గుప్పెడంతమనసు ఏప్రిల్ 21 ఎపిసోడ్


సౌజన్యరావు పెట్టిన ప్రపోజల్ గురించి తెలుసుకున్న రిషి లైట్ తీసుకుంటాడు. మరోవైపు జగతి అండ్ కో మాటలు విని రిషి సంతోషిస్తాడు. మేడం కి నా తరపున థ్యాంక్స్ చెప్పు అని వసుధారతో అంటే మీరే చెప్పండి సార్ మేడం సంతోషిస్తారు అని రిప్లై ఇస్తుంది వసుధార. నేనేమైనా తప్పుచేస్తున్నానా అని రిషి అడిగితే..మీరు ఏ విషయంలోనూ తప్పు చేయరు సార్ అని క్లారిటీ ఇస్తుంది వసుధార. ఇంతలో రిషికి కాల్ వస్తుంది.. మాట్లాడిన తర్వాత మీరు కాలేజీకి వెళ్లండి వసుధారా నేను వస్తానంటూ వెళ్లిపోతాడు. ఎక్కడికి అంటేమాత్రం చెప్పడు..


Also Read: బైక్ పై ప్రేమపక్షుల విహారం, జగతికి థ్యాంక్స్ చెప్పనున్న రిషి, MSR ని లైట్ తీసుకున్న ఈగోమాస్టర్!


సౌజన్యారావుని కలుస్తాడు రిషి
సౌజన్యారావు: ఇంకా ఏ సమాధానం చెప్పలేదేంటి
రిషి: ఏం సమాధానం కావాలి
సౌజన్యారావు:  ‘అదే రిషి గారు మీ వాళ్లకి నా ప్రపోజల్ గురించి చెప్పాను కదా.. అప్పటి నుంచి మీ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నా’
రిషి:‘అది మీ మూర్ఖత్వం.. పనికి మాలిన ప్రపోజల్ గురించి సమాధానం వస్తుందని ఎలా ఊహిస్తారు?’
సౌజన్యారావు:‘ఏం మాట్లాడుతున్నారు రిషి గారు?’
రిషి: మా జగతీ మేడమ్.. వసుధార చెంప దెబ్బ కొట్టినట్లుగా అక్కడే ఆన్సర్ చెప్పారు కదా? మళ్లీ నా సమాధానం కోసం ఎదురు చూడటం ఏంటీ?’
సౌజన్యారావు: ‘మిస్టర్ రిషీంద్ర భూషణ్ ఒక వేళ మీ మనసేమైనా మారుతుందేమో.. మార్చుకుని ఒప్పుకుంటారేమో అని’
రిషి: ‘నా మనసు మారదు.. నీ ప్రపోజల్ నాకు నచ్చలేదు.. గౌరవప్రదమైన విద్యా సంస్థకి గౌరవమైన హోదాలో ఉన్నాను కాబట్టి.. పద్దతిగా మాట్లాడుతున్నాను.. లేదంటే మీరు ఇచ్చిన ప్రపోజల్‌కి నా రియాక్షన్ వేరేలా ఉండేది
సౌజన్యారావు: ‘ఉడుగురక్తం.. తప్పులేదు ఇలా మాట్లాడొచ్చు.. కానీ నేను మీకు చెప్పేది ఒకటే.. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేని వయసులో ఉన్నారు.. ఈ ఫీల్డ్‌లో మీకంటే నాకే అనుభవం ఎక్కువ.. మీ కాలేజ్‌ని మా కాలేజ్‌లో కలిపేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి’ 
రిషి: ‘ఎవరికి మీకా నాకా?’
సౌజన్యారావు: కావాలంటే ఒకసారి బోర్డ్ మీటింగ్ పెట్టించండి.. నేను మాట్లాడతాను’ 
రిషి: ‘ఇంక ఆపుతారా? ఏంటి మీరు మాట్లాడేది? ఇప్పుడే చెబుతున్నాను ఇంకోసారి ఇలాంటి ప్రపోజల్స్ తెస్తే మర్యాదగా ఉండదు’ ‘అయినా మీరు నాకు అవకాశాలు ఇచ్చేదేంటీ? నేనే మీకు ఓ అవకాశం ఇస్తాను తీసుకోండి’. ‘మా డీబీఎస్‌టీ కాలేజే మెయిన్‌గా ఉంటుంది.. మీ కాలేజ్‌ని మా కాలేజ్‌లో కలిపేయండి.. ఇదే నేను మీకు ఇచ్చే అవకాశం’ 
సౌజన్యారావు షాక్ అవుతాడు


Also Read: కాశీ (వారణాసి) ముందు పుట్టిందా - భూమి ముందు పుట్టిందా, మీకు తెలుసా ఇది!


ఇంటికి వచ్చిన రిషి.. జరిగిందంతా మహేంద్ర, జగతి, ఫణీంద్రకు చెబుతాడు... మంచిపని చేశావ్ రిషి ఇకవాడు మన జోలికి రాడని అంటారు.  మనమే సొంతంగా మెడికల్ కాలేజ్ పెట్టేసుకుందాం...పర్మిషన్స్ అన్నీ నేను చూసుకుంటాను నువ్వు దిగులుపెట్టుకోవద్దని ధీమాగా చెబుతాడు.  వసు, జగతీ ముందుకు వచ్చిన రిషి.. ‘వసుధారా.. మేడమ్.. ఆ ఎమ్ఎస్‌ఆర్‌కి సరైన సమాధానం ఇచ్చి వచ్చాను.. ఇక ఆలోచించాల్సిన పనిలేదు’ అనేసి వెళ్లిపోతాడు.


సౌజన్యరావుకి శైలేంద్ర భూషణ్(SB -దేవయాని కొడుకు కావొచ్చు) మెసేజ్ చేస్తాడు. ‘ఏమైంది మీటింగ్‌లో వాడు ఓకే చేశాడా మన ప్రపోజల్‌కి?’ అని మెసేజ్ చేస్తాడు. ‘లేదు సార్.. వాడు అసలు ఒప్పుకోవట్లేదు.. కావాలంటే ఎమ్ ఎస్ ఆర్ కాలేజ్‌నే వాళ్ల కాలేజ్‌లో కలపమన్నాడు’ అని రిప్లై ఇస్తాడు సౌజన్యరావు. ‘మరి ఇంకేం.. అయితే కలిపేయండి.. అదే మనకు అవకాశంగా మారుతుంది’ అని రిప్లై ఇస్తాడు SB. ఓకే అంటాడు సౌజన్యరావు. వెంటనే ఫణీంద్రకు కాల్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని రిక్వస్ట్ చేయడంతో ఫణేంద్ర సరే అంటాడు. 


జగతీ, వసులు.. రిషి కోసం మనం ఏమైనా చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. 
జగతి: రిషికి తెలియకుండా ఏదో ఫైల్ సిద్ధం చేసిన జగతీ...‘వసు దీని మీద రిషికి తెలియకుండా సంతకం పెట్టించి తీసుకునిరా’ అంటుంది.ఇబ్బంది పడుతుంది.
వసు: ‘మేడమ్ ఇది మంచి పనే అయినా.. తనకు చెప్పకుండా చేయడం కరెక్ట్ కాదేమో? నాకు చాలా భయంగా ఉంది మేడమ్’ 
జగతి: ‘ఏం కాదు వసుధారా.. ప్లీజ్ వెళ్లు.. భయపడుతూ వెళ్లకు.. రిషి కనిపెట్టేస్తాడు. పేపర్స్ చదివే అవకాశం ఉంటుంది. అనుమానం రాకుండా సంతకాలు పెట్టించి తీసుకునిరా’ 


మరోవైపు సౌజన్యారావు కాల్ చేసిన విషయం మహేంద్రకు చెబుతాడు ఫణీేంద్ర.  ఈ విషయం రిషికి తెలుసా అంటే.. తెలియదు మహేంద్ర...సౌజన్యారావు వచ్చి కలసి వెళ్లిన తర్వాత చెబుదామని ఆగాను...


వసుధార అయిష్టంగానే రిషి క్యాబిన్ కి వెళుతుంది. మొత్తం సంతకాలు పెట్టేస్తాడు. ‘ఏంటి వసుధారా ఇన్ని పేపర్స్ ఉన్నాయి ఈ రోజు?’ అంటాడు రిషి సంతకం చేస్తూ.. ‘సార్ అది.. అది.. మెషిన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినవి.. అని అబద్దం చెప్పేస్తుంది. ‘ఆల్ ది బెస్ట్ ఎండీ గారు’ అని చెబితే ఇప్పుడేంటని అడుగితే..ఊరికే చెప్పానంటూ అక్కడి నుంచి బయటపడుతుంది. రిషి సంతకం పెట్టిన ఫైల్‌ని జగతికి ఇస్తుంది.
జగతి: ‘వసుధార నువ్వేం టెన్షన్ పడొద్దు.. మనం చేసేది మంచి పనే.. మంచే జరుగుతుంది’


సౌజన్యరావు..ఫణీంద్ర,మహేంద్ర, దేవయానిలను ఇంట్లోనే కలుస్తాడు. ‘మా ప్రపోజల్‌కి నో అన్న రిషి.. ఆవేశంలోనో ఆలోచనతోనో మా కాలేజ్‌ని మీ కాలేజ్‌లో కలపమని చెప్పాడు. నాకు అది నచ్చింది.. నేను సిద్ధమే’ అంటాడు కూల్‌గా. మహేంద్ర వాళ్లు షాక్ అవుతారు.