గుప్పెడంతమనసు ఏప్రిల్ 19 ఎపిసోడ్


దేవయానిని ఎదిరించి వసుధారని తీసుకెళ్లి రిషి..మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతాడు.  ‘ఇక్కడ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ వస్తుంది వసుధార.. ఇక మెషిన్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ కూడా కంట్టించేస్తే అయిపోతుంది కదా’ అంటాడు రిషి. ‘రెండు ఒకేసారి వద్దు సార్ ఇబ్బంది అవుతుంది’ అంటూ సలహా ఇస్తుంది వసు. ‘అనుకున్నది అనుకున్నట్లే జరిగి డీబీఎస్‌టీ కాలేజ్ పేరు మీద మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయితే.. నా కల నెరవేరినట్లే.. అంతకంటే సంతోషం ఉండదు వసుధార’ అంటాడు రిషి సంబరంగా. ‘సార్ మీరు చాలా సహృదయంతో ఆలోచిస్తున్నారు.. మీరు సంతోషంగా ఉండటానికి నేను ఏం చేయడానికైనా రెడీ ఉన్నాను సార్’ అంటుంది వసు. ఇంతలో గాలి వచ్చి పేపర్లు అన్ని కిందకు పడిపోవడంతో వసుధార తీసుకోవడానికి వెళుతుంది. పేరప్లు అందుకుంటుండగా వసుధార కిందకు జారిపోబోతుంది...వెంటనే పట్టుకున్న రిషి వసుధారపై కోప్పడతాడు. నీకు అసలు బుద్ధుందా. పేపర్లు పడితే పడనివ్వు నీకు ఏమైనా అయితే నేనైమోపోవాలి అని సీరియస్ అవుతాడు.. మీరు ఉన్నారు కదా సార్ అనడంతో...కోప్పడి ఇక్కడ నుంచి వెళ్ళిపో వసుధార అని అరుస్తాడు. వసుధార బుంగమూతి పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రిషి కూడా రూమ్ కి వెళ్లిపోతాడు


Also Read: ఏప్రిల్ 19 రాశిఫలాలు, ఈ రాశివారు సన్నిహితుల్లో కొందరితో జాగ్రత్తగా వ్యవహరించాలి


రిషి: అనవసరంగా ఎక్కువగా కోపడ్డానా అనుకుంటూ వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు
వసు:అంతగా కోప్పడాల్సిన అవసరం ఏంటి
రిషి: కోప్పడక ఏం చేస్తా ముందు వెనక చూసుకోవాలి కదా
వసు: వసుధార కూడా అదే విషయం ఆలోచిస్తుంది. కాసేపు సీరియస్ అయినా...సరేలే సార్ ఏం చేసినా కూడా నా కోసమే కదా చేసింది అనుకుంటూ బుంగమూతి పెట్టుకుని కూర్చుంటుంది.
కోపం వచ్చిందా వసుధారా, నీకోసమే కదా...నీకేమైనా అయితే అంటూ రిషి వరుస మెసేజెస్ చేస్తాడు. వసుధార మాత్రం అవన్నీ చూసి మురిసిపోతుంటుంది కానీ రిప్లై ఇవ్వదు. ఇన్ని మెసెజెస్ పెడుతున్నా రిప్లై ఇవ్వడంలేదు...అందుకే నిన్ను పొగరు అంటానని అనుకుంటూ నిద్రపోతాడు రిషి


మర్నాడు ఉదయాన్నే వసు ఏదో ఫైల్ వెతుకుతుంటే రిషి వస్తాడు.
రిషి: వసుధారా.. వెళ్దామా.. మేడమ్ వాళ్లు వెళ్లిపోయారు.. కాలేజ్‌లో ఇంజెనీర్ కూడా వచ్చేశాడట.. నేను త్వరగా వెళ్లాలి’ 
వసు: నాకు ఇంకా టైమ్ పడుతుంది సార్.. ఆడపిల్లని కదా సార్.. లేట్ అవుతుంది.. కావాలంటే మీరు వెళ్లండి’ 
రిషి: అమ్మయ్యా.. అయితే నేను వెళ్తాను నువ్వు వచ్చెయ్
బెట్టుగా ముఖం పెట్టిన వసుధార..నువ్వు ఎలా వస్తావ్ అని కూడా అడగలేదు...ప్రేమగా బుజ్జగిస్తే ఏం పోతుందట అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత ఆ ఫైల్ కాలేజీలోనే ఉండిపోయిందని గుర్తుచేసుకుని నడుటుకుంటూ వెళుతుంది..దారిలో రిషి వెయిట్ చేస్తుంటాడు. రిషిని చూసినా ఆగకుండా కావాలనే వెళ్లిపోతుంది కానీ..మళ్లీ వెనక్కు తిరిగి వస్తుంది వసుధార..కాసేపు ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటారు.  రిషి కారు స్టార్ట్ చేయడంతో ఆ తర్వాత వసుధార కారెక్కుతుంది...
రాను అన్నావ్, అలిగాను అన్నావ్ మరి కారెందుకు ఎక్కావ్ అని రిషి అంటే..అవును సార్ అన్నారు..కానీ ప్రేమ సార్ అని సమాధానం ఇస్తుంది. 


Also Read: గంగా పుష్కరాలకు కాశీ వెళుతున్నారా - టెంట్ సిటీలో రూమ్స్ ఇలా బుక్ చేసుకోండి


ఆ తర్వాత రిషికి కాల్ చేసిన సౌజన్యారావు నా ప్రపోజల్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. ఈ రోజు వస్తావా?’ అంటాడు. ‘సార్ ఈ రోజు నేను కొంచెం బిజీ.. వసుధార, జగతీ మేడమ్ మీ దగ్గరకు వస్తారు.. వాళ్లు మీతో మాట్లాడతారు.. వాళ్లు వేరు నేను వేరు కాదు సార్’ అంటాడు. జగతీ, వసు ఇద్దరూ సౌజన్యరావు దగ్గరకు వెళతారు. ప్రపొజల్ మొత్తం చెప్పిన సౌజన్యారావు మీ కాలేజీ మా కాలేజీలో కలిపేయాలి అనగా జగతి అది కుదరదు అని క్లియర్ గా చెప్పేస్తుంది. మీరు ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకోవడంతో పాటు రిషి ని కూడా ఒప్పించాలని బెదిరిస్తాడు. అప్పుడు వసుధార ఇదే మీ ప్రపోజల్ అయితే ఇంకొకసారి మాతో మాట్లాడకండి ఇంతటితో ఆపేస్తేనే మీకు మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఒక్క నిమిషం నేను డైరెక్ట్ గా రిషితో ఈ విషయం గురించి మాట్లాడతాను అనగా నా కొడుకు కాలేజీ ని ఊపిరిగా ఫీల్ అవుతున్నాడు మీ కల ఎప్పటికి నెరవేరదు అని అంటుంది జగతి.