హనుమాన్ చాలీసా హనుమంతుడిని కొలిచే భక్తి గీతం. హనుమాన్ చాలిసా పఠించడం వల్ల దరిద్రం తొలగి పోయి అదృష్టం వరిస్తుందని నమ్మకం. ఇది రామ భక్తుడైన హనుమంతుడిని స్తుతించే 40 కవితా పద్యాలుగా చెప్పుకోవచ్చు. హనుమంతుడు అంటేనే ధైర్యానికి మరో పేరు. ఆయన పేరు తలచుకుంటేనే భయం పటాపంచలవుతుందని భక్తుల నమ్మకం. తులసిదాసును మోఘల్ చక్రవర్తి ఔరంగజేబు బంధించినపుడు తులసీదాసు దీనిని స్వరపరచి పాడుకున్నట్టు చెబుతారు. నీ స్వామి ఎక్కడున్నాడో చూపించమని తులసీదాసును ఔరంగజేబు సవాలు చేసినపుడు కేవలం భక్తి మాత్రమే రాముడిని చూడగలదని ఆయన సమాధానం ఇచ్చారట. అందుకు కోపగించుకున్న చక్రవర్తి అతడిని బంధించి కటకటాల్లో పెట్టినట్లు చరిత్ర చెబుతోంది.


ఇది ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఉదయం, స్నానానికి ముందు, స్నానం తర్వాత ఎలాంటి నియమం లేకుండా ఎప్పుడైనా చదువుకోవచ్చు. కానీ సూర్యాస్తమయం తర్వాత చదువుకోదలచుకుంటే కాళ్లు, చేతులు కడుక్కొని చదవడం మంచిది. చాలీసా చదవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని పండితులు చెబుతున్నారు.



  • హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాలోని శ్లోకాలను దోహాలు అని కూడా అంటారు.

  • కేవలం జయ హనుమాన జ్ఞానగుణ సాగర అని వల్లెవేయడం వల్ల జ్ఞాన వంతులవుతారు. ఈ జ్ఞానం జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు దోహదం చేస్తుంది.

  • మహా వీర విక్రమ బజరంగీ అని మొదలయ్యే మూడో దోహా ఆత్మబలాన్ని పెంచుతుంది.

  • ఏడు, ఎనిమిది దోహాలు రాముడి ఆత్మ తత్వాన్ని వివరిస్తాయి. ఇవి ఆ దివ్యపురుషుడికి మిమ్మల్ని దగ్గర చేస్తాయి.

  • 14,15 దోహాలు కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తాయి. పనులు సామర్థ్యంతో నిర్వహించి మంచి పేరును ఆర్జించేందుకు దోహదం చేస్తాయి.

  • 11వ దోహా చదవడం వల్ల పాముల వంటి విషజంతువుల భయం తొలగిపోతుంది.

  • 16,17 దోహాలు చదవడం వల్ల కార్యసిద్ధి, కోరుకున్న స్థాయిని అందుకోవడానికి మార్గాలు సుగమం అవుతాయి.

  • 20 వదోహా సవాళ్లను ఎదుర్కొనే బలాన్ని పెంపొందిస్తుంది. అడ్డంకులు తొలగి లక్ష్యాలను సాధిస్తారు.

  • 24 వ దోహ చాలా ముఖ్యమైంది. ఇది భూత పిశాచాలు, చేతబడి ప్రభావాలు పడకుండా అడ్డుకుంటుంది.

  • ఇలా చాలీసాలోని ప్రతి దోహా జీవితానికి అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి  హనుమాన్ చాలీసాకు చాలా ప్రాముఖ్యత ఉంది.

  • హనుమాన్ చాలీసా ఉఛ్ఛారణ దోషాలు లేకుండా చదవం ఒక్కటే దీనికి ఉండే నియమం.

  • కానీ చాలా మంది చాలీసా చదివే సమయంలో కొన్ని పదబంధాలను తప్పుగా పలుకుతారు. వాటిని తెలుసుకుని సరిగ్గా పలకడం అవసరం.

  • హనుమాన్ చాలీసాలోని ఒక పద్యంలో శంకర్ సువాన్ ప్రస్తావన ఉంటుంది. అది శంకర్ సవాన్ కాదు. శంకర్ స్వయం కేసరీ నందన్ అని ఉండాలి అని పండితులు అంటున్నారు.

  • మరో శ్లోకంలో సబ్ పర్ రామ్ తపస్వీ రాజా అని ఉంటుంది. అక్కడ సర్ తాజా అని ఉండాలని అంటున్నారు.

  • సదా రహో రఘుపతికే దాసా అని చెప్పే 32 వ శ్లోకం నుంచి సదర్ హూ రఘుపతికే సాదా అయి ఉండాలని పండితులు చెబుతున్నారు.