్పించడంకోసం ఇప్పుడు నీరసం వచ్చిందని చెబుతుంది జగతి. ఎవరు ఏం చెప్పినా సౌజన్యారావు ప్రపొజల్ కి రిషి సార్ ఒప్పుకోరని స్ట్రాంగ్ గా చెబుతుంది వసుధార..


దేవయాని రూమ్ లోకి వెళ్లిన రిషి కంగారుపడిపోతుంటాడు..నీకు ఆరోగ్యం బాగాలేకపోవడం ఏంటని అడుగుతాడు.
దేవయాని: నేనుబావుంటే ఏం..బాగోపోతే ఏం..మీరంతా బావున్నారు కదా
రిషి: మీకు బాగోపోతే మేమెలా బావుంటాం
దేవయాని: నేను చెప్పే మంచి ఎవరికి నచ్చుతుంది..నా మాట ఎవరు వింటున్నారు
రిషి: ఇప్పుడు నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా
దేవయాని: నాకు సంతోషంగా లేదు..నువ్వైనా సంతోషంగా ఉండు
రిషి: మీకు ఒంట్లో బాగాపోవడం కాదు..మనసు బాలేదు..ఏమైందో చెప్పండి
దేవయాని:చెప్పినా ఏం లాభం...ఇంట్లో వాళ్లు నీ మనసు పాడుచేస్తారు..నేను మంచి చెప్పినా నువ్వు వినవు. ఇందాక సౌజన్యారావు వచ్చాడంటూ ప్రపొజల్ చెబుతుంది.. రూపాయి పెట్టుబడి లేకుండా అన్ని పనులు జరిగిపోతాయి కదా...
రిషి: పెదనాన్న డాడ్ ఏమన్నారు..
దేవయాని: వాళ్లు ఒప్పుకోలేదు..రిషి నిర్ణయం తీసుకుంటాడు అన్నారు


కోపంగా లేచి వెళ్లిపోయిన రిషి..హాల్లోకి వెళ్లి డాడ్, పెదనాన్న అని పిలుస్తాడు...పెద్దమ్మ చెప్పింది ఎందుకు ఒప్పుకోవడం లేదు.. ఎలాంటి సమస్యా లేకుండా లైసెన్స్ వస్తుంది కదా అని అందరకీ షాక్ ఇస్తాడు... దేవయాని పైశాచిక ఆనందం పొందుతుంది..  
ధరణి: ఆనందంగా నవ్వుకుంటున్న దేవయాని దగ్గరకు వెళ్లి ఏంటి అత్తయ్యా మీలోమీరే ముసిముసిగా నవ్వుకుంటున్నారని అడుగుతుంది..
( ఇదంతా దేవయాని భ్రమ)
రిషి..తండ్రి, పెదనాన్నకి థ్యాంక్స్ చెబుతాడు..నా అభిప్రాయాన్ని గౌరవించినందుకు అని చెబుతాడు. ఈ విషయంలోనే కాదు కాలేజీకి సంబంధించిన ఏ విషయంలో అయినా ఫైనల్ డెసిషన్ నీదే అంటాడు ఫణీంద్ర..
రిషి: మిమ్మల్ని MSRకలుస్తానన్నప్పుడు నాకు చెప్పాల్సింది అంటూనే...మీరు మంచి పని చేశారని పొగుడుతాడు..
దేవయాని మాత్రం రగిలిపోతూ ఉంటుంది... ధరణి నవ్వుకుంటూ ఉంటుంది...


Also Read: బైక్ పై ప్రేమపక్షుల విహారం, జగతికి థ్యాంక్స్ చెప్పనున్న రిషి, MSR ని లైట్ తీసుకున్న ఈగోమాస్టర్!


మరుసటి రోజు సౌజన్యారావు రిషి కోసం ఎదురుచూస్తుంటాడు.. నా డీల్ కి ఒప్పుకున్నట్టేనా అని సౌజన్యారావు అడిగితే..అదెప్పటికీ జరగదంటాడు రిషి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది కదా అంటే..నాకు స్టూడెంట్స్ భవిష్యత్ ముఖ్యం అని క్లారిటీ ఇస్తాడు. మీరు ఇప్పుడు ఒప్పుకుని మళ్లీ రంగులు మార్చరని ఏంటి గ్యారంటీ అని రిషి అంటాడు. అసలు మీరెందుకు భయపడుతున్నారన్న సౌజన్యారావు..మా కాలేజీని మీ కాలేజీలో కలిపేస్తానన్నా కద అంటాడు..మీరిప్పుడు కాదన్నా నాక పోయేది ఏమీ లేదు..నేను సెపరేట్ గా అప్లై చేసినేను పర్మిషన్ తెచ్చుకోగలను అని రెచ్చగొడతాడు... మీకన్నా ముందే నేను పర్మిషన్ తెచ్చుకుంటానుఅంటాడ రిషి..కాలేజీల పర్మిషన్ విషయంలో పోటీపడతారు... ఎవరికి ముందుగా పర్మిషన్ వస్తే ఆ కాలేజీలో మరో కాలేజీలో కలిపేయాలని సవాల్ చేసుకుంటారు...ఛాలెంజ్ ముగిసిన రోజు ఇద్దరం కలసి ప్రెస్ కి అనౌన్స్ చేద్దాం అని డీల్ కుదుర్చుకుంటారు. 


కాలేజీకి వెళ్లిన రిషి..జగతి, మహేంద్ర,వసుధారని కలుస్తాడు. 10 డేస్ లో పర్మిషన్ అని చెప్పడంతో అది కుదరని పని అంటారు మహేంద్ర,వసుధార. అసాధ్యం కాదుకదా అన్న రిషి..మన కాలేజీకి పేరు ప్రతిష్టలు గొప్పవి అంటాడు. అసలు ఆ సౌజన్యారావుతో ఛాలెంజ్ ఎందుకని జగతి అడుగుతుంది.