నందిని పెళ్లి లగ్న పత్రిక రేవతి చూస్తుంది. తనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారన్న మాట తన ఇష్టాఇష్టాలతో సంబంధం లేదా అని ఆవేశంగా దాన్ని తీసుకుని కృష్ణ దగ్గరకి వచ్చి చూపిస్తుంది. అది చూసి కృష్ణ షాక్ అవుతుంది. నందిని పెళ్లి కిరణ్ తో అందుకే తనని మాయం చేశారు. అంటే అప్పటి వరకు అజ్ఞాతంలో ఉంచేస్తారా? పెద్దత్తయ్య తెలివిగా నందిని అమెరికా వెళ్ళిందని అనుకునేలా చేసి రహస్యంగా పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారా అని ఆశ్చర్యపోతుంది. నందిని ఇప్పటికీ సిద్ధూని ప్రేమిస్తుంది. మనసులో ఉన్న గౌతమ్ సర్ ని కోరుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలని కృష్ణ బాధపడుతుంది. కన్నాకూతుర్ని లెక్క చేయని వాళ్ళు నిన్ను ఏం చేస్తారో అని కంగారుగా ఉందని రేవతి భయపడుతుంది.
ఈ విషయం ఏసీపీ సర్ కి ఇప్పటి వరకు తెలియదు నేను కూడా చెప్పలేదు. అసలు ఏసీపీ సర్ మైండ్ లో ఏముందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది.
నందిని మనం ఎన్ని అనుకున్నాం ఎన్ని కలలు కన్నాం ఇద్దరం పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని ఎంతగా కోరుకున్నాం కానీ మీ వాళ్ళు నాకు నిన్ను దూరం చేసి నీకు మతిస్థిమితం లేకుండా చేశారు. అటువంటి టైమ్ లో కృష్ణమ్మ కనిపించింది మనల్ని కలపడానికి ట్రై చేస్తుంది. ఈసారి ఏం జరుగుతుందో చూద్దామని నందిని ఫోటో చూస్తూ గౌతమ్ బాధపడతాడు. కృష్ణ జరిగినవన్నీ తలుచుకుని ఆలోచిస్తూ ఉండగా మురారీ వస్తాడు. తినిపిస్తే తప్ప తినడం కూడా రాదు. తనని ఎవరూ దగ్గరకు తీయరు. ఇక ఎంత కాలం నేను నందిని కోసం పోరాడాలి. మీరంతా ఉండి కూడ ఎవరూ ప్రశ్నించలేదని కృష్ణ అడుగుతుంది. నీ వాదనలో నిజం ఉన్నా పెద్దమ్మని ఎవరు ఇంతవరకు నిలదీయలేదు అందుకే కోపం వచ్చింది సోరి కృష్ణ అంటాడు. గౌతమ్ పెళ్లి టాపిక్ తీస్తాడు. అది జరిగేలా లేదని అంటుంది.
మురారీ: నేను మాట ఇచ్చాను కదా ఎవరినైన ఎదిరిస్తాను
కృష్ణ: మీ పెద్దమ్మని ఎదిరించగలరా? గౌతమ్ సర్ ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఎవరినో కాదు నందినిని అనేసరికి మురారీ కూలబడిపోతాడు. నిజం మాట్లాడుతున్నా ఏసీపీ సర్
మురారీ: నా వెనుక ఇంత జరుగుతుందా? మీ గౌతమ్ సర్ మన నందిని ప్రేమించుకోవడం ఏంటి?
కృష్ణ: మీరు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఇది జరిగింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం గౌతమ్ సర్ వాచ్ మెన్ కొడుకు అని తక్కువ స్థాయి వాడని మీ పెద్దమ్మ వాళ్ళని విడదీయడం. ఆ షాక్ లో నందికి మతిస్థిమితం కోల్పోవడం జరిగింది. ఇదంతా జరిగినప్పుడు మీరు లేరు. ఇందులో మీ నాన్న, బాబాయ్ మీ పెద్దమ్మకి సాయం చేశారు. కావాలని నేను గౌతమ్ సర్ ని ఇంటికి తీసుకొచ్చాను అప్పటి నుంచి ఇంట్లో కోల్డ్ వార్ మొదలయింది అందుకే నందిని దాచి పెట్టారు. నందిని గౌతమ్ ని పెళ్లి చేసుకుంటే మామూలు మనిషి అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఈ పెళ్లి చేస్తారా? మీ పెద్దమ్మకి వ్యతిరేకంగా పెళ్లి చేయగలరా?
మురారీ: నంది భవిష్యత్ కోసం నువ్వు చేసిన ప్రయత్నాలు తెలిశాక ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి జరుగుతుంది నేను నీకు మాట ఇస్తున్నా.