గుప్పెడంతమనసు ఏప్రిల్ 20 ఎపిసోడ్


సౌజన్యరావు ఎంఎస్ఆర్‌ కాలేజ్‌లో డీబీఎస్టీ కాలేజ్‌ను కలపాలని జగతీ, వసుల ముందు ప్రతిపాదిస్తాడు. అది జరగని పని అని జగతి అనడంతో ఎందుకు జరగదో నేనూ చూస్తానంటాడు సౌజన్యారావు. ఆ తర్వాత ఇంటికొచ్చి జగతి-వసు-మహేంద్ర ముగ్గురూ ఆవిషయం గురించి చర్చించుకుంటారు. 
జగతి: సౌజన్యరావు ఇలా చేస్తాడని ఊహించలేదని, తనలో ఏదో కుట్ర దాగుంది
వసు: అవును మేడమ్.. సౌజన్యరావు మన కాలేజ్‌లో రిషి సార్‌ను కలిసినప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా మాట్లాడారు 
జగతి: ఈ విషయం రిషికి చెప్పడం ఎలా 
మహేంద్ర:మెడికల్ కాలేజ్ వస్తుందని చాలా సంతోషపడుతున్నాడని, ఇప్పుడు ఈ విషయం చెబితే ఎంతలా బాధపడతాడో భయమేస్తుంది
ఇంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు.. ఏంటి మేడమ్ అందరూ అలా ఉన్నారని అడుగుతూ వెళ్లినపని ఏమైందని అడుగుతాడు. జగతి చెప్పేలోగా మళ్లీ అడ్డుపడిన రిషి..మీరెళ్లాక పని జరగకుండా ఉండదులెండి అనేసే వసుని బయటకు రమ్మని అడుగుతాడు.


Also Read: వసుధారపై సీరియస్ అయిన రిషి, నిజస్వరూపం బయటపెట్టిన సౌజన్యారావు


బయటకువచ్చిన వసుధారతో మనం కార్లో వెళ్లడం లేదు బైక్ పై వెళదాం అంటాడు రిషి. ఎందుకు సార్ అంటే..కొన్ని కొన్నింటికి సమాధానాలు ఉండవు.. కొన్నికొన్ని ఉత్సాహాలకు కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా వసుధార అని రిప్లై ఇస్తాడు. కార్లో సేఫ్ కదా అంటే బైక్ పై కూడా సేఫ్ గా వెళ్లాలనే రెండు హెల్మెట్లు తీసుకొచ్చానంటాడు. ఎక్కడికి అని అడిగితే చెబుతాను పద..నీకు చెప్పకుండా తీసుకెళ్లాలి అనుకుంటున్నాను వస్తావా , ఎక్కడికి వెళ్లినా ఎంతదూరం వెళ్లినా కలసే వెళదాం...గమ్యం గురించి ఆలోచించకు.. ప్రయాణాన్ని ఆస్వాదించూ అంటూ వసుకు హెల్మెట్ తొడుగుతాడు రిషి.ఇదంతా బాల్కనీ లోంచి చూసిన దేవయాని రగిలిపోతుంటుంది


భర్త ఫణీంద్ర దగ్గరకు వచ్చి కారులో వెళ్తేనే వెయ్యి మంది చూస్తారు.. ఇప్పుడు బైక్‌లో వెళ్లడమేంటని కోపగించుకుంటుంది. నాకు అసలు ఈ ఇంట్లో పద్ధతులు..ముఖ్యంగా ఈ వసుధార వాలకం నచ్చట్లేదు అంటుంది.
ఫణీంద్ర: వాళ్లు ఏదోపనిమీద వెళుతున్నారు..మధ్యలో నీకెందుకు..బయట జనాలు ఏదోఅనుకుంటారని ఆలోచిస్తే అసలు ఇంట్లోంచేవెళ్లకూడదు
దేవయాని: వసుధార పద్ధతి నచ్చడం లేదు
ఫణీంద్ర: నీకు నచ్చడం ఎందుకు..అందరూ నీకు నచ్చాలని లేదు..వాళ్లని ఏదో ఒకటి అనాలని చూస్తుంటావ్..
దేవయాని: అది కాదండీ
ఫణీంద్ర:నువ్వు రిషిని పెంచిన తల్లివి, అందుకు వాడు గౌరవిస్తున్నాడు. తన జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకుని కంట్రోల్ లో పెట్టుకోవాలని చూడకు, కాలం మారింది..దానికి తగ్గట్టుగా నువ్వు మారాలి
ఇంతలో ధరణి రావడంతో..కాస్త కాఫీ తీసుకురమ్మని చెబుతాడు. మీకు ఏమైనా తీసుకురావాలా అని దేవయానిని అడిగితే విషం ఉంటే ఇవ్వు అంటుంది దేవయాని..అయ్యో అత్తయ్యగారు విషం ఇంట్లో లేదనకుంటా అంటూ అక్కడనుంచి వెళ్తుంది.


రిషి- వసులు డీబీఎస్టీ కాలేజ్‌కి వస్తారు. వసుధార పదే పదే అడిగినా రిషి సమాధానం చెప్పడు. వసు కళ్లుమూసి రూమ్ లోకి తీసుకెళ్లి ఓ బోర్డు చూపిస్తాడు..అది చూసిన వసు షాక్ అవుతూ సౌజన్యరావుతో జరిగిన మీటింగ్ గురించి చెప్పాలా? వద్దా? అని ఆలోచిస్తుంటుంది. ఇదేనా సార్ సర్ ప్రైజ్ అని అడుగుతుంది. ఎలా ఉందని అడిగితే చాలా బావుందని చెబుతుంది. ఆ బోర్డు చూసి విషయం చెబుతామా లేదా అని ఆలోచిస్తున్న వసును చూసిన రిషి ఏమైందని అడుగుతాడు...సౌజన్యారావుని కలసిన విషయం చెబుదాం అనేలోగా అవన్నీ ఇప్పుడెందుకు అనేస్తాడు. ఇది మీరు విని తీరాలి అనడంతో చెప్పు అంటాడు
వసు: సౌజన్యరావు ప్రపోజల్ గురించి రిషికి వివరిస్తుంది
రిషి: షాక్ అయిన రిషి.. ఎంఎస్ఆర్ కాలేజ్‌లో డీబీఎస్టీ కాలేజ్‌ను కలపాలా నో వే ...నువ్వెందుకు ఈ విషయంలో బాధపడుతున్నావు
వసు: మెడికల్ కాలేజ్‌పై మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు అందుకేన
రిషి: ఆయనేదో ప్రపోజల్ తీసుకొచ్చాడని సరేనన్నాను. కానీ మనసులో ఇంత దురుద్దేశం ఉంటుందని మనం ఊహించలేం కదా. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది
వసు ఆ బోర్డు తీసేందుకు ప్రయత్నిస్తే రిషి  వద్దని వారిస్తాడు
రిషి: ఎంఎస్ఆర్ రాకముందు కూడా నా మనసులో డీబీఎస్టీ మెడికల్ కాలేజ్ గురించి ఆలోచన ఉంది, ఇప్పుడు అతను లేకపోయినా.. నా మనసులో అదే ఉంది. ఎవరో వచ్చారని, ఎవరో వెళ్లిపోయారని మనం కంగారు పడాల్సిన అవసరం లేదని, మన పని మనం చేసుకుంటూ వెళ్తాం . డీబీఎస్టీ కాలేజ్ నా డ్రీమ్ అది కచ్చితంగా స్టార్ట్ అవుతుంది. కానీ కొంచెం సమయం పట్టొచ్చని చెప్పేసి వెళ్లిపోతాడు


Also Read: ఏప్రిల్ 20 రాశిఫలాలు, ఈ రాశివారు కొన్ని విషయాల్లో అయినా గోప్యత పాటించాలి!


రిషి చాలా కూల్ గా రియాక్టైన విషయాన్ని జగతీ, మహేంద్రకు చెప్పిన వసుధారతో..రిషి బాధపడలేదా అని అడుగుతారు జగతి-మహేంద్ర. బాధైతే లోపల ఉంది కానీ.. బయటకు మాత్రం చూపించలేదు. పైగా నాకు ధైర్యం చెప్పారంటుంది.
జగతి: డీబీఎస్టీ మెడికల్ కాలేజ్ ఎలాగైనా ప్రారంభించాలని, చాలా మంది పేద పిల్లలకు సహాయం చేసినవారం
మహేంద్ర: ఇది అంత సులభం కాదు, సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ల నుంచి పర్మిషన్ తీసుకోవాలి... ఇంకా చాలా సమస్యలు ఎదురవుతాయి
జగతి: మంచి పనులు చేసేటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి, అలా అని ప్రతి సమస్యకు భయపడుతూ అడుగులు వెనక్కేయకూడదు. రిషి ఆనందం కోసం మనం ఏం చేయాడానికైనా సిద్ధంగా ఉండాలి
ఇదంతా బయట నుంచి రిషి వింటాడు.. జగతికి థ్యాంక్స్ చెప్పాలిఅనుకుంటాడు


మరుసటి రోజు రిషి, వసులు కాలేజ్‌కు బయల్దేరబోతారు. ఇంతలో వసు.. రిషి గుండీలు సరిగ్గా పెట్టుకోలేదని గమనించి సరిచేస్తుంటుంది..
వసు: నిజం చెప్పండి సార్ మెడికల్ కాలేజ్ గురించి ఆలోచిస్తున్నారు కదూ. ఇలాగేతై ఎలా సార్ 
రిషి: నా గురించి మీరంతా బాధపడుతున్నారు కదూ.. రాత్రి నువ్వు, మేడమ్ మాట్లాడుకున్న మాటలను విన్నాను. మీరిద్దరూ నా గురించి, కాలేజ్ గురించి ఆలోచిస్తున్నారు. ఏదోకటి చేయాలని తపన పడుతున్నారు. నా తరఫున మేడమ్‌కు థ్యాంక్ చెప్పు
వసు:మీరే చెబితే బాగుంటుంది...నేను చెప్పినా, నువ్వు చెప్పినా ఒకటే వసుధార అని రిషి అంటే...నేను చెప్పేదనికంటే మీరు చెబితేనే మేడమ్ ఎక్కువగా సంతోషిస్తారంటుంది వసుధార.