వేద యష్ ని చేయి పట్టుకుని మెల్లగా నడిపించడం చేస్తుంది. భర్తని దగ్గరుండి బాగు చేసుకుంటుంది. యష్ ఎప్పటిలా మామూలు మనిషి అవుతాడు. సూట్ వేసుకుని స్టైల్ గా రెడీ అయిపోతాడు. నువ్వు బెడ్ మీద పడుకున్నప్పుడు మమ్మీ అసలు నిద్రపోలేదు, రాత్రంతా నీ దగ్గరే కూర్చుని ఉండేదని ఖుషి చెప్తుంది. మన పాత యష్ మన కళ్ళ ముందు నిలబడ్డాడు అంటే అది మన కోడలు వల్లేనని మాలిని వాళ్ళు అంటారు. వేద పూజ చేసి హారతి యష్ కి ఇస్తుంది. అల్లుడు ఇంత త్వరగా మామూలు మనిషి అయ్యాడంటే నువ్వే వేద అని సులోచన మెచ్చుకుంటుంది. ఒక బిడ్డని తల్లి భర్తని భార్య బాగా చూసుకోకపోతే తప్పు అవుతుంది కానీ చూసుకుంటే తప్పు కాదు అది బాధ్యతని వేద చెప్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే సంతోషంగా చూడాలని అనుకుంటున్నానని మురిసిపోతుంది.


యష్ ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉండగా విన్నీ వచ్చి కంగ్రాట్స్ చెప్పి చాలా త్వరగా కోలుకున్నావని అంటాడు. కానీ యష్ మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటాడు. నువ్వు రాంగ్ థింగ్స్ చేస్తున్నావని సీరియస్ అవుతాడు.


Also Read: మురారీకి నిజం చెప్పిన కృష్ణ - గౌతమ్ పెళ్లి నందినితో జరుగుతుందా?


యష్: నువ్వు నీ విషయంలో వేద విషయంలో రాంగ్ థింక్ చేస్తున్నావ్.. ఆరోజు మా మ్యారేజ్ డే రోజు వేద నిన్ను హగ్ చేసుకుని ఐలవ్యూ చెప్పిన విషయం నేను చూడలేదు అనుకున్నావా


విన్నీ: నువ్వేనా ఇలా మాట్లాడేది. ఆరోజు వేద హగ్ చేసుకుని ఐలవ్యూ చెప్పింది కానీ ఏ సందర్భంలో చెప్పిందో తెలుసా? వేదూ ఆ హగ్ ఇచ్చింది నాకు కానీ ఇవ్వాలని అనుకుంది నీకు. ఐలవ్యూ చెప్పాలని అనుకుంది నీకు. నీమీద ఉన్న ప్రేమని నాతో షేర్ చేసుకుంది అంతే. వేద విషయంలో నా తప్పు ఉండవచ్చు ఏమో కానీ తన ఏమి లేదు. ప్రతి సందర్భంలో నీ ఆలోచనలో తప్పు ఉందేమో కానీ వేద ప్రవర్తనలో ఎలాంటి పొరపాటు లేదు. ప్రపంచంలో ఏ భార్య ఏ భర్తని ప్రేమించనంత గొప్పగా తను నిన్ను ప్రేమిస్తుంది. కళ్ళతో చూసేవి నిజాలు కావు మనసుతో చూడాలి. వేదలాంటి గొప్ప భార్య దొరకడం నీ అదృష్టం. ఇది నిజం వేదూని మిస్ చేసుకుంటే నువ్వు నీ లైఫ్ ని మిస్ చేసుకున్నట్టే. ఒక ప్రశ్న అడుగుతాను అసలు వేద నిన్ను పెళ్లి ఎందుకు చేసుకోవాలి. నీకు ఆల్రెడీ పెళ్లై ఇద్దరు పిల్లలు అయినా నిన్ను ఎందుకు చేసుకోవాలి. తను నీకోసం చాలా త్యాగం చేసింది. నీ భార్యగా, నీ బిడ్డలకు తల్లిగా తన జీవితం మొత్తం ఇచ్చేసింది. నువ్వు చేయగలిగింది ఒక్కటే తనని ప్రేమగా చూసుకోవడం అంతకమించి ఏమి చేయనక్కర్లేదు తను ఏమి కోరుకోవడం లేదు


Also Read: రాజ్ ముందు కావ్యని చెడ్డదాన్ని చేసిన స్వప్న- భార్యని శాశ్వతంగా పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోతాడా?


మాళవిక నెక్లెస్ తీసుకొచ్చి చిత్రకి ఇచ్చి అభి డార్లింగ్ ఇవ్వమన్నాడని చెప్తుంది. చిత్ర మన ఎంప్లాయ్ మాత్రమే కాదు నా బామ్మర్దికి కాబోయే భార్య కూడా అందుకే ఈ స్పెషల్ గిఫ్ట్ అని అభి అంటే వద్దని చిత్ర అంటుంది. కానీ మాళవిక నువ్వు ఈ గిఫ్ట్ తీసుకోవాల్సిందేనని బలవంతంగా తన మెడలో వేస్తుంది. ఎప్పటికైనా మాళవికకి నిజం తెలిసి ఛీ కొడుతుందని చిత్ర కోపంగా తిడుతుంది. నీతో ఎంత తప్పుగా ప్రవర్తించానని యష్ మనసులోనే బాధపడతాడు. వేద యష్ కి ప్రేమగా భోజనం వడ్డిస్తుంది. కానీ యష్ మాత్రం చేసిన తప్పుకి పశ్చాత్తాపడతాడు. యష్ కి చెయ్యి నొప్పిగా ఉండేసరికి వేదనే ఫుడ్ తినిపిస్తుంటే కన్నీళ్ళు పెట్టుకుంటాడు.